శ్రీకాకుళం

టీడీపీ బలోపేతానికి అందరూ కృషి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలాకి, ఫిబ్రవరి 22: మండలంలో గల తల సముద్రం గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే బగ్గురమణమూర్తి శ్రీవేణుగోపాలస్వామిని దర్శించుకొని ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చిన మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులును ఉద్దేశించి మాట్లాడారు. టీడీపీ పార్టీలో ముందున్న నాయకులు కూడా ఈ దేవాలయంలో ముందు పూజలు నిర్వహించి ఎన్నికల బరిలో దిగడం ఆనవాయితీగా వస్తుందని ఆయన అన్నారు. ఈ ఐదుసంవత్సరంలో తాను రాజకీయం ఎలా చేశానోనని అందరికి తెలుసని ఆయన అన్నారు. అందులో భాగంగా నాదగ్గరకు వచ్చిన లబ్ధిదారులు ఏపార్టీ వారో, ఏ కులం వారో అని ఆలోచించకుండా వారికి అడగకుండా లబ్ధిని చేకూర్చానని ఆయన అన్నారు. పార్టీలకతీతంగా పనిచేశానని ఈ విషయం స్థానిక ప్రజలందరికి తెలుసని ఆయన అన్నారు. గడిచిన ఐదు సంవత్సరాలు నాలుగు మండలాల్లో చేసిన అభివృద్ధి, సంక్షేమం ప్రతీ ఒక్కరికి తెలుసునని ఆయన వివరించారు. మండల నాయకత్వం, కార్యకర్తలు, అభిమానులు తనపై చూపించిన అభిమానం ఇకముందు కూడా తనపై చూపించాలని ఆయన కోరారు. అలాగే పార్టీ నిర్ణయానికి శిరశావహిస్తానని, కాకపోతే ఈరోజు మంచి ముహూర్తం ఉన్న కారణంగా ఆనవాయితీ ప్రకారం ఈ పూజలను చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గొండురామన్న, మండల ప్రత్యేక సలహాదారు తమ్మినేని భూషణరావు, ఏ ఎంసీ చైర్మన్ బైరి భాస్కరరావు, వంశధార ప్రాజెక్ట్ కమిటీ ఉపాధ్యక్షులు ఎమ్.వెంకటప్పలనాయుడు, నరసన్నపేట పట్టణ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు రామారావుతో పాటు స్థానిక మాజీ సర్పంచ్ ప్రగడ సూరిబాబు, వై.శ్రీరాములు, జన్మభూమి కమిటీ అధ్యక్షులు జల్లు రామారావు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

24,25 తేదీల్లో వాలీబాల్ పోటీలు
పోలాకి, ఫిబ్రవరి 22: మండలంలో గల ప్రియా అగ్రహారం పంచాయతీ పరిథిలోగల మూలపేట గ్రామంలో జిల్లాస్థాయి అథ్లాటిక్స్ వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు స్వామివివేకానంద యువజన సేవాసంఘ అధ్యక్షులు మూల ప్రభాకరరావు తెలిపారు. శుక్రవారం విలేఖరులతో ఆయన మాట్లాడుతూ ఈనెల 23 సాయంకాలం లోగాతమ పేర్లను నమోదు చేసుకొని నిర్ధారణ చేసుకోవాలని ఆయన కోరారు. వీటికి సంబంధించి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. విజేలైన వారికి 25వ తేదీ బహుమతులు అందించడం జరుగుతుందని, ఈపోటీల్లో పాల్గొనేవారు 15 ఏళ్లనుండి 29 ఏళ్లు వయసుగల యువకులు అర్హులని ఆయన తెలిపారు.

ఈవిఎమ్‌లపై అవగాహన సదస్సు
* తహశీల్దార్ ఎల్లారావు
జలుమూరు, ఫిబ్రవరి 22: మరికొద్దినెలల్లో జరుగనున్న సాదారణ ఎన్నికల దృష్ట్యా గ్రామీణ ప్రాంతాలలో ఓటర్లకు ఈవిఎమ్‌లపై అవగాహన కల్పిస్తున్నట్లు తహశీల్దార్ బి.ఎల్లారావు తెలిపారు. ప్రతీ పోలింగ్ కేంద్రాలలో తమ సిబ్బంది ఈవి ఎమ్‌లపై పూర్తిస్థాయి అవగాహన కల్పించేకార్యక్రమం జరుగుతుందని అన్నారు. మండలం రాయిపాడు గ్రామంలో శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఓటర్లతో మాట్లాడుతూ ప్రతీ ఓటరు ఓటు వినియోగించే ముందు చక్కనైన అవగాహన కల్గించుకొని ఓటును దుర్వినియోగం కాకుండా వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు రెవెన్యూ పరిశీలకులు రావాడ త్యాగరాజు, రెవెన్యూ అధికారి చొంగల రామారావుతదితరులు పాల్గొన్నారు.

