శ్రీకాకుళం

రాహుల్ నాయకత్వాన్ని ప్రజలు నమ్ముతున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, డిసెంబర్ 12: ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభంజనం వచ్చిందని, రాహుల్ నాయకత్వాన్ని ప్రజలు నమ్ముతున్నారని మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి అన్నారు. ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో బుధవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రాహుల నాయకత్వాన్ని ఆమోదిస్తున్నారన్నారు. ఇది సెమీ ఫైనల్‌గా భావిస్తున్నామన్నారు. మోదీ విధానాలపై వ్యతిరేకత ఉందని, ఛత్తీస్‌గడ్, రాజస్థాన్, మద్యప్రదేశ్ రాష్ట్రాలలో కాంగ్రెస్ విజయం సాధించిందని అన్నారు. ఐదు రాష్ట్రాల్లో 82 బహిరంగ సభల్లో నిర్విరామ పోరాటం రాహులు చేశారని తెలియజేశారు. 2019 ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కి బీజేపీ చేరుకుంటుందని తెలిపారు. రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడానికి స్పష్టమైన సంకేతమని అన్నారు. పెరిగిన ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయావన్నారు. మిగిలిన రెండు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని తెలియజేశారు. కేసి ఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి వెంటనే అభ్యర్థులను ఖరారు చేసి పుష్కలంగా ధనాన్ని కుమ్మరించారన్నారు. ఉమ్మడి లక్ష్యంతో పనిచేయడానికి సమయం సరిపోలేదని అన్నారు. కేసి ఆర్ 2019 ఎన్నికల్లో ఏదో రాజకీయ పార్టీ తరుపున ప్రచారం చేస్తానని ప్రకటించారని, ఆంధ్రప్రదేశ్‌కి ఏ ముఖం పెట్టుకొని వస్తారని ప్రశ్నించారు. కేసి ఆర్‌కి దమ్ము, ధైర్యం ఉంటే ఏపీలో ఏదో ఒక పార్టీ తరుపున ప్రచారం చేయాలని, నిండుమనసుతో ఆహ్వానిస్తున్నామన్నారు. రాజ్యాంగ వ్యవస్థ, న్యాయవ్యవస్థపై కేంద్రప్రభుత్వం తీవ్రంగా దాడిచేసిందన్నారు. స్వతంత్య్ర ప్రతిపత్తిగల సంస్థలపై దాడి జరుగుతుందని పేర్కొన్నారు. గవర్నర్ వ్యవస్థను చెప్పుచేతల్లోకి తీసుకున్నారన్నారు. 2019 ఎన్నికల్లో ఇదే పరిణామం వస్తుందని తెలియజేశారు. 5లక్షల కోట్లు ప్రయోజనం చేకూర్చే బిల్లును యుపి ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, అవన్నీ జరగాలంటే రాహుల్ ప్రధాని కావాలని అన్నారు. మూడురాష్ట్రాల ప్రజలకు కాంగ్రెస్‌పార్టీ తరుపున కృతజ్ఞతలు తెలియజేశారు. మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్ మాట్లాడుతూ ఏ ఐసిసి అధ్యక్షునిగా రాహుల్ గాంధి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ అన్ని విధాల పుంజుకుంటుందన్నారు. బీజేపీ ప్రజలను మభ్యపెట్టి వాగ్ధానాలు చేసిందని పేర్కొన్నారు. రైతు సమస్యలను పట్టించుకోవడం లేదని, నాలుగన్నర సంవత్సరాల పాలన అధ్వాన్నంగా మారిందన్నారు. పెద్దనోట్లు రద్దువలన అందరికి ఆర్థిక నష్టం వాటిల్లందని పేర్కొన్నారు. జి ఎస్టీతో సామాన్యుడి మీద పన్ను భారం పడుతుందని తెలియజేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుందన్నారు. మూడు రాష్ట్రాల్లో అఖండ విజయం సాధించినట్లు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు రైతు, ఎస్సీ, ఎస్టీ, బడుగు, బలహీన వర్గాలు, పేదల కోసం పనిచేస్తుందని తెలియజేశారు. 2019లో కూడా కాంగ్రెస్‌పార్టీ అఖండ విజయం సాధిస్తుందని అన్నారు. ముందుగా టపాసులును కాల్చి ఆనందోత్సవాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కిల్లి రామ్మోహన్,చౌదరి సతీష్, ముస్తాక్ మహమ్మద్, డి ఎస్‌పి ప్రసాద్, సనపల అన్నాజీరావు, అల్లిబిల్లి రాధ, బాన్న రాము, గోవింద మల్లిబాబు, కొంక్యాన మురళి, పైడి రవి, కనుగుల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.