శ్రీకాకుళం

నృసింహ, మధుకేశ్వర కల్యాణ మహోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలుమూరు, జూన్ 16: ప్రముఖ పుణ్యక్షేత్రం మండలం శ్రీముఖలింగంలో కొలువైయున్న శ్రీలక్ష్మీనృసింహస్వామి, వారాహిమధుకేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం గురువారం ఘనంగా జరిగాయి. దుర్మిఖనామ సంవత్సరం ఉత్తరాయణం, జ్యేష్ఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ ఉత్సవాన్ని చేపట్టారు. ఉదయం లక్ష్మీనృసింహస్వామి కల్యాణ ఆలయ ప్రాంగణంలో జరిగింది. సాయంత్రం మధుకేశ్వరస్వామి కల్యాణం జరిగింది. అనంతరం నందివాహనంపై వారాహి మధుకేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. పల్లకిలో లక్ష్మీనృసింహస్వామిని ఊరేగించారు. పురోహితులు భూషణరావు, అర్చకులు దేవాదాయ శాఖ కార్యనిర్వాహణాధికారి సూర్యనారాయణ, చైర్మన్ బైరి బలరాం పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మధుకేశ్వరస్వామివారికి రూ.25వేలు విలువ గల పట్టువస్త్రాలను శ్రీముఖలింగం గ్రామానికి చెందిన బస్వా గోపాలరత్నం బహూకరించారు. గతంలో కూడా రూ.40వేలు కూడా మంగళసూత్రాలను అందజేశారు.