బీజేపీ ఎంపీ కోసం సామాజిక కార్యకర్త దరఖాస్తు
జలుమూరు, ఫిబ్రవరి 22: రానున్న ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంటరీ స్థానంలో పోటీచేసేందుకు భారతీయ జనతాపార్టీ సీటు కోసం మండలం శ్రీముఖలింగం గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త నాయుడుగారి రాజశేఖర్ దరఖాస్తు చేశారు. ఇటీవల ఢిల్లీలో ఉన్న బీజేపీ జాతీయ కార్యాలయం వద్దకు వెళ్లి ఆల్ ఇండియా బీజేపీ జనరల్ సెక్రటరీ రామ్‌మాధవ్‌కు తన బయోడేటాతో దరఖాస్తు ఇచ్చినట్లు రాజశేఖర్ తెలిపారు. ఎనె్నన్నో పార్టీలు, ఎందరెందరో నేతలుగొప్పవారికే టిక్కెట్లు ఇస్తున్న నేపథ్యంలోసామాన్యుడికి కూడా ప్రజాస్వామ్యంలో పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని రామ్‌మాధవ్‌కు కోరారు.
ప్రజాసంక్షేమానికే నవరత్నాలు
* వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త కిరణ్‌కుమార్
లావేరు,్ఫబ్రవరి 22: వైసీపీ ప్రజా సంక్షేమం కోసం నవరత్నాల కార్యక్రమాన్ని ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిందని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్ అన్నారు. మండలంలో బరినికాం గ్రామంలో వంద కుటుంబీకులు శుక్రవారం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో పార్టీ తీర్థం పుచ్చుకున్న కుటుంబీకులకు పార్టీ కండువాలు కప్పి కిరణ్‌కుమార్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ విధివిధానాలు ప్రజలకు మరింత చేరువ చేయడం ద్వారా అత్యధికులను పార్టీలోకి చేర్పించేలా చూడాలని కార్యకర్తలకు ఉద్భోవించారు. రానున్న ఎన్నికల్లో నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చే విధంగా విస్తృత ప్రచారం అవసరమని ఆయన అన్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపరిచే పథకాలతో వెళ్తుందని, రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆపార్టీకి గుణపాఠం చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో రణస్థలం ఆంధ్రాబ్యాంక్ కర్షక సేవా సహకార సమితి అధ్యక్షుడు బొంతు సూర్యనారాయణ మాట్లాడుతూ దివంగత నేత రాజశేఖరరెడ్డి ఆశయ సాధనకు వైసీపీ పనిచేస్తుందన్నారు. ప్రజా సంక్షేమం కోసం రాజశేఖరరెడ్డి అమలు పరిచిన పథకాలన్నీ వైసీపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి పిన్నింటి సాయి, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి కంది నాని, జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు రొక్కం బాలష్ణ, బూత్ మేనేజర్ లుకలాపు అప్పలనాయుడు, మండల పార్టీ అధ్యక్షులు దన్నాన రాజన్నాయుడు, పార్టీ నాయకులు గొర్లె అప్పలనాయుడు, వాల్లె దాలినాయుడు, లంకలపల్లి గోపి, నక్క ప్రసాద్, గొర్లె రామినాయుడుతదితరులు పాల్గొన్నారు.

మత్స్యకారులే టీడీపీకి వెన్ను దన్ను
* ఎమ్మెల్యే లక్ష్మీదేవి
శ్రీకాకుళం(రూరల్), ఫిబ్రవరి 22: రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులు మొదటినుంచి తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ పార్టీ అభ్యున్నతికి పాటుపడి వారికి కావల్సిన సంక్షేమ అభివృద్ధికార్యక్రమాలు పొందుతూ ప్రస్తుత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులకు 50 ఏళ్లకే పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అన్నారు. అరసవిల్లిలో తన నివాసగృహంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వేటకు ఉపయోగించే బోట్లకు డీజిల్ రాయితీ, వేటకు వెళ్లని సమయంలో జీవనభృతిగా కార్డుదారునికి నాలుగు వేలు చొప్పున అందించడంతో పాటు అనేక సబ్సిడీ రుణాలు, వాహనాలు ఇచ్చినట్లు తెలియజేశారు. మత్స్యకారులు కోరికగా ఉన్న ఎస్టీలోచేర్చాలని కోరుతూ నిరాహారదీక్షలు, ధర్నాలు చేయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని దీనిపై సి ఎం స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందని, ప్రత్యేక కమీషన్ వేయడం జరుగుతుందని, ఎస్టీ జాబితాలో కులాలను చేర్చే అంశం జాతీయ ప్రభుత్వం చేయాలి గనుక ఈ విషయమై పార్లమెంట్ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని సూచించారు. దీంతో ఎంపీ రామ్మోహన్‌నాయుడు మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు పార్లమెంట్‌లో ఉన్న అన్ని రకాల విధానాలలో మాట్లాడడం, లేఖలు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. దీనికి సంబంధించి అన్ని పేపర్లు పార్లమెంట్ కార్యాలయ కార్యదర్శి నౌపడ సత్యన్నారాయణ తీసుకొచ్చి మత్స్యకారులకు వివరిస్తూ తెలియజేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాజీ మంత్రి అప్పలసూర్యనారాయణ మాట్లాడుతూ మత్స్యకారులు ఎప్పుడు తెలుగుదేశం వెంటే ఉంటారని, మత్స్యకారుల వెనుక ఎప్పుడు టీడీపీ ఉంటుందని ప్రస్తుతం మత్స్యకారులకు ప్రత్యేక కార్పొరేషన్ వేయడం జరిగిందని తెలియజేశారు. సమావేశంలో మత్స్యకార నాయకులు బి.జంగమయ్య, వారథి సూర్యనారాయణ, కేశవ రాంబాబు, మైలపిల్లిరాజు, సూరాడ అప్పన్న, మత్స్యకార నాయకులు పాల్గొన్నారు.

