శ్రీకాకుళం

మంత్రుల ఇలాకలో..యువత పాట్లు!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: విద్యతోనే అభివృద్ధి సాధ్యమన్న ఉద్దేశ్యంతో భవిష్యత్తు తరాల పురోగతికి సర్కార్ పునాది వేసింది. ఉమ్మడి రాష్ట్రంలో విద్యార్ధులకు సకాలంలో ఫీజులు చెల్లించకపోవడం, ప్రైవేటు విద్యాసంస్థలు పెడుతున్న అవస్థలు తట్టుకోలేక మధ్యలో చదువులు మానేసిన పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి. రీయాంబర్స్‌మెంటు పథకం ద్వారా విద్యార్ధులకు చెల్లించాల్సిన ఫీజులు జిల్లాలో రూ. 18.20 కోట్లు బకాలు పేరుకుపోయాయి. దీంతో యాజమాన్యాలు ఆ విద్యార్ధులను పలుమార్లు ఫీజులు చెల్లింపులపై ఒత్తిడి చేస్తూనే, మరోపక్క వారిని చులకనగా చూసే పరిస్థితులను యువత ఎదుర్కొంటుంది. ఇలాంటి యువత చేతికి 2019 సార్వత్రిక ఎన్నికలకు కొత్తగా ఓటు హక్కు కలిగింది. ఓటు హక్కునే ఆయుధంగా చేసుకుని ఎన్నికల ముందే వారి విద్యాభివృద్ధికి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఫీజులు చెల్లించాలన్న గళం విప్పేందుకు సన్నద్ధం అవుతోంది. 18 - 19 వయస్సు కలిగిన వారిలో 25,568 మందికి ఓటు హక్కు ఉంది. అలాగే, 20 - 29 వయస్సు కలిగిన యువత 4,00,976 మందికి ఓటు హక్కు కలిగింది. వీరిలో సుమారు పది వేలమందికిపైగా ఫీజు రీయాంబర్స్‌మెంటు బాధితులుగా విద్యార్థినీవిద్యార్ధులు కేవలం మూడు నియోజకవర్గాల్లో ఉన్నారు. యువత ఫీజు రీయాంబర్స్‌మెంటు పథకం కోసం రోడేక్కితే - ముందుగా రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కిమిడి కళా వెంకటరావుల మెడకు 3్ఫజు2ముడి పడినట్టే! ముఖ్యంగా అచ్చెన్న ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలో ఆకాశమంత అభివృద్ధి చేసినప్పటికీ, అక్కడే ఉన్న ఐతమ్ కార్పొరేట్ విద్యాసంస్థలో 2737 మంది యువతకు సంబంధించిన ఫీజు రీయాంబర్స్‌మెంటుగా ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 5 కోట్లు చెల్లింపులపై దృష్టిసారించలేకపోయారు. దీంతో వేలాది మంది విద్యార్ధులు ఆత్మాభిమానం చంపుకుంటూ విద్యను అభ్యషించే పరిస్థితులు వారిలో కన్పిస్తున్నాయంటూ అక్కడ అధ్యాపకులు చెప్పే మాట. సరికొత్తగా ఓటు హక్కు సాధించుకున్న ఆ యువత అంతా ఓటే ఆయుధంగా వినియోగించుకుని ఎన్నికల ముందు బాబు సర్కార్ పసుపు-కుంకుమ, ఫించన్లు, డ్వాక్రామహిళలకు ఇచ్చే తాయిళాల చెల్లింపులు వెంటవెంటనే చేసే విధంగా యువతకు కూడా ఫీజు రీయాంబర్స్‌మెంటు బకాయలు చెల్లించాలన్న ఆందోళనకు దిగితే - టెక్కలి నియోజకవర్గంలో వేలాది మంది యువత ఓట్లు అధికార పార్టీ అభ్యర్ధులకు వేయమంటూ బహిరంగంగా చెప్పే స్థాయికి ఈ సున్నితమైన ఫీజుల చెల్లింపుల వ్యవహారం జటిలంగా మారిపోయేలా కన్పిస్తోంది. అలాగే, మంత్రి కళా వెంకటరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎచ్చెర్ల నియోజకవర్గంలో శివానీ ఇంజనీరింగ్ కళాశాలకు రూ. 4.50 కోట్లు ఫీజు రియాంబర్స్‌మెంటు కింద 3214 మంది విద్యార్ధులకు ఫీజులు సర్కార్ చెల్లించాల్సివుంది. 2018-19 విద్యాసంవత్సరానికి జూన్, జూలై, ఆగస్టు మాసాలకు చెందిన త్రైమాసక ఫీజులను సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ప్రభుత్వం చెల్లించింది. అలగే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ త్రైమాసానికి చెల్లించకపోగా, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి త్రైమాసానికి కూడా ఫీజులు సర్కార్ చెల్లించలేదు. దీంతో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్ధులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ సమయంలో వారికి సరికొత్తగా ఓటు హక్కు కల్పించడంతో దానినే ఆయుధంగా వినియోగించి ఓటు వేసే ముందు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య పనిచేస్తున్న స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే కళాపై ఒత్తిడి పెంచుతామంటూ శివానీ కళాశాల విద్యార్ధులు 3ఆంధ్రభూమి2 ముందు ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. అంతేకాకుండా రాజాం నియోజకవర్గంలో గల మరో కార్పొరేట్ ఇంజనీరింగ్ కళాశాల జీ.ఎం.ఆర్. ఇక్కడ కూడా గత రెండు టెర్మలుగా ప్రభుత్వం విద్యార్ధులకు చెల్లించాల్సిన ఫీజు రీయాంబర్స్‌మెంటు ఇవ్వడం లేదు. దీంతో జి.ఎం.ఆర్. కాలేజీకి ప్రభుత్వం నుంచి రూ. 8.78 కోట్లు రావల్సివుంది. ఇందుకుగాను 4261 మంది విద్యార్ధులు సకాలంలో ఫీజులు చెల్లించకలేక, యాజమాన్యాలు పదేసార్లు ఆ యువతను ఫీజుల కోసం తరగతి గదుల్లో నిలబెడుతున్న వైనాన్ని భరించలేక విద్యార్థినీవిద్యార్ధులు అవస్థలు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితి తీసుకువచ్చిన ప్రభుత్వంపై ఈ సారి ఎన్నికల కమిషన్ కల్పించిన సరికొత్త ఓటునే అస్త్రంగా మార్చుకుని ఎన్నికల ముందు వారి ఫీజులు ప్రభుత్వం చెల్లించేలా చలనం తీసుకురావాలన్న ఆలోచనతో సన్నద్ధం అవుతున్నారు.

