శ్రీకాకుళం

బాధితులను ఆదుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలుమూరు, డిసెంబర్ 14: ప్రముఖ పుణ్యక్షేత్రం మండలం శ్రీముఖలింగం ఆలయ ఆవరణ అభివృద్ధి కోసం తొలగించిన ఇళ్ల స్థలాల బాధితులకు ఆదుకోవాలని బాధితులు పలువురు శుక్రవారం శ్రీముఖలింగం వచ్చిన టెక్కలి ఆర్డీవో వెంకటేశ్వర్లు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ ప్రాంగణంలో దేవాదాయ శాఖ విశ్రాంతి భవనం వద్ద బాధితులతో చర్చించారు. ఈ సందర్భంగా గతంలో రోడ్లు అభివృద్ధికోసం ఇళ్లుకోల్పోయిన వారికి సరైన న్యాయం జరగలేదని, ప్రస్తుతం ఆలయ మాడ వీధుల అభివృద్ధి కోసం నష్టపోయిన బాధితులకు అదే పరిస్థితి ఎదురయిందని పలువురు బాధితులు ఆవేదన తెలియజేశారు. ఇళ్లు కోల్పోయిన వారికి గ్రామశివారు పొలిమేరల్లో స్థలాలు కేటాయించడం విచారకరమని, పిల్లల చదువులకు, వృద్ధుల ప్రయాణానికి పలు ఇబ్బందులు ఎదురవుతాయని వీరు ఆందోళన చెందారు. ఆయనతోపాటు రోడ్లు భవనాల శాఖ ఈ ఈ రమణరావు, డి ఈ శ్రీనివాసరావు, తహశీల్దార్ కె.ప్రవళ్లికప్రియ, పలు శాఖాధికారులు, స్థానిక ఎంపీటీసీ ప్రతినిధి తమ్మన్నగారి సతీష్, మాజీ సర్పంచ్ ప్రతినిధి తర్ర బలరాం పలువురు పాల్గొన్నారు.

ఆలయ ఆదాయ వివరాలు తెలుసుకుంటున్న ఏసి పుష్పనాధం
జలుమూరు, డిసెంబర్ 14: శ్రీముఖలింగం దేవాదాయ శాఖా పరిథిలో ఉన్న భూములు, ఇతర ఆస్థుల వివరాలను ఆశాఖ అసిస్టెంట్ కమీషనర్ పుష్పనాధం శుక్రవారం కార్యనిర్వాహణ అధికారి వివి ఎస్ నారాయణను అడిగి తెలుసుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఆస్థులను, స్థలాలను స్వయంగా పరిశీలించారు. దేవాదాయశాఖ పరిథిలో ఉన్న మదుకేశ్వర, లక్ష్మీనర్శింహస్వామి ఆలయానికి వున్న భూముల వివరాలను, రికార్డులను పరిశీలించారు. కార్తీకమాసం ఆలయానికి వచ్చిన ఆదాయం, పలు విషయాలను ఈవోను, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ముందుగా మధుకేశ్వరస్వామిని దర్శించి పూజలు చేపట్టారు. ఆలయ అర్చకులు ఆయనకు కండువా వేసి సత్కరించి ఆశీర్వచనాలు అందించారు.
గుట్కా పట్టివేత
టెక్కలి, డిసెంబర్ 14: స్థానిక ఇందిరాగాంధీ జంక్షన్ వద్ద అక్రమంగా తరలిస్తున్న గుట్కాబస్తాలను పట్టుకున్నట్లు శుక్రవారం టెక్కలి ఎస్ ఐ సురేషుబాబు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఒడిస్సా రాష్ట్రం, పర్లాకిమిడి నుంచి అక్రమంగా గుట్కాను తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో ఎస్ ఐ తన బృందంతో వెళ్లి గుట్కాను రవాణా చేస్తున్న టెక్కలికి చెందిన జామి శ్రీనివాస్, వెంకటరమణలను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి సుమారు 15 వేల రూపాయలు విలువ చేసే గుట్కా ప్యాకేట్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ తెలిపారు.
తిత్లీ తుపాన్ నష్టపరిహారం మంజూరు చేయండి
సంతబొమ్మాళి, డిసెంబర్ 14: ఇటీవల సంభవించిన తుపాన్ వల్ల నష్టపోయినవారికి నష్టపరిహారం తక్షణమే మంజూరు చేయాలని మండల టీడీపీ ఏకగ్రీవంగా తీర్మానించింది. మండల తెలుగుదేశం పార్టీ సమావేశం మండల టీడీపీ అధ్యక్షుడు బీమారావు అధ్యక్షతన శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా బీమారావుతోపాటు మండల టీడీపీ అధికార పార్టీ ప్రతినిధి సూరాడ ధనరాజు, కె.విష్ణుమూర్తి,్ధర్మాన్జునరెడ్డిలు మాట్లాడుతూ తిత్లీ తుపాన్ వల్ల మండల రైతులు, మత్స్యకారులు, వివిధ వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, అధికారులు నష్టాలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి పంపించినా ఇంతవరకు మంజూరు కాలేదన్నారు. మండల మాజీ సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు రెడ్డి అప్పన్న మాట్లాడుతూ టీడీపీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాసరావు, నాగభూషణరావు, ప్రసాదరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాష్టస్థ్రాయి షూటింగ్‌బాల్ పోటీలకు మర్రిపాడు విద్యార్థి
సంతబొమ్మాళి, డిసెంబర్ 14: మండలంలో మర్రిపాడు ఉన్నత పాఠశాలకు చెందిన ఉదయ్‌కిరణ్, గణపతిలు రాష్టస్థ్రాయి షూటింగ్‌బాల్ పోటీలకు ఎంపికైనారు. ఈ నెల 16 నుంచి 17వ తేది వరకు విజయవాడలో జరగనున్న ఈ పోటీల్లో పాల్గొంటారని హెచ్ ఎం మల్లేశ్వరరావు తెలిపారు. ఈ ఎంపిక పట్ల పి ఎసి ఎస్ అధ్యక్షుడు ఎ.రాంప్రసాదరావు అభినందనాలు తెలిపారు. సీతానగరం ఎంపియుపి పాఠశాలలో బాలల ఆరోగ్యరక్ష కార్యక్రమం నిర్వహించారు. సంతబొమ్మాళి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు పదవ తరగతి ఫలితాలపై తల్లిదండ్రులతో హెచ్ ఎం చలం సమావేశమైనారు.