సెంట్రల్ డ్రగ్ హౌస్‌ను పరిశీలించిన డి ఎమ్‌హెచ్‌వో
శ్రీకాకుళం (రూరల్), ఫిబ్రవరి 22: రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉన్న సెంట్రల్ డ్రగ్ స్టోర్స్‌ను శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎమ్.చెంచయ్య పరిశీలించారు. డ్రగ్ హౌస్‌లో ఉన్న మందులను పరిశీలించి వీటి నిల్వకు తీసుకోవల్సిన జాగ్రత్తల గూర్చి వివరించారు. ఈ పరిశీలనలో డ్రగ్‌హౌస్ ఇంఛార్జ్, ఫార్మసిస్ట్‌లు నర్శింగరావు తదితరులున్నారు.

కాళింగ కార్పొరేషన్ చైర్మన్‌ను అభినందించిన మంత్రులు
శ్రీకాకుళం(రూరల్), ఫిబ్రవరి 22: జిల్లాతెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాళింగ కార్పొరేషన్ చైర్మన్‌గా ఎన్నికైన దువ్వాడ కృష్ణమూర్తిని శుక్రవారం రాష్ట్ర రవాణా, బిసీ సంక్షేమ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా ఇంఛార్జ్ మంత్రి పితాని సత్యన్నారాయణ, పార్లమెంట్ సభ్యులు రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి, ఎమ్మెల్యేలు బగ్గురమణమూర్తి, కలమట వెంకటరమణ, జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌతు శిరీష, టీడీపీ రాజాం నియోజకవర్గ ఇంఛార్జ్ కోండ్రు మురళీమోహన్ తదితరులు అభినందించారు. ఈసందర్భంగా కృష్ణమూర్తికి దుశ్శాలువతో సన్మానించారు.

నేడు ఎర్రన్నాయుడు జయంతి
శ్రీకాకుళం(రూరల్), ఫిబ్రవరి 22:మాజీ కేంద్రమంత్రి దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు జయంతి కార్యక్రమాన్ని అధికారిక కార్యక్రమంగా జిల్లాలో నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎమ్.రామారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏడురోడ్ల కూడలి, జాతీయరహదారి నుండి శ్రీకాకుళం పట్టణం ప్రవేశం వద్ద, 80అడుగుల రోడ్ వద్ద ఉన్న ఎర్రన్నాయుడు విగ్రహాలకు పూలమాలలువేసే కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికార, అనధికార యంత్రాంగం పాల్గొంటారని తెలిపారు.

