శ్రీకాకుళం

కార్యకర్తల జేబుల్లోకి ‘ఉపాధి’ నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకొండ(టౌన్), జూన్ 17: ఉపాధి హామీ పథకానికి టిడిపి నాయకులు తూట్లు పొడుస్తున్నారని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. శుక్రవారం ఆయన పాలవలస రాజశేఖరం నివాసగృహంలో విలేఖర్లతో మాట్లాడారు. లక్షలాది మందికి జీవనాధారమైన పథకంలోని నిధులను ఆ పార్టీ కార్యకర్తలు జేబులు నింపేందుకు ప్రస్తుతం జరుగుతున్న నీరు-చెట్టు పనులు అవినీతికి అడ్డాగా నిలిచాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ విదేశాల్లో పర్యటిస్తూ అవినీతిని రూపుమాపి నల్లధనాన్ని వెలికితీసేందుకు కృషి చేస్తుంటే మన రాష్ట్రంలో అవినీతికి రహదారులు తెరుస్తున్నారని వెల్లడించారు.
వంద రోజులు పని కల్పించాల్సిన ఈ పథకంలో ఏ గ్రామంలో కూడా ఏ ఒక్క కూలీకి సకాలంలో పనులు దక్కడం లేదన్నారు. నీరు-చెట్టు పనులు జరుగుతున్న ప్రాంతాల్లో సకాలంలో రిజిస్టర్‌లో నమోదు చేయకుండా చెరువులు నిండిన తర్వాత మంజూరు చేసుకొని ప్రజాధనాన్ని దోచుకొనేందుకు టిడిపి నాయకులు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. నీరు-చెట్టు పనుల్లో అవినీతికి అడ్డుపడుతున్నా లేదా అనుకూలంగా లేకపోయినా అధికారులపై వేధింపులు చేపడుతున్నారన్నారు. ఇటువంటి పరిమాణామాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహించి రాష్ట్రాన్ని దోపిడీ నుంచి కాపాడాలని కోరారు.
ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, వైకాపా నాయకులు మామిడి శ్రీకాంత్, ధర్మాన కృష్ణదాస్, ఎం.వి.పద్మావతి, పాలవలస విక్రాంత్, కనపాక సూర్యప్రకాశరావు, వెలమల మన్మధరావు, కోరాడ బాబు, లోలుగు విశే్వశ్వరరావు పాల్గొన్నారు.