శ్రీకాకుళం

బీ ఎస్ ఎన్ ఎల్‌కు ఆర్థిక పరిపుష్టిత సమకూర్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, ఫిబ్రవరి 18: భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ సంస్థకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక పరిపుష్టి కల్పించాలని బీ ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగ యూనియన్ అధ్యక్ష,కార్యదర్శులు బి.చంద్రారావు, సూర్యనారాయణలు డిమాండ్ చేసారు. ఆల్ యూనియన్ మరియు ఆసోషియేషన్, బీ ఎస్ ఎన్ ఎల్ ఆల్ ఇండియా ఇచ్చిన పిలుపు మేరకు బీ ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులు సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 శాతంతో ఫిట్‌మెంట్‌తో 13వ వేతన సవరణ చేపట్టాలని, బీ ఎస్ ఎన్ ఎల్ సంస్థకు 4జీ సెక్టార్ ఇవ్వాలని, బీ ఎస్ ఎన్ ఎల్ ఆస్తులను సంస్థకు బదిలీ చేయాలని కోరారు. బీ ఎస్ ఎన్ ఎల్ సంస్థ ఆర్థిక బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.

తిత్లీ తుపాన్ పరిహారం అందించడంలో ప్రభుత్వం విఫలం
పలాస, ఫిబ్రవరి 18: తిత్లీ తుపాన్ నష్టపరిహారం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పలాస నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి డాక్టర్ దున్న వాసుదేవరావు మండిపడ్డారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి చిన్ననీలావతి తదితర ప్రాంతాల్లో పర్యటించి తిత్లీ తుపాన్ బాధితులను కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిత్లీ తుపాన్‌తో సర్వం కోల్పోయిన బాధితులకు చేయూతను ఇవ్వాల్సిన ప్రభుత్వం ఇప్పటికి ఆ దిశగా ప్రయత్నించకపోవడం దురదృష్టకరమన్నారు. కేవలం టీడీపీ కార్యకర్తలకు మాత్రమే లబ్ది చేకూరింది తప్పితే ఇతరులకు మాత్రం నష్టపరిహారం ఇప్పటికి అందకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మానవతా దృక్పథంతో బాధితులకు నష్టపరిహారం అందించి ఉద్దాన ప్రాంతానికి పూర్వవైభవాన్ని తీసుకురావాలని డిమాండ్ చేసారు. 10వ తరగతి పాసైన నిరుద్యోగులకు నిరుద్యోగభృతి, ఉద్దాన ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తెప్పల వీరాస్వామి, ఎస్.అప్పన్న, రామారావు, రాములమ్మ, జుత్తు వీరస్వామి, పుచ్చ గంగయ్య, ఎస్.అప్పలస్వామి పాల్గొన్నారు.

బీసీల అభివృద్ధి వైసీపీతోనే సాధ్యం
పలాస, ఫిబ్రవరి 18: బీసీల అభివృద్ధి వైసీపీతోనే సాధ్యమని పలాస పట్టణ వైసీపీ కన్వీనర్ దువ్వాడ శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి బల్ల గిరిబాబులు అన్నారు. సోమవారం వైసీపీ పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అణగారిన బీసీల అభివృద్ధి కోసం వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి తాను ఆలోచన ఏమిటో బీసీల గర్జన సభలో వెల్లడించారని చెప్పారు. ఏలూరులో జరిగిన బీసీల సభలో 45 సంవత్సరాలు నుంచి 60 సంవత్సరాలు వరకు 75 వేల రూపాయలు ఉచితంగా అందిస్తామని, బీసీల కార్పొరేషన్‌కు ఏడాదికి 1500 కోట్ల రూపాయలు కేటాయించడం, పిల్లలు బడికి వెళ్తే తల్లికి 1500 రూపాయలు ప్రకటించడం, మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ప్రస్తుతం ఇస్తున్న 4 వేల రూపాయలు కాకుండా దానిని 10 వేల రూపాయలు చేస్తామని, మగ్గంతో పనిచేస్తున్న చేనేత కార్మికులకు నెలకు 2 వేల రూపాయలు, చిరువర్తకులకు వడ్డీ లేని రుణం 10 వేల రూపాయలు అందించడం, విద్యార్థులు ఫీజు రీయంబర్స్‌మెంట్‌తోపాటు హాస్టల్ ఖర్చు నిమిత్తం 20 వేల రూపాయలు అందించడం జరుగుతుందని, బీసీ డిక్లేరేషన్ ద్వారా జిల్లాలో వున్న 80 శాతం బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో డి.సత్యం, మధుకేశ్వరరావు, పులిరాజు, తాతారావు, కృష్ణారావు, భవానీ, సన్యాసి ఆప్టో, సోమేశ్వరరావు, రవి, తదితరులు పాల్గొన్నారు.