న్యూసెంట్రల్ స్కూల్‌లో న్యాయవిజ్ఞాన సదస్సు
శ్రీకాకుళం(రూరల్), ఫిబ్రవరి 22: నగరంలోని పి ఎన్ కాలనీలో ఉన్న న్యూసెంట్రల్‌స్కూల్‌లో శుక్రవారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.శ్యామలాదేవి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ వివిధ చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా బాలికలు స్వేచ్ఛా హక్కు, అభివృద్ధి చెందే హక్కు, జీవించే హక్కు తదితర వాటి గూర్చి వివరించారు. విద్యాహక్కు గూర్చికూడా అవగాహన కల్పించారు. రాజ్యాంగం ద్వారా కల్పించిన ప్రాథమిక హక్కులను పొందుతూ ప్రతీ ఒక్కరు ప్రాథమిక విధులను నిర్వహించాలని ఆదేశిక సూత్రాలను పాటించాలని సూచించారు. ప్రతీ పౌరుడు జాతీయ గీతాన్ని, జాతీయ పతాకాన్ని గౌరవించి సహజ వనరులను కాపాడాలని, దేశం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఉచిత నిర్భంధ విద్య, బాలకార్మిక వ్యవస్థ నిషేదంపై వివరించారు. ఉన్నతపాఠశాలలో బాలల న్యాయసలహాకేంద్రం గోడపత్రికను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో న్యూసెంట్రల్ స్కూల్ అధినేత పి.జగన్మోహనరావు, న్యాయవాదులు పి.మల్లిబాబు, జి. ఇందిరాప్రసాద్, ఎ. ఉమామహేశ్వరరావు, ప్రిన్సిపాల్ బి. మల్లేశ్వరరావు, పి. శ్రీకాంత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పేదవర్గాలకు సేవలిందే ఆర్టీసీకి చేయూత!!
* మంత్రి అచ్చెన్న చొరవతోనే రవాణాశాఖ అభివృద్ధి
* రూ. 40 లక్షలు ఎం.పి.లాడ్స్ నిధులు మంజూరు
పార్లమెంటు సభ్యుడు రామ్మోహన్‌నాయుడు
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, ఫిబ్రవరి 22: అత్యంత పేదవర్గాల వారికి సేవలందించే ఆర్టీసీ నష్టాల్లో ఉన్నందున చేయూతను అందించాలన్నదే తన అభిమతమని, అందుకే ప్రత్యేకంగా శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ అభివృద్ధికి నిధులు కేటాయింపులు చేసినట్టు పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. ఇరవైఐదు వేల మంది ప్రయాణీకులను ప్రతీరోజూ వారి గమ్యస్థానాలకు చేర్చే అతిపెద్ద శ్రీకాకుళం కాంప్లెక్స్‌కు అవసరమైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశ్యంతోనే దీనిపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచినట్టు పేర్కొన్నారు. రవాణాశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జిల్లాపై చూపిన చొరవతోనే ఆర్టీసీ సంస్థ ఇంత అభివృద్ధికి సాధ్యపడిందన్నారు. శుక్రవారం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఆధునికరించిన మరుగుదొడ్లు, పోర్టికోలను స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ను మరింత సుందరంగా తీర్చిదిద్దడానికి మరింత కృషి చేస్తామని వెల్లడించారు. మరుగుదొడ్లను పరిశీలించిన ఆయన ప్రయాణికులు ఎక్కిన బస్సును పరిశీలించి, ప్రయాణీకులతో ఆర్టీసీ సంస్థ సేవలపై ఆరా తీసారు. జిల్లాలో శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ అతిపెద్దదని అన్నారు. అందులోభాగంగానే ఎం.పి.లాడ్స్ నుంచి రూ. 40 లక్షలు నిధఉలను మంజూరు చేసామన్నారు. ఆ నిధఉలతో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ప్రధాన ద్వారం వరకూ పోర్టికో, మరుగుదొడ్లను ఆధునీకరించుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ప్రధాన ద్వారం వద్ద పోర్టికో నిర్మాణ నవల్ల ప్రయాణీకులకు వేసవి, వర్షాకాలంలో కొంత ఉపశమనం లభిస్తుందన్నారు. అలాగే మరుగుదొడ్లను అందంగా నిర్మించుకున్నామని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టి ఆర్టీసీ కాంప్లెక్స్‌ను మరింత సుందరంగా తీర్చిద్దితామని అన్నారు. త్వరలో వైఫాయ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అదేవిధంగా ప్రతీ బస్సుకు డిజిటల్ డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేస్తాయిస్తామని అన్నారు. ఇప్పటికే ఆన్‌లైన్ రిజర్వేషన్ పద్దతి ఉందని, అయితే అన్ని బస్సులకు ఆ సౌకర్యం వచ్చేలా చూస్తామన్నారు. ఆర్టీసీ కొన్ని విషయాలలో చాలా ముందడుగులో ఉందన్నారు. మారుమూల గ్రామాలకు సైతం బస్సులను వేసి ప్రయాణీకులను ఒక చోట నుంచి మరో చోటుకి సురక్షితంగా చేరవేస్తుందని తెలిపారు. ఇంకా ఈ కాంప్లెక్స్‌కు మరిన్ని అదనపు సౌకర్యాలు సమకూర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసారు. ఈ కాంప్లెక్స్ మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ కె.శ్రీనివాసరావు, 1,2వ డిపోల మేనేజర్లు డి.డిల్లీశ్వరరావు, బి.అరుణకుమారి, పి.ఆర్.ఓ. బి.ఎల్.పి.రావు, సి.ఎ.లు అమరసింహుడు, శ్రీనివాసు, డీఈ, ఏఈలు, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే సీ-పోల్ యాప్‌కు ఫిర్యాదు చేయవచ్చు
పలాస, ఫిబ్రవరి 22: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎవరైనా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే సీ-పోల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని పలాస తహసీల్థార్ డి.బాపిరాజు వెల్లడించారు. శుక్రవారం తహసీల్థార్ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి సీ-పోల్ యాప్ గూర్చి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూగుల్ ప్లేస్టోర్‌లో భారతీయ ఎన్నికల కమిషన్ సీ-పోల్ అనే యాప్‌ను ఏర్పాటు చేసిందని, ఆయా యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకొని ఎక్కడైనా, ఎవరైనా ఎన్నికల కోడ్ అతిక్రమించినట్లు భావిస్తే వాటిని ఫోటో తీసి యాప్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు సీ-పోల్ టీమ్ వచ్చి పరిశీలించి తక్షణ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇందుకు గాను పలాస నియోజకవర్గంలో పలాస, వజ్రపుకొత్తూరు, మందసలకు సంబంధించి సీ-పోల్ టీమ్‌లను ఏర్పాటు చేసామన్నారు. రానున్న ఎన్నికలలో నిఘా నేత్రాలు అవుతాయని, ఎవరైనా కోడ్ ఉల్లంఘిస్తే ఎన్నికల కమిషన్ ఆదేశాలు మేరకు చర్యలు తప్పవన్నారు. పీడబ్ల్యూడి యాప్ ద్వారా వికలాంగులు తమ ఓటు హక్కును నమోదు చేసుకుంటే వారికి ఓటు వేసేటప్పుడు వికలాంగులకు కల్పించే సౌకర్యాలు కల్పిస్తామన్నారు. 40 శాతం దాటిన వికలాంగులు పింఛన్ అందుకుంటుండడంతో వారి వివరాలు డి ఆర్‌డి ఎ ద్వారా సేకరించడం జరిగిందని, 40 శాతం దిగువ వున్న వివరాలు ఎన్నికల కమిషన్ వద్ద లేకపోవడంతో అటువంటి వారు ఈ యాప్ ద్వారా నమోదు చేసుకుంటే వికలాంగులకు కల్పించే సౌకర్యాలు కల్పిస్తామన్నారు. 23,24వ తేదిల్లో ప్రత్యేక ఓటర్లు నమోదు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఈయనతోపాటు సూపరింటెండెంట్ పాపారావు, సీనియర్ ఆసిస్టెంట్ రవికుమార్ తదితరులున్నారు.

