శ్రీకాకుళం

అభివృద్ధిపై దృష్టి సారించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసన్నపేట, జూన్ 7: రాష్ట్రంలో 13వ జిల్లాగా ఉన్న శ్రీకాకుళం జిల్లా అట్టడుగు స్థాయికి దిగజారిపోయిందని దీనికి గల కారణం ప్రతీ ఒక్కరిలో అభివృద్ధి సాధించాలన్న ఆకాంక్ష లేకపోవటమే అని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం ఆవేదన వ్యక్తంచేశారు. మంగళవారం స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధి సాధించాలన్న కోరిక ప్రతీ ఒక్కరిలో కలిగిన నాడే గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. జిల్లాలో గత రబీ సీజన్‌లో రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి రూ.1000కోట్ల నిధులను విడుదల చేశామని అయినప్పటికీ నేటికీ కూడా రైతులకు డబ్బులు అందలేదని నిరాశ వ్యక్తం చేశారు. రైస్ మిలర్ల నిర్వాకం వల్లనే సుమారు రూ.300కోట్లకు పైగా బినామీల పేరుతో పక్కరాష్ట్రాలకు వెళ్లిపోయాయని, ప్రజాప్రతినిధులు, అధికారులు ముందస్తుగా దీనిపై దృష్టిసారిస్తే రైతులందరికీ ఇప్పటికే డబ్బులు వచ్చేవని వివరించారు. తప్పుడు లెక్కలతో మిల్లర్లు చేస్తున్న అవినీతిపై నేడు విచారణ జరపాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అభివృద్ధి పథంలో ప్రతీ ఒక్కరూ ముందు జాగ్రత్తగా వ్యవహరించగలిగితే ఎంతో మేలు జరుగుతుందన్నారు.