శ్రీకాకుళం

ఆర్టీసీని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు మానుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకొండ, డిసెంబర్ 12: ఆర్టీసీ యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలతో గుర్తింపు సంఘమైన ఈయూతో చర్చించకుండా సర్కులర్ జారీ చేసే విధానం విడనాడాలని, ఔట్‌సోర్సింగ్ పద్దతిలో ఆర్టీసీని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు మానుకోవాలని స్థానిక డిపో కార్యదర్శి దుమ్మెద దుర్గారావు అన్నారు. రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు బుధవారం డిపో గేటు వద్ద రెండోరోజులో భాగంగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేతన సవరణ వెంటనే జరిపించాలని, కార్మిక సంఘాలకు రాయితీలు ఇప్పించాలని, క్లరికల్ సిబ్బందిని కుదించే చర్యలు మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఈయూ నాయకులు డి.జి.రావు, పాత్రో, రాజారావు, రాజబాబు తదితరులు పాల్గొన్నారు.
చెత్త సంపద కేంద్రాలను సత్వరమే పూర్తి చేయాలి
రేగిడి, డిసెంబర్ 12: మండలంలోని 32 పంచాయతీల్లో చెత్త సంపద కేంద్రాల నిర్మాణాలను తక్షణమే పూర్తి చేయాలని ప్రత్యేకాధికారి ప్రసాద్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలంలో ఐదు పంచాయతీల్లో చెత్త సంపద కేంద్రాలు నిర్మాణాలు పూర్తయ్యాయని, మరో ఐదు పంచాయతీల్లో నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. అలాగే మండలంలో 356 మరుగుదొడ్లు నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్నట్టు ఆయన దృష్టికి రాగా వాటిని కూడా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శంకరరావు తదితర అధికారులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలు వినియోగించుకోండి
పాలకొండ (టౌన్), డిసెంబర్ 12: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందని, వాటిని ప్రజలంతా వినియోగించుకోవాలని అరకు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ రామ్మోహన్‌రావు కోరారు. బుధవారం పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ తాడంగి సునీత ఆధ్వర్యంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జనధన్‌యోజన, ముద్రాబ్యాంక్, ఆడపిల్లల కోసం బేటీ బచావో..బేటీ పడావో వంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ప్రధాని మోడీదేనన్నారు. ఈ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోటగిరి నారాయణరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పురిపండ శ్రీనివాసరావు, మండల అధ్యక్షులు రవీంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.
మారుమూల గ్రామాల అభివృద్ధి
ఎల్ ఎన్‌పేట, డిసెంబర్ 12: మారుమూల గ్రామాల్లో వౌళిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అన్నారు. బుధవారం మండలంలోని లక్ష్మీనర్సుపేట గ్రామంలో బాలికల వసతిగృహ భవన నిర్మణానికి శంకుస్థాపన చేశారు. అలాగే తురకపేట నుంచి కృష్ణాపురం రహదారికి నిర్మించిన సీసీ రహదారిని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్య, వైద్య రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. బాలికల విద్యను ప్రోత్సహించడానికి రూ.కోటి 90 లక్షలతో బాలికల కోసం వసతిగృహం నిర్మించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే రూ.14 లక్షలతో చేపడుతున్న ప్రహరీగోడ నిర్మాణం కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అలాగే రైతు బంధు పథకం ద్వారా మంజూరైన ట్రాక్టర్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాహ్వానితులు ఒమ్మి ఆనందరావు, జెడ్పీటీసీ ప్రతినిధి వెలమల గోవిందరావు, ఏ ఎంసీ చైర్మన్ మన్మధరావు, లక్ష్మీనర్సుపేట, హిరమండలం పీహెచ్‌సీల అధ్యక్షులు లావేటి మల్లేశ్వరరావు, ప్రశాంత్‌కుమార్, ఎల్ ఎన్‌పేట, హిరమండలం టీడీపీ అధ్యక్షులు కిషోర్‌బాబు, జగన్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
అర్హులైన ఓటర్లును నమోదు చేయాలి
హిరమండలం, డిసెంబర్ 12: అర్హులైన ఓటర్లు అందరినీ ఓటర్ల జాబితా నమోదయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని వైకాపా కన్వీనర్ అల్లు శంకరరావు కోరారు. ఈ మేరకు బుధవారం హిరమండలం తహశీల్దార్ ఐ.టి.కుమార్‌కు వినతిపత్రం అందించారు. ఓటర్ల జాబితాలో అర్హులైన వారిని నమోదు కావడం లేదన్నారు. వీటి దృష్ట్యా తప్పనిసరిగా ఓటర్లను నమోదు చేసేందుకు బీ ఎల్‌వోలు సక్రమంగా చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ పాల్గొన్నారు.