పలాస పట్టణానికి శాశ్వత తాగునీటి కోసం చర్యలు
పలాస, ఫిబ్రవరి 22: పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీకి శాశ్వత తాగునీటి పరిష్కారానికి 99 కోట్ల రూపాయలతో చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు సుగుణాకర్ తెలిపారు. శుక్రవారం పలాస మున్సిపాలిటీలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఎ ఐ ఐబి బ్యాంకు ద్వారా 99 కోట్ల రూపాయలు తాగునీటి కోసం విడుదలయ్యాయని, ఆఫ్‌షోర్ రిజర్వాయర్ నుంచి పైపులైన్ ద్వారా పలాస మున్సిపాలిటీకి తాగునీరు అందిస్తామన్నారు. దీనికి సంబంధించి టెండర్లు ప్రక్రియ ప్రారంభమైందని, త్వరలోనే టెండర్లు పూర్తి చేసుకొని పనులు ప్రారంభిస్తామన్నారు. పలాస మున్సిపాలిటీ ప్రారంభం నుంచి తాను ఇక్కడ పనిచేసానని, అప్పట్లో వేసిన రహదారులు, పార్కులు తప్పితే కొత్తగా తయారు కాలేదన్నారు. కెటిరోడ్డు నిర్మాణానికి ప్రత్యేక దృష్టి సారించామని, ఖాళీస్థలాల్లో మున్సిపల్ భవనాలు ఏర్పాటు చేసి ఆదాయ మార్గాలు పెంచే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈయనతోపాటు ఎ ఇ రవికుమార్, మున్సిపల్ సిబ్బంది వున్నారు.

క్రమశిక్షణతో విద్యను అభ్యిసిస్తే విజయాలు సొంతం
మందస, ఫిబ్రవరి 22: విద్యార్థులు చదువుకున్నప్పుడు క్రమశిక్షణ, పట్టుదల, దశ,దిశ నిర్థేశించినప్పుడు విద్యను అభ్యిసిస్తే విజయాలు సొంతమవుతాయని శాతవాహన డిగ్రీ, జూనియర్ కాలేజి అడ్మినిస్ట్రేషన్ అధికారి బి.శివ అన్నారు. శుక్రవారం కాలేజి ఆవరణలో 18వ ఫెర్‌వెల్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ విద్యార్థుల్లో కంప్యూటర్, నైపుణ్యత, పోటీతత్వంతోనే పోటీ పరీక్షల్లో విజయాలు సొంతం చేసుకొని ఉద్యోగాల్లో, జీవితాల్లో స్థిరపడగలరని, విద్యార్థులు దశ,దిశ నిర్థేశించుకుంటే బంగారుభవిష్యత్తు సాధ్యమవుతుందన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ దుదిష్టినాయుడు, అధ్యాపకులు త్రినాధ్, ఉమాపతి, ఫాడి తదితరులు పాల్గొన్నారు.

పేదలకు దుస్తులు పంపిణీ
మందస, ఫిబ్రవరి 22: పలాస వైసీపీ కన్వీనర్ డాక్టర్ సీదిరి అప్పలరాజు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మందస వాసుదేవ ఆలయంలో, షిర్డిసాయి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసారు. అప్పలరాజు సతీమణి శ్రీదేవి వాసుదేవుడును దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకొని షిర్డిసాయి ఆలయం వద్ద పేదలకు వస్త్రాలు పంపిణీ చేసారు. ప్రజల ఆశీస్సులతో దైవానుగ్రహంతోనే పలాస నియోజకవర్గంలో రానున్న ఎన్నికలల్లో విజయం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేసారు. నియోజకవర్గ ప్రజలు వైసీపీ పార్టీకి ఆదరాభిమానాలు చూపుతూ జగన్ రాష్ట్రానికి సీ ఎం కావాలని ప్రార్థిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో షిర్డిసాయిసేవా సంస్థ అధ్యక్షుడు జి.తిరుపతిరెడ్డి, వైసీపీ నాయకులు దువ్వాడ శ్రీకాంత్, శ్రీ్ధర్, మెట్ట కుమారస్వామి, ఎ.శేషగిరి, జయప్రసాద్, వై.కృష్ణమోహన్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాలు ఆరంభం
మందస, ఫిబ్రవరి 22: మందస పట్టణంలో వేంచేసియున్న దేవదేవుడు వాసుదేవుడు బ్రహ్మోత్సవాలు శుక్రవారం శ్రీ త్రిదండి దేవానంద రామానుజస్వామి నేతృత్వంలో ఆరంభమైంది. మహేంద్రగిరుల్లో పాండవులు వనవాసం సందర్భంగా ఆభయాంజనేయస్వామి మందస వాసుదేవ ఆలయాన్ని సందర్శించారు. బ్రహ్మోత్సవాలకు తొలుత వాసుదేవుడుకు అభిషేకాలు, విఘ్ననేశ్వరుడుకు ప్రత్యేక పూజలు, అభయాంజనేయస్వామికి వేదపండితులు, గోవిందస్వామి, కూర్మాచార్యులు, పవన్ వేదమంత్రోచ్ఛారణల మధ్య వస్త్రా, సింధూర అలంకరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అలంకరణ, అర్చన, సుందరాకాండ పారాయణం, భజన,సంకీర్తనలు జరిగాయి. భక్తులు తిలకించారు.

