శ్రీకాకుళం

కుప్పిలిలో రిసార్ట్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, జూన్ 17: రాష్టవ్రిభజన తర్వాత శివారుగానున్న శ్రీకాకుళం జిల్లాలోగల వనరులను అభివృద్ధిలోకి తీసుకువచ్చి ఇక్కడ నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం ప్రణాళికతో ముందుకుసాగుతోంది. రణస్థలం మండలంలోని కొవ్వాడ సమీపంలో అణుపార్కు నిర్మాణానికి, అలాగే పోలాకి సమీపంలో ధర్మల్ పవర్‌ప్లాంటు ఏర్పాటుకు భూసర్వేలు జోరందుకొన్నాయి.
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో భావనపాడు పోర్టు నిర్మాణానికి ప్రజాభిప్రాయసేకరణ పూర్తి చేసి దాదాపు సముద్రతీర ప్రాంతంలో మరిన్ని ప్రాజెక్టుల ఏర్పాటుకు చంద్రబాబు ప్రభుత్వం దూకుడు పెంచిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఎచ్చెర్ల మండలంలోని కుప్పిలి సమీపంలో వంద ఎకరాల్లో పర్యాటకుల విశ్రాంతి గృహాలు (రిసార్ట్స్) నిర్మాణాలు తదితర అభివృద్ధి పనులు అలాగే ఫిష్ ఫీజింగ్ వంటి కార్యకలాపాల నిర్వహణకు కలెక్టర్ సంబంధిత రెవెన్యూ అధికారులను నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో తహశీల్దార్ బందరు వెంకటరావు నేతృత్యంలో కుప్పిలి రెవెన్యూ గ్రామంలోని సముద్రతీర ప్రాంతంలో సర్వే నెంబర్ 505, 449ల్లో 200 ఎకరాలు ప్రభుత్వ భూమిని గుర్తించి కలెక్టర్‌కు రిసార్ట్స్ నిర్మాణాల నిమిత్తం ప్రతిపాదనలు నివేదించారు.
ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం థాయ్‌లండ్ దేశంతో ఇదే ప్రాంతంలో ఒనామీ తల్లి రొయ్య కేంద్రం నిర్మాణానికి 30 ఎకరాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఆసియాలో ఎక్కడాలేని ఈ తల్లి రొయ్య కేంద్రం కుప్పిలి తీరంలో నెలకొల్పితే 193 కి.మీ తీరం పొడవునా 11 మండలాల పరిధిలో రొయ్యలు సాగుచేసే రైతులకు మరింత ఊతం ఇవ్వనుంది. జాతీయ రహదారికి అతిసమీపంలో జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోనున్న కుప్పిలి గ్రామంలో మరిన్ని ప్రాజెక్టులు రూపుదిద్దుకొంటే ఈ ప్రాంతీయులు ఆర్థిక పురోగతి సాధిస్తారు.