తిత్లీ తుపాన్ బాధితులందరికి న్యాయం జరగాలి
వజ్రపుకొత్తూరు, డిసెంబర్ 14: తిత్లీ బాధితులందరికి పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందినప్పుడే న్యాయం జరుగుతుందని ఎంపీపీ వసంతస్వామి అన్నారు. శుక్రవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల సర్వసభ్యసమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిత్లీ తుపాన్ ప్రభావంతో పదేళ్లు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. తుపాన్ సమయంలో అధికారులు స్పందించిన తీరు ప్రశంసనీయంగా ఉందన్నారు. పాడిరైతులు గోకులం షెడ్లు నిర్మించుకోవడానికి రైతుల భాగస్వామ్యం 10 నుంచి 30 శాతానికి పెంచడం జరిగిందని పశువైద్యాధికారి ఎం.పాపారావు తెలిపారు. రబీపంటలకు ఇన్సూరెన్స్ రైతులు ఈ నెల 17వ తేదిలోగా చేయించుకోవాలని ఏవో ధనుంజయ సూచించారు. 2019-20 ఆర్థికసంవత్సరానికి సంబంధింన బడ్జెట్‌ను ఈ సభలో ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సమావేశంలో జడ్‌పీటీసీ నీలవేణి, తహసీల్థార్ రమణయ్య, ఎంపీడీవో తిరుమలరావు, అధికారులు పాల్గొన్నారు.

కార్యకర్తలకు టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది
వజ్రపుకొత్తూరు, డిసెంబర్ 14: పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని గోవిందపురం పిహెచ్‌సీ అభివృద్ధి కమిటీ చైర్మన్ పి. ఈశ్వరరావు అన్నారు. శుక్రవారం ఉద్దానంగోపినాధపురంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ద చూపించేది టీడీపీ మాత్రమేనన్నారు. కార్యకర్తల తరపున బీమాను చెల్లించి వారి కుటుంబసంక్షేమానికి పార్టీ తోడ్పాడుతుందన్నారు. టీడీపీ సభ్యత్వం పొందడం అరుదైన గౌరవంగా ప్రతి ఒక్కరూ భావించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల విప్ ఢిల్లేశ్వరీరమణ, టీడీపీ ఉపాధ్యక్షుడు ఎం.జోగారావు, కృష్ణ, నూకరాజు, జగన్నాధరావు, రాజారావు, దుర్యోదన పాల్గొన్నారు.

