శ్రీకాకుళం

పథకాలకు బ్యాంకుల సహకారం అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూన్ 17: పేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన పథకాలకు బ్యాంకుల సహకారం ఉండాలని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం కోరారు. మండల స్థాయిలో ప్రతినెలా జరిగిన సమావేశాలకు బ్యాంకు అధికారులు హాజరై ఎంపిడివోలతో సమన్వయం చేసుకొని రుణాల రికవరీకి ప్రయత్నం చేయాలన్నారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డిఆర్‌డిఏ ద్వారామహిళా సంఘాలకు కల్పిస్తున్న బ్యాంకు లింకేజీలో బ్యాంకుల నుండి ఎదురౌతున్న సమస్యలపై చర్చించారు. సీతంపేట ఐటిడిఏ, బీసీ కార్పొరేషన్, మెప్మా, వ్యవసాయ, పశుసంవర్థక, మత్స్యశాఖ, ఎస్సీ కార్పొరేషన్, సెరీ కల్చర్, జిల్లా పరిశ్రమల శాఖ, మైనారిటీ కార్పొరేషన్ తదితర శాఖలు రైతులకు, మహిళలకు నిరుద్యోగులకు మంజూరు చేసే యూనిట్లు గ్రౌండింగ్‌లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను బ్యాంకు అధికారులకు ఆయా శాఖల అధికారుల ద్వారా వివరించారు. బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు. డ్వాక్రా సంఘాలు పొదుపు చేసే డబ్బులు కూడా బ్యాంకులు చెల్లించడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయని ఇటువంటి సమస్యలు పునరావృత్తం కాకుండా చూడాలన్నారు.
కొన్ని బ్యాంకులు యూనిట్ కాస్ట్‌కు మంజూరు చేసిన సబ్సీడి మాత్రమే చెల్లిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ పంటకు రెన్యూవల్‌తోపాటు కొత్తరుణాలు మంజూరుచేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి, ఐటిడిఏ పివో జె.వెంకటరావు, పిడి ఎస్.తనూజారాణి, మెప్మా పీడి త్రినాధరావు, జెడి రామారావు, డిసివో శ్రీహరిరావు, వెటర్నరీ జెడి నాగన్న, మత్స్యశాఖ డిడి యాకూబ్‌భాషా పలువురు అధికారులు ఉన్నారు.