శ్రీకాకుళం

అంగరంగ వైభవంగా లక్ష్మీనర్శింహాస్వామి కళ్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలుమూరు, ఫిబ్రవరి 18: మండలం చినదూగాం పంచాయతీ తిలారు జంక్షన్‌లో కొలువైయున్న శ్రీలక్ష్మీనృసింహాస్వామి 57వ కళ్యాణ మహోత్సవం సోమవారం రాత్రి ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది. పురోహితులు బంకుపల్లి రామశర్మ, అర్చకులు సహకారంతో కార్యక్రమం జరిగింది. హిందూ సాంప్రదాయం ప్రకారంగా పురాతన ధర్మ ఆచారాలను పద్ధతిగా కళ్యాణాన్ని జరుపుకున్నారు. ఈ కళ్యాణంలో పలువురు దంపతులు పాల్గొన్నారు. రఘపతి కన్‌స్ట్రక్షన్ ఎండీ, సామాజిక కార్యకర్త బుద్దల భాస్కరరావు, ప్రజల సహాకారం, స్థానిక మాజీ సర్పంచ్ కేశరామారావు, కేశ శ్రీనివాసరావు సహకారంతో ఈ కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పూల తోరణాలు, రకారకాల పుష్పగుచ్ఛాల అలంకరణ, విద్యుత్ అలంకరణలతో కళ్యాణ వేదిక భక్తులకు ఆకట్టుకుంది.
పోలింగ్ కేంద్రాల వద్ద వౌళిక సదుపాయాలు
సారవకోట, ఫిబ్రవరి 18: త్వరలో జరగనున్న సాదారణ ఎన్నికల నిర్వహణకు ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాల వద్ద వౌళిక సదుపాయాలు కల్పిస్తామని తహశీల్దార్ జి.విజయకుమారి స్పష్టం చేశారు. సోమవారం మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆమె పరిశీలించారు. పోలింగ్ కేంద్రం వద్ద అందరికి కన్పించే విధంగా పోలింగ్ కేంద్రం పేరు, నెంబరు, నియోజకవర్గం పేరు, నెంబరు, పార్లమెంటరీ నియోజకవర్గం పేరు, నెంబరుతో పాటు సంబంధిత బి ఎల్‌వోపేరు, హోదా, మోబైల్ నెంబరును నమోదు చేయాలన్నారు. అదే విధంగా దివ్యాంగులు, వృద్దులు, పోలింగ్ కేంద్రంలోనికి సులువుగా వెళ్లేందుకు వీలుగా ర్యాంపులను నియమించాలని సంబంధిత అధికారులకు సూచించారు. విద్యుత్ సౌకర్యం, తాగునీటి సౌకర్యంతో పాటు పోలింగ్ సిబ్బంది వినియోగించేందుకు వీలుగా మరుగుదొడ్లు సౌకర్యం కూడా ఏర్పాట్లు చేస్తామన్నారు. అవసరమైన చోట పోలింగ్ రోజున శామ్యానాలు ఏర్పాటుచేస్తామని ఆమె వివరించారు. మండలంలో 64పోలింగ్ కేంద్రాలున్నాయని అన్నారు. ఈమెతో పాటు రెవెన్యూ పరిశీలకులు నిరంజన్‌రావు, శ్యామలరావు, గ్రామపరిపాలనాధికారులు లక్ష్మీనారాయణ, వేణు, బిఎల్‌వో రమాదేవి, సర్వేయర్ పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలపై యూనివర్శిటీ విద్యార్థుల సర్వే
లావేరు, ఫిబ్రవరి 18: మండలంలో వెలుగు, ఇందిరక్రాంతి పథకం కింద అమలవుతున్న పలు పథకాల అమలు తీరు తెన్నులను, విధి విధానాలపై డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ యూనివర్శిటీ విద్యార్థుల బృందం సోమవారం సర్వే నిర్వహించింది. వెలుగు కార్యాలయంలోను, లావేరు గ్రామంలో ఈ బృందం పర్యటించి పలువివరాలను సేకరించింది. పొదుపు సంఘాలు, పనితీరు, పసుపు-కుంకుమ పథకం అమలుతీరుపై లబ్ధిదారులనుండి సమాచారాన్ని సేకరించింది. సేకరించిన ఈ సమాచారాన్ని క్రోఢీకరించి డిపార్ట్‌మెంట్‌కు అందజేయనున్నట్లు బృంద ప్రతినిధులు తెలిపారు. చీఫ్ వార్డెన్ జి.సంజీవయ్య నేతృత్వంలో విద్యార్థులు కొండపల్లి వినీత, సి.హెచ్ లక్ష్మి, కె.పుష్ప, ఎ.సుశీల, బి.గిరి తదితరులు పాల్గొన్నారు.

