శ్రీకాకుళం

ఉప్పాడ రామును ఆదర్శశంగా తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలాకి, ఫిబ్రవరి 18: మండలంలోగల గాతలవలస గ్రామంలో కొత్తగా సబ్బుల తయారీ పరిశ్రమ స్టార్ కమ్ ఇండస్ట్రీని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సోమవారం ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యావంతులైన యువకులు ఇటువంటి పరిశ్రమలను నెలకొల్పి యువకులకు ఆదర్శంగా నిలవాలని ఆయన అన్నారు. ముప్పాడ రాము పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసి ప్రభుత్వం నుండి ఉద్యోగం రావాలన్న కోరికను పక్కనపెట్టి ఈయనే ఒక పరిశ్రమను ప్రారంభించి నిరుద్యోగ యువతీ యువకులకు బాసటగా నిలవాలనే ఉద్దేశ్యంగా సొంతంగా పరిశ్రమను నిర్మించారని ఆయన అన్నారు. ఎవరి శక్తి వారికి తెలియదు. మనసుంటే మార్గముంటుందని అందుకు నిదర్శనమే రాము అని ఆయన కొనియాడారు. ఈ పరిశ్రమలో బట్టలు ఉతికే సబ్బులు, పాత్రలను తోమే డిటర్జెంట్ పౌడర్ తయారు అవుతాయని ఆయన తెలిపారు. ఈ పరిశ్రమలో సుమారు 30మందికి ఉపాధి కల్గుతుందని ఇటువంటి పరిశ్రమ శ్రీకాకుళం జిల్లాలోనే ఎక్కడా లేదని, అది మన పోలాకి మండలంలో శ్రీకారం చుట్టడం మంచి శుభపరిణామమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఎంసి చైర్మన్ బైరి భాస్కరరావు, వంశధార వంశధార ప్రాజెక్ట్ కమిటీ ఉపాధ్యక్షుడు వెంకటప్పలనాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు కిల్లి వేణుగోపాలస్వామితో పాటు రాము, బుజ్జి, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

పోషణ్ అభియాన్‌పై యాక్షన్‌ప్లాన్
* పీవో అనసూయ
జలుమూరు, ఫిబ్రవరి 18: గ్రామీణ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అంగన్వాడీ కేంద్రాల పనితీరు, వారికి పౌష్టికాహారం మరింత చేరువలో ఉండేలా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని కోటబొమ్మాళి ప్రాజెక్ట్ అధికారిణి అనసూయ అన్నారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరం నాటికి ప్రతీ కేంద్రంలో సకల సౌకర్యాలు, పిల్లల ఆరోగ్య పరిస్థితి, మరిన్ని సౌకర్యాలు మెరుగుపర్చేందుకు ఈయాక్షన్ ప్లాన్‌ను ఏర్పాటుచేసిందని ఆమె అన్నారు. ప్రతీ మండలంలో దీనిపై ఒక కమిటీని ఏర్పాటుచేసినట్లు, ఇందులో డివిజనల్ రెవెన్యూ అధికారి చైర్మన్‌గా, ఎంపీడీవో, మెడికల్ ఆఫీసర్, మండల పరిషత్ అధ్యక్షులు, సాంఘిక సంక్షేమ అధికారి, రూరల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, వాటర్ అండ్ శానిటేషన్, ఫుడ్ అండ్ సివిల్ సప్లై సభ్యులుగా ఐసిడిఎస్ పీవోకార్యదర్శిగా కొనసాగుతారని అన్నారు. ఈ యాక్షన్‌ప్లాన్ అన్ని శాఖాధికారులు సకాలంలో అందజేస్తే ఈ నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు, ఆపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో పంచాయతీ విస్తరణాధికారి కొమరాపు అప్పలనాయుడు, పలు శాఖాధికారులు,పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

ఎంపీడీవోగా ప్రభాకరరావు
జలుమూరు, పిబ్రవరి 18: జలుమూరు మండల అభివృద్ధి అధికారిగా వైజాగ్ నుండి వచ్చిన కె.ప్రభాకరరావుసోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఎంపీడీవో పడాల వాసుదేవరావు బదిలీపై వెళ్లినందున ఆయన స్థానంలో ఇంఛార్జి ఎంపీడీవోగా ఇంతవరకు పంచాయతీ విస్తరణాధికారి కొమరాపు అప్పలనాయుడు బాధ్యతలు నిర్వహించారు. సోమవారం ఆయన నుండి పూర్తి బాధ్యతలు ఎంపీడీవోగా ప్రభాకరరావు బాధ్యతలు స్వీకరించారు.
పోలింగ్ కేంద్రాలలో వౌళిక సదుపాయాలు అవసరం
జలుమూరు, ఫిబ్రవరి 18: కొద్దిరోజుల్లో జరుగనున్న సాదారణ ఎన్నికల నేపథ్యంలో మండలంలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమగు అన్ని సౌకర్యాలు ఉండాలని తహశీల్దార్ డి. ఎల్లారావు అన్నారు. మండలం శ్రీముఖలింగం, కరకవలస, నగరికటకం, మర్రివలస, పలు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను సోమవారం పరిశీలించారు. అక్కడ వున్న వసతులు, తాగేందుకు నీరు, విద్యుత్ సరఫరా, పలు అంశములను ఆయన పరిశీలించారు. ఆయనతో పాటు రెవెన్యూ పరిశీలకులు చిన్నారావు, గ్రామరెవెన్యూ అధికారి విజయబాబు, పలువురు పాల్గొన్నారు.