శ్రీకాకుళం

‘వెంకటేశ్వర ఇంజినీరింగ్’ను పరిశీలించిన ‘నాక్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, జూన్ 16: మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలను ఈనెల 13,14,15వ తేదీల్లో న్యాక్ బృందం పరిశీలించినట్టు ప్రిన్సిపల్ ఎం.గోవిందరాజులు, వికాస్ ఎడ్యుకేషన్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ బుడుమూరు శ్రీరామమూర్తి స్పష్టంచేశారు. గురువారం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వీరు మాట్లాడుతూ న్యాక్ బృందం చైర్మన్‌గా డాక్టర్ ఆదినారాయణ కళానిధి(పూర్వపు వీసి అన్నావర్శిటీ), కో ఆర్డినేటర్ డాక్టర్ అమల్‌కుమార్ (్భవనగర్ యూనివర్శిటీ ఎంబిఏ ప్రొపెసర్)లు సభ్యులుగా డాక్టర్ విలాస్ కర్జినీలు కలసి ఇంజినీరింగ్ కళాశాలలో వివిధ అంశాలపై పరిశీలన జరిపినట్లు పేర్కొన్నారు. అకడమిక్, విద్యార్థుల ప్రమాణాలు, అధ్యయనం, వౌలిక సదుపాయాలు విద్యార్థుల పురోగతి, బోధకుల సామర్థ్యం, ఆవిష్కరణలు, శిక్షణలు వంటి అంశాలపై మూడు రోజులపాటు న్యాక్ బృందం ఆరా తీసి సంతృప్తి వ్యక్తంచేసిందన్నారు. దీనికి సంబంధించిన పూర్తి నివేదికలు సమర్పించిన అనంతరం గ్రేడింగ్ కళాశాలకు ఇవ్వనున్నట్టు వివరించారు. ముఖ్యంగా ప్రిన్సిపల్ కళాశాలలోని వివిధ ప్రత్యేకతలకు సంబంధించిన ప్రజెంటేషన్, గ్రంథాలయం, వౌలిక వసతులతోపాటు పూర్వపు విద్యార్థులతో ముఖాముఖి విద్యార్థుల ప్రగతి, ప్రమాణాలు వంటి అంశాల్లో ఈ కళాశాల తీసుకుంటున్న చర్యల పట్ల న్యాక్ బృందం మరింత సంతృప్తి వ్యక్తం చేసిందన్నారు.
అలాగే మేనేజ్‌మెంట్ సభ్యులు, గవర్నర్ బాడీతో సమీక్ష నిర్వహించి ఫీడ్‌బ్యాక్ తీసుకున్న అనంతరం విద్యాప్రమణాలు మెరుగుదలకు మరిన్ని సలహాలున్యాక్ బృందం ఇచ్చిందని స్పష్టంచేశారు.
ఈ కళాశాలకు మంచిగ్రేడింగ్ న్యాక్ బృందం ఇవ్వనుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈసమావేశంలో ఈ సమావేశంలో హెచ్ వోడి శాస్ర్తి, బి.రాజా పాల్గొన్నారు.