శ్రీకాకుళం

ఓటర్లు నమోదును సక్రమంగా చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగాం, డిసెంబర్ 12: ఓటర్లు నమోదు కార్యక్రమాన్ని సక్రమంగా చేపట్టాలని టెక్కలి ఆర్డీవో వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక మండల పరిషత్ సమావేశ భవనంలో బూత్‌లెవల్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 జనవరి 1వ తేది నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటర్లు జాబితాలో చేర్చాలన్నారు. ఓటర్లు జాబితా ఫారమ్‌లో ఎటువంటి అక్రమాలు జరగకుండా సమర్థవంతంగా జాబితాలను రూపొందించాలన్నారు. బూత్ లెవల్ అధికారులు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి అర్హులైనవారిని గుర్తించాలన్నారు. జాబితాల సవరణలో అక్రమాలు జరిగితే కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. తహసీల్థార్ రామచంద్రరావు, డిటీ లక్ష్మినారాయణ పాల్గొన్నారు.

నా విశ్వాసాన్ని వమ్ముచేయకండి: మంత్రి అచ్చెన్న
కోటబొమ్మాళి, డిసెంబర్ 12: తన ప్రత్యర్థులకు ప్రతి ఎన్నికలలో ఓటు వేస్తున్న గ్రామస్తులకు తాను ఎంత అభివృద్ధి చేస్తున్నా వారికే శతశాతం ఓట్లు వేస్తున్నారని, ఈసారైనా నా కడసారి విశ్వాసాన్ని వమ్ముచేయవద్దు అని రాష్ట్ర రవాణా, బీసీ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మండలంలోని చవితిపేట గ్రామానికి కోటి 26 లక్షల రూపాయలతో నిర్మించే తారురోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తానే అభివృద్ధి చేసానని, ఇప్పుడు కూడ తాను అభివృద్ధి చేసి చూపుతున్నానని, ఈ ఒక్కసారి అయిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ప్రజలు ఆదరించాలన్నారు. ఒక సామాజిక కులం గ్రామాల్లో ఇటీవల వరుసగా మంత్రి రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. ఆయా గ్రామాల్లో సీసీ రోడ్లు, పలు అభివృద్ధి కార్యక్రమాలను చేసారు. ఆయా గ్రామాల్లో ఎన్నికలు వచ్చే ప్రతిసారి ప్రత్యర్థులకు ఓట్లు పడుతుండడంతో కొంత అభివృద్ధికి దూరం ఉంచిన మంత్రి అయ్యాక ఈసారి ఆయా గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టి రోడ్లు, తాగు,సాగునీటి సౌకర్యాలు కల్పిస్తూ ప్రజలు ముందుకు వెళ్తున్నారు. ఆయా గ్రామాల్లో మంత్రి దాదాపు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు ఓటర్లును అభ్యర్థిస్తున్నారు. అందులోభాగంగా తన స్వగ్రామం నిమ్మాడకు కూతవేటు దూరంలో చవితిపేటకు జాతీయరహదారి నుంచి రోడ్డుసౌకర్యం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రాంతానికి సాగునీటి సౌకర్యం కల్పించానని, ఇంకా మిగిలి వున్న మంచినీటి పథకాలకు అర్హులు ఉంటే వివరాలు చెబితే తక్షణమే వారికి మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రమేష్, రామకృష్ణ, పద్మశ్రీనివాస్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
సీ ఎం సహాయనిధి చెక్కు పంపిణీ
కోటబొమ్మాళి, డిసెంబర్ 12: పాలకొండకు చెందిన రాంబాబుకు సీ ఎం సహాయనిధి ద్వారా 48 వేల రూపాయలు చెక్కును మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అందజేసారు. నిమ్మాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ చెక్కును మంత్రి అందజేసారు. అనారోగ్యంతో బాధపడుతున్న రాంబాబుకు ఈ ఆర్థికసహాయం అందజేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
గ్రామాలకు విస్తరించిన డిజిటల్ సేవలు
కొత్తూరు, డిసెంబర్ 12: గ్రామీణ ప్రాంతాల్లో సైతం డిజిటల్ సేవలందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అన్నారు. మండలంలోని మాతలలో మనసేవ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. మీసేవ కేంద్రం మాదిరిగానే ప్రభుత్వ ఆధీనంలో మనసేవ కేంద్రం పనిచేస్తుందన్నారు. ఈ కేంద్రం ద్వారా డిజిటల్ పంచాయతీ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ కేంద్రంలో బ్యాంకు ఖాతా ద్వారా నగదు వసూళ్లు, జమలతో పాటు పొదుపు చేయడం జరుగుతుందన్నారు. వీటితో పాటు మరికొన్ని సేవలు ఈ కేంద్రం ద్వారా మన సేవ కేంద్రాన్ని వినియోగించుకోవాలన్నారు. మాతల ఎంపీటీసీ మోహనరావు, పీ ఏసీ ఎస్ డైరెక్టర్ కలమట జమ్మినాయుడు, టీడీపీ నాయకులు తేజేశ్వరరావు, మహిళా సంఘం సభ్యులు ఉన్నారు.
యంత్రం ద్వారా మురుగునీటి కాలువలు పరిశుభ్రం
కొత్తూరు, డిసెంబర్ 12: స్వచ్ఛాంధ్రప్రదేశ్‌లో భాగంగా పంచాయతీలకు వీధి కాలువల్లో ఉన్న మురుగును, చెత్తను తొలగించేందుకు ప్రభుత్వం యంత్రాలను సమకూర్చిందని ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అన్నారు. పంచాయతీకి మురుగుకాలువలు శుభ్రం చేసేందుకు మినీ జేసీబీ యంత్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మరుగునీటి కాలువలను శుభ్రం చేసేందుకు పంచాయతీ సిబ్బంది అంతగా స్పందించడం లేదన్నారు. అందుకోసం గ్రామీణ ప్రాంతాల్లో కాలువుల్లో ఉన్న చెత్తాచెదారాలు తొలగించేందుకు ఈ యంత్రం ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అగతముడి బైరాగినాయుడు, ఎంపీడీవో ప్రసాదరావు, ఎంపీటీసీ ప్రతినిధులు శ్రీనివాసరావు, జనార్థనరావు, పీ ఏసీ ఎస్ డైరెక్టర్ తిరుపతిరావు ఉన్నారు.