పోలింగ్‌స్టేషన్లపై దృష్టిసారించండి
సరుబుజ్జిలి, ఫిబ్రవరి 18: మండలంలో త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల దృష్ట్యా ప్రతి పోలింగ్ స్టేషన్‌పై అధికారులు దృష్టిసారించాలని ఆమదాలవలస నియోజకవర్గ ఎన్నికల రిటైర్నింగ్ అధికారి సింహాచలం అన్నారు. సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఆయన మండల స్థాయి అధికారులు, రెవెన్యూ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి సింహాచలం మాట్లాడుతూ తహశీల్దార్, ఎంపీడీవో, ఎస్ ఐతో కలిపి ముందుగా పోలింగ్ స్టేషన్లన్నీ సందర్శించాలన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్లలోనూ మంచినీటి సదుపాయం, విద్యుత్ సౌకర్యం, ఫర్నిచర్ ఉన్నవీ లేనివి గుర్తించాలన్నారు. అలాగే దివ్యాంగ ఓటర్లు ఓటు వేయడానికి వచ్చేటప్పుడు వారికి అనుకూలంగా కాలిబాట ర్యాంప్‌లు ఉన్నవీ లేనివి కూడా పరిశీలించాలన్నారు. సమస్మాత్మక గ్రామాలను గుర్తించి ఎన్నికల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రామశేషు, ఎంపీడీవో ఏస్తేరురాణి, ఏపీ ఎం కమలకుమారి, సీనియర్ సహాయకులు జగన్మోహన్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

ఓటింగ్ యంత్రాలపై అవగాహన
సరుబుజ్జిలి, ఫిబ్రవరి 18: మండలంలో త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల దృష్ట్యా ఓటింగ్ యంత్రాలపై అధికారులు అవగాహనా కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా సోమవారం మండలంలోని నందికొండ, సరుబుజ్జిలి పోలింగ్ స్టేషన్లలో తహశీల్దార్ రామశేషు ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. నందికొండ ప్రాథమిక పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తహశీల్దార్ రామశేషు మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల నిర్వహణపై ఓటర్లు అవగాహన పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సహాయకులు జగన్మోహన్‌రావు, ఆర్ ఐ గాయత్రీ, వీ ఆర్‌వో నవీన్‌కుమార్, బీ ఎల్‌వోలు కళావతి, లక్ష్మీ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించాలి
వంగర, ఫిబ్రవరి 18: మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం తహశీల్దార్ రమాదేవి, సూపరింటెండెంట్ గోవిందరావు ఆధ్వర్యంలో బూత్‌లెవెల్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీ ఎల్‌వోలు గ్రామాల్లో 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించాలని బీ ఎల్‌వోలకు ఆదేశించారు. ఓటు హక్కుపై అవగాహన కల్పించడానికి గ్రామాల్లో రెండు టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో పీ ఆర్‌డీ ప్రకాశరావు, హెల్త్ అధికారి బాబ్జీ, బీ ఎల్‌వోలు పాల్గొన్నారు.

భారీ ర్యాలీతో కొల్లాకు స్వాగతం
రాజాం, ఫిబ్రవరి 18: తూర్పుకాపు కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన సీనియర్ తెలుగుదేశం నేత కొల్ల అప్పలనాయుడు బాధ్యతలు చేపట్టి తొలిసారిగా రాజాం వస్తున్న తరుణంలో భారీ స్వాగతం లభించింది. పార్టీ ఇన్‌చార్జి కోండ్రు మురళీమోహన్, ఎంపీపీ జడ్డు ఉషరాణి ఆధ్వర్యంలో గార్రాజు చీపురుపల్లిలోని జెండాల దిబ్బ నుంచి భారీగా వాహనాలతో వెళ్లి కొల్లను సాదరంగా ఆహ్వానించారు. అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న తూర్పుకాపుల అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వ కట్టుబడి ఉందన్నారు. తన పదవిని సక్రమంగా నిర్వహించి అందరికీ న్యాయం చేస్తానని కొల్ల పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.