అభివృద్ధి చూసి ఓటెయ్యండి: మంత్రి అచ్చెన్న
నందిగాం, డిసెంబర్ 14: అభివృద్ధిని చూసి ఓటెయ్యాలని రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ మేరకు మండలంలోని కాపుతెంబూరు నుంచి సింగుపురం వరకు 3 కోట్ల రూపాయలతో నిర్మాణంకానున్న బీటీరోడ్డుకు శుక్రవారం శంకుస్థాపన చేసారు. పెద్దతామరాపల్లి నుంచి కోమటూరుకు 76 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు, కాపుతెంబూరు నుంచి మజ్జిగోపాలపురంకు 36 లక్షల రూపాయలతో బీటీ రోడ్లుకు కూడ శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం హాయంలోనే టెక్కలి నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్నారు. రానున్న 2019 ఎన్నికలలో అభివృద్ధి చూసి ప్రజలంతా ఓటు వేయాలని కోరారు. దేశం ప్రభుత్వం బడుగు,బలహీనవర్గాల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. సీ ఎం చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అహర్నిశలు కృష్టపడి అభివృద్ధి పథంలో పయనింపజేస్తున్నారన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు చంద్రబాబునాయుడు సమర్థవంతంగా ఎదుర్కొని విపత్తులు నుంచి ప్రజలను కాపాడడంలో ఎంతో సాహసవంతుడు అని అన్నారు. ప్రతిపక్షనాయకుడు పాదయాత్రలతోనే కాలాన్ని వెళ్లబుచ్చుతున్నారు తప్ప ప్రజలు కోసం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నందిగాం మండలాన్ని జిల్లాలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానన్నారు. మరోసారి తనకు అవకాశం కల్పిస్తే రాష్ట్రంలోనే టెక్కలి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ప్రథమ స్థానంలో నిలబెడతానన్నారు. ఈ కార్యక్రమంలో వంశధార డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ బాలకృష్ణ, టీడీపీ నాయకులు అజయ్‌కుమార్, చంద్రశేఖర్, మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
-ళనఆ

ఎస్‌సీఎస్‌పీ పనుల పూర్తికి చర్యలు
ఇచ్ఛాపురం, డిసెంబర్ 14 : నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలలో ఎస్‌సీ స్పెషల్ ప్రోగ్రామ్ కింథ 149 కోట్ల రూపాయల అంచనాతో ప్రతిపాదించిన పనులను పూర్తి చేయటానికి ప్రాధాన్యమిస్తున్నామని మున్సిపల్ పరిపాలన శాఖ రీజినల్ డైరెక్టర్ ఎస్.ఎస్.వర్మ చెప్పారు. శుక్రవారం ఆయన మున్సిపల్ చైర్‌పర్సన్ పి.రాజ్యలక్ష్మి, కమిషనర్ రామలక్ష్మి, ఉద్యోగులతో సమీక్ష నిర్వహించారు. విలేకరులతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాలలో 149 కోట్లతో 914 పనులు ప్రతిపాదించగా ఇప్పటివరకు 117 మాత్రమే పూర్తయినట్టు చెప్పారు. సాంకేతిక కారణాలు, ఇసుక సమస్య, జీఎస్‌టీ వల్ల జాప్యం జరిగిందన్నారు. పనులన్నింటినీ ఫిబ్రవరి 15లోగా పూర్తి చేయాలని కమిషనర్లను ఆదేశించామని చెప్పారు. లేకపోతే నిధులు వెనక్కిమళ్లుతాయని తెలిపారు. ఇచ్ఛాపురంలో 5.52 కోట్లతో 26 పనులు చేపట్టాల్సి ఉండగా ఒక్కటీ ప్రారంభం కాలేదన్నారు. మున్సిపల్ పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించటానికి కృషి చేస్తున్నామని తెలిపారు. అనంతరం మున్సిపల్ బాలికోన్నత పాఠశాలను సందర్శించారు. శానిటేషన్ ఇన్‌చార్జి ఉపేంద్ర పాల్గొన్నారు.