బీసీల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం
వజ్రపుకొత్తూరు, ఫిబ్రవరి 22: బీసీల అభివృద్ధి తెలుగుదేశం పాలనలోనే సాధ్యమవుతుందని రాష్ట్ర టీడీపీ బీసీ సెల్ కార్యదర్శి డాక్టర్ దున్న కృష్ణారావు అన్నారు. శుక్రవారం పూండిలో విలేఖరులతో మాట్లాడారు. బీసీలు మొదటి నుంచి టీడీపీ పక్షాన ఉన్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే బీసీలకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగిందన్నారు. వైసీపీ బీసీల పట్ల మొసలికన్నీరు కారుస్తుంది తప్ప ఆ కులాల అభివృద్ధికి వై ఎస్ పాలనలో చేసింది శూన్యమన్నారు. బీసీల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్‌లు ఏర్పాటు చేయడం ద్వారా వారి అభివృద్ధి పట్ల చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ది ఏమిటో స్పష్టమవుతుందన్నారు. బీసీల అండతో మళ్లీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో బి.్భస్కరరావు, బి.శ్యామ్‌లున్నారు.

అన్నదాత సుఖీభవ టీడీపీ ఎన్నికల స్టంటు
వజ్రపుకొత్తూరు, ఫిబ్రవరి 22: ఎన్నికల ముందు టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం కేవలం ఎన్నికల ముందు స్టంటు అని సీపీ ఎం జిల్లా కార్యవర్గసభ్యులు బమ్మిడి ఆనందరావు అన్నారు. శుక్రవారం పూండిగల్లిలో విలేఖరులతో మాట్లాడారు. రైతులు కోసం ఇప్పటి వరకు పట్టించుకోని ప్రభుత్వం ఎన్నికల ముందు ఆదరాబాదరాగా పథకాలు తీసుకురావడం ఎన్నికల ముందు ఆ పార్టీ అయోమయానికి అద్దం పడుతుందన్నారు. రైతులు ఎక్కువగా ఉమ్మడి కుటుంబంగా జీవనం సాగిస్తుంటే కుటుంబంలో ఒక్కరికే ఈ పథకం వర్తింపజేయడం దారుణమన్నారు. వెబ్‌ల్యాండ్‌లోని లోసుగులు రైతుల పాలిట శాపంగా మారుతుందన్నారు. వెబ్‌ల్యాండ్ సరిచేయకుండా ఈ పథకాన్ని అమలు చేస్తే 40 శాతం మంది రైతులకు వర్తించే పరిస్థితి లేదన్నారు. ఈయనతోపాటు ఎన్.చంద్రయ్య, ఎన్.మోహనరావులున్నారు.
ఓటు వినియోగంపై అవగాహన చేసుకోవాలి
సంతబొమ్మాళి, ఫిబ్రవరి 22: ఓటు హక్కును వినియోగంపై అవగాహన కలగాలని రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ వౌళి అన్నారు. శుక్రవారం పాతమేఘవరం, మేఘవరం, సూరాడవానిపేట గ్రామాల్లో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కలిగించారు. ఈవీ ఎంలను ఏలా వినియోగించుకొని ఓటు వేయాలి అనే అంశంపై యంత్రాలను ఓటర్లుకు చూపించారు. ఈయనతోపాటు వి ఆర్‌వోలు భాస్కరరావు, ప్రసాదరావు, మత్స్యకార సోసైటీ అధ్యక్షుడు ఎస్.జోగారావు, బి ఎల్‌వోలున్నారు.
విశాఖ డైయిరీ లబ్దిదారులకు బేసీన్‌లు పంపిణీ
సంతబొమ్మాళి, ఫిబ్రవరి 22: హనుమంతునాయుడుపేట విశాఖ డైయిరీ యూనిట్ పరిధిలో 75 మంది పాడి రైతులకు పశువులకు దాణా వేసేందుకు దాణాబేసీన్‌లను శుక్రవారం పంపిణీ చేసారు. హనుమంతునాయుడుపేట, సీతారాంపురం, చిన్నకేశునాయుడుపేట, జగన్నాథపురంలకు చెందిన పాడిరైతులకు బేసీన్‌లను విశాఖ డైయిరీ మేనేజర్ గోపాలరావు చేతుల మీదుగా పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్ లక్ష్మణ్, ఏజెంట్ బాలకృష్ణ, గౌతమి పాల్గొన్నారు.