పారదర్శక పాలన టీడీపీతోనే సాధ్యం
జి.సిగడాం, మార్చి 26: రాష్ట్రంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో టీడీపీయే పారదర్శక పాలన అందించగలదని ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ అసెంబ్లీ అభ్యర్ధి కిమిడి కళావెంకటరావు అన్నారు. మంగళవారం మండలంలో మదుపాం, చెట్టుపొదిలాం, వెలగాడ, దేవరవలస, ఎస్‌పి ఆర్‌పురం గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత 16వేల కోట్లరూపాయలు లోట్ బడ్జెట్ ఉన్నప్పటికీ చంద్రబాబునాయుడు అభివృద్ధి, సంక్షేమమే దృష్టియందు ఉంచుకొని బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతికి రైతు సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలను అమలు చేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ప్రస్తుతం ఇస్తున్న రూ.2వేలు పింఛన్‌ను మూడువేల రూపాయలకు పెంచనున్నట్లు, 60 సంవత్సరాల వారికి కూడా పింఛన్ వర్తింపజేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించిన వారికి చంద్రన్న బీమా రూ.10లక్షలు ఇచ్చేందుకు పరిశీలనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. జగన్‌మోహనరెడ్డి ఎన్ని పాదయాత్రలు చేసినప్పటికి అమలుకాని వాగ్ధానాలు చెప్పి ఓటర్లను పక్కదోవ పట్టిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడు మాట్లాడుతూ రాష్ట్రాన్ని పరిపాలించే సమర్ధుడు చంద్రబాబునాయుడేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఏ ఎంసీ ఉపాధ్యక్షులు భూపతి శ్రీరామ్మూర్తి, జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కొమరాపు రవికుమార్, జెడ్పీటీసీ టంకాల లక్ష్మి, కనుబుద్ది దాలినాయుడు, జక్కంపూడి దాస్, పిడుగు మల్లేశ్వరరావు, మొగసాల గొల్లాజీ, జె.శంకరరావు, నాయిని సింహాచలంతో పాటు మహిళలు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అభివృద్ధిని చూసి ఓటెయ్యండి
* ఎమ్మెల్యే లక్ష్మీదేవి
శ్రీకాకుళం(రూరల్),మార్చి 26: అభివవృద్ధిని చూసి ఓటెయ్యాలని ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నగరంలోని 49వ డివిజన్ మచ్చువానిపేట, పి ఎన్ కాలనీ, బైరివాని పేట తదితర ప్రాంతాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ కాలనీలో సీసీ రోడ్లు నిర్మాణం, పి ఎన్ కాలనీ ప్రధాన రహదారి నిర్మాణం, కాల్వలు వంటి పనులు చేపట్టినట్లు తెలియజేశారు. కిమ్స్ రోడ్ నుండి బైరివానిపేటను కలుపుతూ సీపన్నాయుడుపేట వరకు రూ.70లక్షలతో రోడ్లు,కాల్వల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. రూ. 1.10కోట్లతో రోడ్లు,కాల్వలు నిర్మాణం చేపట్టి అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇళ్లు ఇచ్చినట్లు తెలియజేశారు. 300 గజాల వరకు ఫ్రీగా ఇళ్లు ఇస్తామని వాటికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారన్నారు. ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలు గతంలో ఎన్నడూ జరగలేదని, తాను ఎమ్మెల్యేగా ఎన్నికయిన తర్వాతే నగరంలో అన్ని డివిజన్‌లోను అభివృద్ధి చేశామన్నారు. అన్ని వర్గాల ప్రజలు తనను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని, ఎంపీగా కింజరాపు రామ్మోహన్‌నాయుడును గెలిపించి రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న చంద్రబాబునాయుడను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో సీపాన మల్లేశ్వరరావు, బుడుమూరు శ్రీరామ్మూర్తి, సీపాన సీతారత్నం, సీపాన రమేష్, పొట్నూరు తులసీరాం, సీపాన రమ, కూన చిరంజీవి, సీపాన పోలినాయుడు, అప్పలనాయుడు, మురళి, వంశీకృష్ణ, వరప్రసాద్, రమణ, దాలినాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు హారతులిచ్చి పూలమాలలతో లక్ష్మీదేవికి స్వాగతం పలికారు.