విశ్రాంతి భవనానికి భూమిపూజ
ఇచ్ఛాపురం(రూరల్), డిసెంబర్ 14: మండలంలో కేసుపురంలో విశ్రాంతిభవనానికి శుక్రవారం ఎంపీపీ దక్కత ఢిల్లీరావు భూమిపూజ చేసారు. 2 లక్షల 50 వేల రూపాయలతో ఈ భవనం నిర్మించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటికే గ్రామాల్లో 90 శాతానికిపైగా అభివృద్ధి చేసామని, ఈ కొద్ది రోజుల్లో మిగిలిన పనులను పూర్తి చేస్తామన్నారు. టీడీపీపై ప్రజల్లో వున్న నమ్మకాన్ని నిలబెట్టుకొని పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హేమసుందర్, కామేషు, హరికృష్ణ, కృష్ణారావు, జోగారావు, రవి, వెంకటరావు పాల్గొన్నారు.

అందరి సహకారంతో గ్రామాల అభివృద్ధి
ఇచ్ఛాపురం(రూరల్), డిసెంబర్ 14:గ్రామాల అభివృద్ధికి గ్రామంలోని ప్రతివారి సహకారం అవసరమని స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ కె.సూర్యనారాయణ తెలిపారు. కవిటి మండలం, బెజ్జిపుట్టుగ గ్రామంలో శుక్రవారం గ్రామదర్శిని కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డెప్యూటీ కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలన్నారు. స్వచ్ఛ్భారత్ పాటిస్తూ తాగునీటి విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు పొందేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకొని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రత్యేక నిధులు మంజూరుచేసిందన్నారు. గ్రామాల్లో ఆరోగ్యం, విద్య సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్‌పీటీసీ కృష్ణారావు, అంగన్‌వాడీ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం: మంత్రి అచ్చెన్న
టెక్కలి, డిసెంబర్ 14: రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికి అనేక అభివృద్ధి కార్యక్రమలతోపాటు మారుమూల గ్రామాలకు చెందిన తారు, సిమ్మెంట్ రోడ్డు నిర్మాణానికి యుద్దప్రాతిపదికగా నిర్మించడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం మండలంలో అంజనాపురం జాతీయరహదారి నుంచి సవరగోపాలపురం మీదుగా నువ్వుగుడ్డి గ్రామానికి సుమారు 3 కోట్ల రూపాయల ఎస్‌టీజీ నిధులతో బీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలతోపాటు సంక్షేమ పథకాలు ప్రజలకు అందివ్వడంలో ఎక్కడా రాజీలేకుండా అహర్నిశలు కృషి చేస్తున్నామని, తెలుగుదేశం ప్రభుత్వానికి సహకరిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. మండలం నుంచి గ్రామాలకు బీటీరోడ్లు, గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించడం చాలా వరకు జరిగిందని, పూర్తిస్థాయిలో నిర్మించిన తర్వాత ఎన్నికలకు మీ ముందుకు వస్తామన్నారు. గత ప్రభుత్వ హాయంలో నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గ ప్రజలు గత నాలుగేళ్లులో పూర్తిస్థాయిలో అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అనంతరం పోలవరం సమీపంలో సీసీ రోడ్డు నుంచి పెద్దసాన మీదుగా పరశురాంపురం గ్రామం వరకు 2.40 కోట్ల రూపాయలతో ఎస్‌టిజీ నిధులతో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. జిల్లాలో టీడీపీ సభ్యత్వం సాధించిన సందర్భంగా టీడీపీ కార్యకర్తల మధ్య కేక్‌ను కట్ చేసి అభినందనాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుందరమ్మ, జడ్‌పిటీసీ సుప్రియ, వంశధార డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ బాలకృష్ణ, ఎంపీడీవో హరిహరరావు, తహసీల్థార్ అప్పలరాజు, మండల ఇంజనీర్ రమేష్, టీడీపీ నాయకులు డి.రమేష్‌కుమార్, మామిడి రాము, నాగమణి, పురుషోత్తం, చాపర గణపతి, మాజీ సర్పంచ్‌లు బాలకృష్ణ, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.