శ్రీకాకుళం

కాళింగులలో కార్పొరేషన్ కాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఫిబ్రవరి 14: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల బీసీ సామాజిక వర్గాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించిన విషయం తెల్సిందే. ఇందులో భాగంగా జిల్లాలో ప్రధాన సామాజిక వర్గంగా ఉన్న కాళింగ కార్పొరేషన్ చైర్మన్ పదవిని పలాస మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన మాజీ ఎంపిపి దువ్వాడ కృష్ణమూర్తినాయుడును నియమిస్తున్నట్లు వెల్లడించారు. కృష్ణమూర్తినాయుడు సతీమణి దువ్వాడ నాగావళి టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఓ పర్యాయం టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే కృష్ణమూర్తినాయుడు కుటుంబం కొన్నాళ్లుపాటు కాంగ్రెస్‌లో ఉండి తిరిగి సొంత గూటికి చేరారు. ఇటువంటి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన కృష్ణమూర్తినాయుడుకు కాళింగ కార్పొరేషన్ చైర్మన్ అప్పగించినప్పటికి టీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్న నేతలు మంత్రి అచ్చెన్న, పలాస ఎమ్మెల్యే శివాజీలపై గుర్రుగా ఉన్నట్లు తెల్సింది. కాళింగులు బలంగా ఉన్న ఆమదాలవలస, శ్రీకాకుళం, నరసన్నపేట, తదితర నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యులతో కనీసం చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని టీడీపీ సామాన్య కార్యకర్తలు బగ్గుమంటున్నారు. ఎన్నికలు మరో రెండు నెలలు ముందు కాళింగ కార్పొరేషన్ చైర్మన్ నియామకం పట్ల అందరితో చర్చించి ప్రాంతీయ సమతుల్యతను పాటించకుండా చైర్మన్ కిరీటాన్ని దువ్వాడకు కట్టబెట్టడం పై సొంత పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. యువకుడు, జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కాళింగ సామాజిక వర్గ ప్రతినిధులతో కలివిడిగా ఉండి తెలుగుదేశం పార్టీ మైలేజీని మరింత పెంచేలా దూకుడుగా వ్యవహారించే టీడీపీ నేతకు ఈ కుర్చీని అప్పగించి వుంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ విప్ కూనరవికుమార్, జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్‌లతో తెలుగుదేశం పార్టీ అదిష్టానం మాట్లాడి వారి అభిప్రాయం మేరకు కాళింగ కార్పొరేషన్ చైర్మన్ అభ్యర్థిని నియమిస్తే రానున్న ఎన్నికల్లో కాళింగ కుటుంబాలు టీడీపీకి అండగా నిలిచేవారు. అలా కాకుండా డిక్టేటర్ మాదిరిగా ఈ నిర్ణయం ఉందంటూ పార్టీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలాస నియోజకవర్గంలో అధిక శాతం కాళింగులు, అలాగే టెక్కలి నియోజకవర్గంలో కాళింగ సామాజిక వర్గ ముఖ్యులంతా వైసీపీలో ఉన్న విషయం తెల్సిందే. ఈ రెండు నియోజకవర్గాల్లో కాళింగులను బుజ్జగించేందుకు కార్పొరేషన్ పదవి కృష్ణమూర్తినాయుడుకు కట్టబెట్టారని అదే సామాజిక పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారు. కార్పొరేషన్ ప్రతిపాదనను కళింగ సీమ సేవా సమితి ముఖ్యులంతా తెరపైకి తెచ్చి తొలుత విపక్షనేత జగన్మోహనరెడ్డిని కలిసి వినతి అందించి అనంతరం సి ఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లేందుకు వారెంతో కృషి చేసిన విషయం గుర్తుచేస్తున్నారు. ఇటువంటి ప్రాధాన్యత ఉన్న కార్పొరేషన్ చైర్మన్ నియామకంలో వారి వారి రాజకీయ స్వప్రయోజనాలు కోసం ఒకే ప్రాంతానికి పరిమితం చేయడం సరికాదని కాళింగ సామాజిక వర్గం మేధావులు స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఈ కార్పొరేషన్ ఎంపిక అధికార పార్టీలోనే కాకుండా కులంలో కూడా మరింత కాక పుట్టించేలా వుందని పలువురు హెచ్చరిస్తున్నారు. కార్పొరేషన్ ఏర్పాటు వల్ల టీడీపీకి జిల్లాలో కాళింగ సోదరులు ఓటు బ్యాంక్ పెరుగుతుందని చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని ఆసామాజిక వర్గం స్వాగతించినప్పటికి చైర్మన్ పదవిని సమర్థులకు కేటాయించలేదన్న అసంతృప్తి జ్వాలలు ఎగిసపడుతున్నాయి.
తూర్పుకాపు చైర్మన్‌గా కోళ్ల అప్పలనాయుడు
ప్రభుత్వం ఏర్పాటుచేసిన తూర్పుకాపు కార్పొరేషన్ చైర్మన్‌గా సంతకవిటి మండలానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకులు, ఎంపిపి కోళ్ల అప్పలనాయుడును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1983 నుంచి పార్టీలో అన్ని స్థాయిలో పనిచేసిన అప్పలనాయుడుకు గతంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కేటాయించకుండా శత్రుచర్లను నియమించడం పట్ల నాడు జిల్లా అంతటా నిరసనలు వ్యక్తమయిన విషయం తెల్సిందే. ఆసందర్భంలో అప్పలనాయుడు స్వగ్రామానికి మంత్రి అచ్చెన్న, అప్పటి ఇంఛార్జ్ మంత్రి పరిటాల సునీతలు వెళ్లి బుజ్జగించి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీని ప్రాప్తికే పార్టీ అధిష్టానం అప్పలనాయుడును తూర్పుకాపు చైర్మన్‌గా నియమించడంతో హార్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.