శ్రీకాకుళం

ముద్రగడకు మద్దతుగా దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), జూన్ 17: కాపు రిజర్వేషన్ సాధనకు ఉద్యమిస్తున్న ముద్రగడ అరెస్ట్‌కు నిరసనగా శుక్రవారం జిల్లా తెలగసంక్షేమ సంఘం అధ్యక్షుడు రొక్కం సూర్యప్రకాశ్‌రావు తన నివాసం వద్ద నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1966వరకు కాపు కులానికి రిజర్వేసన్లు ఉండేవని అనంతరం తొలగించిన వాటినే పునరుద్ధరించమంటున్నామే తప్ప కొత్తగా రిజర్వేషన్ కల్పించమనడం లేదని పేర్కొన్నారు. ముద్రగడ మీద కాపు మంత్రులంతా ముఖ్యమంత్రి మెప్పుకోసమే నోటికివచ్చినట్టు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. కాపుల అరెస్ట్‌లు, పెట్టిన చిత్రహింసలు, బాహ్య ప్రపంచానికి తెలియకూడదనే చానల్ ప్రచారాలను నిలిపివేసి పత్రికా స్వేచ్ఛను హరించారన్నారు. సీమ చచ్చిన, కోనసీమ మునిగినా ప్రతీ దానికి వైఎస్ జగన్ కారకుడంటూ కాపుమంత్రులు కాకుల్లా అరుస్తున్నారన్నారు. ఈ అరుపుల వలన కాపుల కళ్లు ఎరుపెక్కుతున్నాయని మాత్రం గ్రహించాలని హితవుపలికారు. సూర్యప్రకాశ్‌రావుకు సంఘీభావం తెలిపినవారిలో తెలగసంఘం నాయకులు శవ్వాన ఉమామహేశ్వరి, వెంకటేశ్వరరావు, బస్వా హరినారాయణ, కొత్తపల్లి నారాయణరావు, ముత్తా వెంకటరమణ, రొక్కం బాలకృష్ణ, పి.వెంకటరావు, బత్తుల వైకుంఠరావు, బి.చిన్నయ్య, యర్నాగుల జగ్గారావు, వై.మహేశ్వరరావు, ఎ.గోపాలరావు, వరదరాజులు, రొక్కం శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.