శ్రీకాకుళం

ఆరోపణలు రుజువు చేయగలవా జగన్??

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, డిసెంబర్ 14: మాఫియా డాన్ అని, భూకబ్జాలు చేసినట్టు రుజువు చేస్తే రాజకీయాల నుంచి వైదొలగుతానని, రుజువు చేయలేకపోతే సిక్కోల్ నుంచే రాజకీయ సన్యాసిగా వెనుదిరుగుతావా జగన్? అంటూ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ సవాల్ చేశారు. ఇసుక మాఫియా డాన్ తమ్మినేని సీతారాం, ఆయన చుట్టూ గల వైసీపీ ఎంపీపీలే అంటూ ఆరోపించారు. సుగర్ ఫ్యాక్టరీ అంశం న్యాయస్థానం పరిధిలో ఉందని, అటువంటి ఫ్యాక్టరీని తెరిపిస్తానంటూ మాయమాటలు చెబితే ఇక్కడి ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. సుగర్ ఫ్యాక్టరీ తెరిపించేది, రైతులను ఆదుకునేది టీడీపీయే అన్నారు. సంకల్పయాత్రలో భాగంగా ఒక బహిరంగ సభలో జగన్ స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కూన రవికుమార్‌ను భూకబ్జాదారుడు, ఇసుక మాఫియా డాన్ అంటూ విమర్శించిన విషయం తెలిసిందే. ఆయన విమర్శలకు ప్రతివిమర్శ చేస్తూ రవికుమార్ శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్‌పై ఆగ్రహించారు. తన పక్కనే ఇసుక మాఫియా డాన్‌ను పెట్టుకుని, వైసీపీ ఎంపీపీలే అక్రమ ఇసుక దందాలు చేస్తుంటే - తనపై ఆరోపణలు చేస్తూ డాన్ అంటూ సంబోధించడాన్ని నియోజకవర్గం ప్రజలు అంగీకరించరన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. హత్యలు చేయడం, మాఫియాలు నడపడం జగన్ రక్తంలోనే ఉందన్నారు. రాష్ట్రంలో నేరచరిత్ర కలిగిన ఏకైక కుటుంబం వైఎస్సార్‌దే అని విమర్శించారు. జగన్ తాత రాజారెడ్డి ముగ్గురాళ్ళ గనిలో కూలీగా పని చేసే వారన్నారు. 1964లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు తమ కుటుంబానికి చెందిన 234 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించామని రవికుమార్ స్పష్టం చేశారు. ఇప్పటికీ తమ కుటుంబానికి చెందిన 130 ఎకరాల భూమి రైతుల వద్దనే ఉందని, దానిని వారికే విడిచి పెట్టేశామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం ఇచ్చిన 1200 ఎకరాల అసైన్డ్ భూమిని రాజారెడ్డి బెదిరించి లాక్కోలేదా అని ప్రశ్నించారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ భూమిని తిరిగి ప్రభుత్వానికి అప్పగించిన విషయాన్ని కూన గుర్తు చేశారు. ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు ముద్దాయిగా హాజరయ్యే జగన్ తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ విలువ ప్రకారం రూ. 43 వేల కోట్లు దోచుకున్నారని సీబీఐ అభియోగ పత్రం జారీ చేసిందన్నారు. అక్రమాస్తుల కేసులో ఎ1, ఎ2 ముద్దాయిలుగా ఉన్న జగన్, విజయసాయ్‌రెడ్డి రాష్ట్రానికి నాయకులంటూ చెప్పుకురావడం శోచనీయమన్నారు. తమ్మినేని సీతారాం పక్కనే పెట్టుకుని జగన్ ఆమదాలవలస సుగర్ ఫ్యాక్టరీ కోసం మాట్లాడడం చూస్తుంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లు ఉందన్నారు. తిత్లీ తుపానుతో రెండు లక్షల కుటుంబాలు రోడ్డున పడితే పక్క జిల్లాలోనే యాత్ర చేస్తూ రాలేని జగన్ ఇప్పుడు పాదయాత్ర అంటూ పయనిస్తే ఆయా ప్రాంతాల్లో బాధితులు చూస్తూ ఊరుకోరన్నారు. అనవసరమై విమర్శలు మాని అభివృద్ధికి సహకరించాలని, విపక్షనేతగా ప్రజలకు మరిన్ని అభివృద్ధి ఫలాలు అందేలా కృషి జరుగుతోందన్న కనీస విజ్ఞత జగన్‌కు లేకపోవడం దురదృష్టకరమన్నారు.

జాడలేని ధాన్యం కొనుగోలు కేంద్రాలు
* ఇతర జిల్లాలకు తరలిపోతున్న ధాన్యం
* దళారుల చేతిలో రైతులు
నరసన్నపేట, డిసెంబర్ 14: రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది రైతులకు ఆదుకునే విధంగా మద్దతు ధరను ప్రకటించడమే కాకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి రైతులను ఆదుకునే విధంగా చర్యలు చేపట్టేదని, కాని నేడు వాటి జాడలు కనుమరుగయ్యే పరిస్థితులు స్పష్టంగా కన్పిస్తుండడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిశంబర్ నాటికే మద్దతు ధరలను ప్రకటించే ప్రభుత్వం కనుచూపు మేరల్లో దాని ప్రస్తావనే మర్చిపోయిందని, దీనికి తోడు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటులో దృష్టి సారించకపోవడంతో రైతులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాయకష్టం చేసి తుఫాన్‌లకు సైతం ఎదురొడ్డి శ్రమించి ధాన్యాన్ని పండించిన రైతులు దిక్కులేని పరిస్థితుల్లో తక్కువ ధరకే ఇతర జిల్లాలకు ధాన్యాన్ని అమ్ముకోవడం జరుగుతుందని వాపోతున్నారు. ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికి తమని ప్రభుత్వం ఆదుకుంటుందని ఎంతో ఆశతో ఎదురుచూసిన రైతులకు గట్టి దెబ్బే తగిలింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ముందస్థు వరిసాగును ప్రారంభించిన రైతులకు మాత్రం చుక్కెదురయింది. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించనున్న వెలుగు సిబ్బంది ఆకస్మిత సమ్మెలతో కొనుగోలు కేంద్రాలు నీరుగారిపోయాయి. రైతులకు భరోసా ఇస్తానన్న ప్రభుత్వం కనీసం కనె్నత్తి చూడకపోవడంతో అన్నదాత కరువుదాతగా మారిపోయే పరిస్థితులు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు చొరవ చూపి రైతులను ఆదుకోవాలని ముక్తకంఠంతో కోరుచున్నారు.