వౌలిక వసతులపై దృష్టి సారించాలి
టెక్కలి, ఫిబ్రవరి 22: రానున్న 2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలు వద్ద వౌలిక వసతులు సక్రమంగా కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని టెక్కలి ఆర్డీవో భాస్కరరెడ్డి సూచించారు. శుక్రవారం మండలంలోని 17,18 రూట్‌ల్లో గంగాధరపేట, రాధావల్లభపురం, పోలవరం, సతివాడ, కొళిగాం, తొలుసరిపల్లి, చింతలగార, బలరాంపురం, అక్కవరం, విక్రమపురం గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆర్డీవో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఓటర్లు ఇబ్బందులకు గురికాకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరారు. సతివాడ పోలింగ్ కేంద్రం వద్ద మరుగుదొడ్లు సదుపాయాలు కల్పించాలని సూచించారు. గంగాధరపేట, రాధావల్లభపురంల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ మెరుగుపరచాలన్నారు. కొత్తగా వచ్చిన ఓటర్లును దరఖాస్తుల్లో వలసలను గుర్తించి రెండు పర్యాయాలు ఓటర్లు నమోదును ఒకటికి కుదించాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువతీయువకులు తప్పనిసరిగా తమ పేర్లును నమోదు చేసుకోవాలన్నారు. శని, ఆదివారాల్లో నిర్వహించబోవు ప్రత్యేక ఓటర్లు శిబిరాల్లో సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆర్డీవో ఆదేశించారు. తహసీల్థార్ శ్రీనివాస్, ఎన్నికల డిటీ శరత్, ఆర్ ఐ పాల్గొన్నారు.

చంద్రబాబు నిర్ణయం పట్ల రజక సంఘం హర్షం
సరుబుజ్జిలి, ఫిబ్రవరి 22: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తమ జాతి పట్ల తీసుకున్న నిర్ణయానికి మండల రజక సంఘం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నట్టు సంఘ అధ్యక్షులు అదపాక రాజేశ్వరరావు తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో మండల రజక సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో తమ జాతికి ప్రత్యేక గౌరవం కల్పిస్తూ తమ జాతిని కించపరిచే విధంగా మాట్లాడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక ఉత్తర్వులు చేసిన ప్రభుత్వం పట్ల రాష్ట్రంలోని ప్రతి రజకులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రజకులను కులం పేరుతో దూషించే సంఘటనలు ఉన్నాయని, రాష్ట్ర సంఘం విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రజకుల ఇళ్లకు ఉచిత కరెంట్ కూడా ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని, దీని వల్ల నిరుపేద రజక కుటుంబాలకు ఉపయోగపడుతుందని రాజేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల రజక సంఘ నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రకృతి వ్యవసాయం సాగు రైతులకు లాభదాయకం
ఎల్ ఎన్‌పేట, ఫిబ్రవరి 22: పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ సాగు రైతులకు లాభదాయకమని సీ ఆర్‌పీ డి.శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం లక్ష్మీనర్సుపేట గ్రామంలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ సాగుపై అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ మండలంలోని 2019 ఖరీఫ్‌కు సంబంధించి ప్రణాళికలు తయారు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సాగులో పెట్టుబడులు తక్కువగా ఉండి దిగుబడులు అధికంగా ఉంటాయన్నారు. సేంద్రీయ ఎరువులు ద్వారా తెగుళ్లు నివారణ కూడా చేపట్టవచ్చునన్నారు. గతంలో రైతులు ప్రకృతి వ్యవసాయం చేసి లాభపడ్డారన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీ ఆర్‌పీ ఆనందరావు, హెచ్ ఎం పి.వి.రమణ, వీ ఆర్‌వో రమణమ్మ, ఎం.కె.మిశ్రో, తిరుమలరావు, గవరరాజు తదితరులు పాల్గొన్నారు.

ఈవీ ఎంల వినియోగంపై అవగాహన
ఎల్ ఎన్‌పేట, ఫిబ్రవరి 22: రానున్న ఎన్నికల్లో ఓటరు తమ ఓటు హక్కును ఈవీ ఎం విధానం ద్వారా వినియోగించడంపై శుక్రవారం అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. లక్ష్మీనర్సుపేట ప్రాథమిక పాఠశాల ఆవరణలో పరిశీలకులు భానుచందర్ ఆధ్వర్యంలో ఓటరుకు ఈవీ ఎంలపై అవగాహన కల్పించారు. ఓటును ఈవీ ఎం ద్వారా ఏ విధంగా వినియోగించాలన్నది తదితర అంశాలను ఓటర్లుకు వివరించారు. వీటిపై అవగాహనను, సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో వీ ఆర్‌వో రమణమ్మ, హెచ్ ఎం పి.వి.రమణ, ఎం.కె.మిశ్రో, బీ ఎల్‌వోలు పాల్గొన్నారు.

