శ్రీకాకుళం

చిన్నారి కంటిచూపుపై శ్రద్ధ చూపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు, డిసెంబర్ 15: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కంటిచూపు కార్యక్రమంపై హెచ్ ఎంలు శ్రద్ధ వహించాలని ఎం ఈవో త్రినాధరావు సూచించారు. శనివారం ఎం ఆర్‌సీ భవనంలో మండలంలోని అన్ని పాఠశాలల హెచ్ ఎంలతో మాట్లాడారు. చిన్నారి కంటి చూపు కార్యక్రమం ప్రభుత్వ అమలు చేస్తుందని, కంటి తనిఖీలు నిర్వహించి నివేదికలు అందించాలని కలెక్టర్ ఆదేశాలున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎంలు, ఉపాధ్యాయులున్నారు. ఇదిలావుండగా ఉపాధ్యాయులు, ఎం ఈవోపై ఈ కార్యక్రమం విషయంపై వాగ్వివాదం జరిగింది. పని ఒత్తిడి కారణంగా విద్యార్థుల కంటి చూపు విషయాలు గమనించలేకపోతున్నామని ఎం ఈవో వద్ద వాపోవడం కనిపించింది.

గుబులు పుట్టించిన చిటపట చినుకులు
రాజాం, డిసెంబర్ 15: పెసాయి తుపాను ప్రభావంతో రాజాం ప్రాంతంలో శనివారం ఉదయం నుంచి మబ్బులు పట్టిన వాతవరణంతో వరి కోతలు చేసిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో చిరుజల్లులు కురవడంతో పొలాలకు పరుగులు తీసి కుప్పలుగా వేశారు. ఏది ఏమైనా కోస్తాంధ్రాలో వర్షాలు కురుస్తున్న తరుణంలో ఈ ప్రాంతానికి అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో కొంతమంది అప్రమత్తమై రాత్రికి రాత్రే యంత్రాలతో నూర్పులు చేసుకొని ధాన్యాన్ని భద్రపరిచారు. మరికొంతమంది మాత్రం పొలాల్లోనే కుప్పలు వేసి టార్పన్లు కప్పుతున్నారు. వరి పంటను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని రాజాం వ్యవసాయాధికారి రవికుమార్ సూచించారు.
పల్లా కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
రాజాం, డిసెంబర్ 15: రాజాం నగర పంచాయతీ సారధి గ్రామానికి చెందిన కాంట్రాక్టర్, వైకాపా సీనియర్ నాయకులు పల్లా అప్పలనాయుడు ఇటీవల మృతి చెందారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే కంబాల జోగులు తదితర నాయకులు సారధి గ్రామానికి చేరుకొని పల్లా అప్పలనాయుడు భార్య రాములమ్మ, తమ్ముడు భాస్కరరావును పరామర్శించారు. అప్పలనాయుడు వైకాపాకు బాధ్యతాయుతమైన సేవలందించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఉద్యోగ భద్రత కోసం కళాకు వినతిపత్రం
రాజాం, డిసెంబర్ 15: వెలుగు సిబ్బంది రాష్ట్ర ఇంధనశాఖామంత్రి కిమిడి కళా వెంకటరావును శనివారం ఆయన నివాసగృహంలో కలుసుకొని ఉద్యోగ భద్రత కోసం వినతిపత్రాన్ని అందించారు. 2014లో తమను క్రమబద్దీకరిస్తామని ప్రభుత్వం హామీనిచ్చినప్పటికీ ఇంతవరకు హామీ జరగలేదని, తమను రెగ్యులర్ చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. వీరి సమస్యను క్యాబినెట్‌లో చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని మంత్రి హామీనిచ్చారు.
చెత్త నుంచి సంపదపై అవగాహనా సదస్సు
రాజాం, డిసెంబర్ 15: మండలంలోని పొగిరి గ్రామంలో చెత్త నుంచి సంపద అనే అంశంపై శనివారం అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా 20 గ్రామ పంచాయతీల కార్యదర్శులు హాజరయ్యారు. ప్రతి పంచాయతీలో ఊరికి దూరంగా చెత్త నుంచి సంపద కేంద్రాలను ఏర్పాటు చేశారని, అయితే ఆ కేంద్రాలను పనిచేసే విధంగా కృషి చేయాలని ఎంపీడీవో వెంకటేశ్వరరావు, ఈవో ఆర్డీ కుమారస్వామి తదితరులు కోరారు.