అర్హులందరికి రేషన్ కార్డులు
* చైర్‌పర్సన్ గీత
ఆమదాలవలస, ఫిబ్రవరి 18: అర్హులైన ప్రతీ కుటుంబానికి విధిగా రేషన్ కార్డులను విధిగా పంపిణీ చేస్తుందని స్థానిక మున్సిపల్ చైర్‌పర్సన్ తమ్మినేని గీత అన్నారు. సోమవారం స్థానిక ఎమ్మార్వో కార్యాలయం వద్ద కొత్తరేషన్ కార్డులను పంపిణీ చేసిన సందర్భంగా మాట్లాడుతూ ఆన్‌లైన్ విధానం కారణంగా రేషన్‌కార్డులను ప్రభుత్వం సకాలంలో అందించలేకపోయిందని ఆమె అన్నారు. సాదికార సర్వే ఆధారంగా రేషన్ కార్డులను మంజూరు చేయడం వల్ల లబ్ధిదారులకు అనేక సాంకేతిక లోపాలు ఎదురయ్యావని ఆయన అన్నారు. ఈసమస్యల కారణంగా మండలంలోను, మున్సిపాల్టీలో సుమారు 1500 మంది కొత్తరేషన్ కార్డులకు దరఖాస్తులు చేసినప్పటికి కేవలం 170 కార్డులు మాత్రమే ప్రభుత్వం అందించగలిగిందని ఆమె అన్నారు. ఎన్నికల కోడ్‌తో సంబంధం లేకుండా మరో నెలరోజుల్లో దరఖాస్తుదారులకు అందరికి కార్డులు అందిస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో కెవివి శివ, మున్సిపాల్ కమీషనర్ వెంకటరావు, టీడీపీ నాయకులు విద్యాసాగర్, బోరగోవింద్ తదితరులు పాల్గొన్నారు.

బీసీ వర్గాలకు జగన్ ప్రకటనతో హర్షం
* మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్
నరసన్నపేట, ఫిబ్రవరి 18: రాష్ట్రంలోని అణగారిన బీసీ వర్గాలకు చేయూతనిచ్చే దిశగా ఇటీవల ఏలూరులో జరిగిన బీసీ గర్జన మహాసభలో వరాల జల్లు కురిపించారని మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. సోమవారం స్థానిక వైసీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలోనే బీసీ వర్గాలకు ఆయనకు గుర్తొస్తాయని తమ నాయకుడు జగన్మోహనరెడ్డి ముందుగానే బీసీ వర్గాలకు ఆదుకునే విధంగా ప్రకటించడంతో అనేక బీసీ కార్పొరేషన్లు ఏర్పాటుకు నేటి ప్రభుత్వం చర్య తీసుకోవడం గమనార్హమని పేర్కొన్నారు. జగన్‌మోహనరెడ్డి ప్రకటించిన బీసీ వర్గాలకు సంబంధించి వరాలను కాపీకొట్టి ముందుకు వెళ్లే పరిస్థితులు కన్పిస్తున్నాయని, ఏది ఏమైనప్పటికి రాజన్న తనయుడు జగన్మోహనరెడ్డికి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని స్పష్టం చేశారు. అనంతరం రాజశేఖరరెడ్డి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరంగి మురళి, గుప్త, కృష్ణచైతన్య, కృష్ణమనాయుడు, ఈశ్వరరావు, అప్పన్న తదితరులు పాల్గొన్నారు.