ఓటు హక్కును వినియోగించుకోవాలి
హిరమండలం, ఫిబ్రవరి 22: రానున్న ఎన్నికల్లో ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ పి.వి. ఎన్.చక్రధర్‌బాబు అన్నారు. శుక్రవారం పోలింగ్ బూత్ కేంద్రాలను పరిశీలించారు. వౌళిక సౌకర్యాలు ఉన్న చోట పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని జేసీ పేర్కొన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు. అర్హులైన వారు తమ ఓటును నమోదు చేసుకోవాలని సూచించారు. మండలంలోని ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రాల వివరాలను అధికారుల నుంచి సేకరించారు. వంశధార నిర్వాసితుల సమస్యలను పలువురు నిర్వాసితులు జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జేసీ వివరించారు. ఈయనతో పాటు పాలకొండ ఆర్డీవో రఘుబాబు తదితరులున్నారు.
రిజర్వాయర్ పనులు వేగవంతానికి చర్యలు
హిరమండలం, ఫిబ్రవరి 22: వంశధార రిజర్వాయర్ పనులు వేగవంతానికి చర్యలు తీసుకుంటున్నామని ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ శ్రావణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హిరమండలం వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ పనులను పరిశీలించారు. తులగాం గెడ్డ స్పిల్, రాతిగట్టు పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సోమా కంపెనీ వారు చీఫ్ ఇంజనీర్‌తో మాట్లాడుతూ ఆరు నెలల నుంచి రూ.40 కోట్లు బకాయిలు ఉన్నట్టు తెలిపారు. పనుల నిర్వహణకు ఇబ్బందికరంగా ఉందన్నారు. నిధులు మంజూరుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ సురేంద్రరెడ్డి, ఈ ఈ సుశీల్‌కుమార్, డీ ఈ బ్రహ్మానందం, ఏ ఈ విశే్వశ్వరరావునాయుడు పాల్గొన్నారు.

విద్యార్థులకు అదనపు యూనిఫారాలు
వంగర, ఫిబ్రవరి 22: మండలంలోని ఒకటి నుంచి ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులకు 1623 అదనపు యూనిఫారాలు ప్రభుత్వం మంజూరు చేసిందని ఎం ఈవో దుర్గారావు తెలిపారు. ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క యూనిఫారాం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ యూనిఫారాలను ఎం ఆర్‌సీలో భద్రపరిచినట్టు తెలిపారు.
ఓటర్లు నమోదు చేపట్టాలి
వంగర, ఫిబ్రవరి 22: మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఈ నెల 23,24 తేదీల్లో బీ ఎల్‌వోలు ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని తప్పనిసరిగా చేపట్టాలని డీటీ బలివాడ గోవిందరావు సూచించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి నుంచి ఓటరు నమోదు ఫారాలను స్వీకరించాలన్నారు.

రామకృష్ణకు కలెక్టర్ ప్రశంస
వీరఘట్టం, ఫిబ్రవరి 22: పింఛను పంపిణీలో మొదటి స్థానం సాధించిన బి.రామకృష్ణ జిల్లా కలెక్టర్ ఎం.రామారావు చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందించారు. మండలంలోని బిటివాడ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తూ ప్రతి నెల 1వ తేదీ నుంచి 5వ తేదీలోపు వివిధ రకాల పింఛన్లను పంపిణీ చేయడంలో ముందంజలో ఉన్నారు. అలాగే హుస్సేన్‌పురం పంచాయతీలో కార్యదర్శిగా పనిచేస్తున్న రాజారావు చంద్రన్న పెళ్లికానుకలు ఎక్కువగా ధ్రువపత్రాలు అందజేయడంతో ఈయనను కూడా కలెక్టర్ ప్రశంసించారు.

ఘనంగా సంతోషిమాత ఆలయ వార్షికోత్సవం
వీరఘట్టం, ఫిబ్రవరి 22: స్థానిక సంతోషిమాత ఆలయ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం ప్రముఖ యజ్ఞకర్త ఎస్.వి. ఎల్. ఎన్.శర్మయాజీ ఆధ్వర్యంలో హోమాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో దంపతులు కలశ పూజలు చేశారు. అనంతం అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఈ నెల 23,24 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు
పాలకొండ (టౌన్), ఫిబ్రవరి 22: జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు ఈ నెల 23,24 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్టు స్థానిక నగర పంచాయతీ కమిషనర్ జయరాం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలకు 20 వార్డుల్లోని ఓటు హక్కు లేని, అర్హత ఉన్న వారు సంప్రదించాలని అన్నారు. బూత్‌స్థాయి అధికారులు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో తుది ఓటర్ల జాబితా సిద్దంగా ఉంచామన్నారు. ఓటర్ల జాబితాను పరిశీలించుకోవాలన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.
ఈసారైనా రాయుడుకోనేరు అభివృద్ధి జరిగేనా
రూ.33 లక్షలు కేటాయించిన నగర పంచాయతీ
పాలకొం