శ్రీకాకుళం

గెస్ట్ టీచర్లపై వేటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, జూన్ 17: ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల్లో శతశాతం ఫలితాల కోసం అంకితభావంతో దశాబ్దాల తరబడి చాలీచాలని వేతనాలతో విధులను నిర్వహిస్తున్న గెస్ట్ టీచర్లపై బాబు సర్కార్ వేటువేసింది. బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను విస్మరించేలా నిన్న ఔటుసోర్సింగ్ ఉద్యోగులు, మొన్న క్షేత్రసహాయకులు, ఆపైన ఆదర్శరైతులు తొలగించేలా నిర్ణయాలు తీసుకోవడం నిరుద్యోగులు మరింత కలవరానికి గురవుతున్నారు. తాజాగా గురుకుల పాఠశాలల్లో వివిధ సబ్జెక్టులను తాత్కాలిక బోధకులుగా పనిచేస్తున్న వారితోపాటు వ్యాయామ అధ్యాపకులు, స్ట్ఫానర్సులు తొలగించి తిరిగి నియామకాలు సాగించేందుకు నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీచేసింది. దీంతో ఎన్నో ఏళ్ళుగా రూ.7,500ల వేతనానికి శాశ్వతబోధకుల మాదిరిగా పాఠాలు బోధించిన వారంతా వీధిన పడ్డారు. రాష్ట్రంలో 37 గురుకుల పాఠశాలల్లో సుమారు 200 మంది గెస్ట్ టీచర్లుగా సేవలందిస్తున్నారు. వీరి వేతనాన్ని కూడా రూ.15,000లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని తాజాగా నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేయడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా దరఖాస్తు చేసుకొన్నవారికి ఇంగ్లీషు మీడియం మూడు స్థాయిల్లో అంటే ఇంటర్, డిగ్రీ, పిజిల్లో తప్పనిసరని నిబంధన రూపొందించడంతో ఇప్పటివరకు గెస్ట్ టీచర్‌గా పనిచేసిన వారు అనర్హులు అయ్యే ప్రమాదం ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నోటిఫికేషన్ ప్రాప్తికి ఇప్పటికే 450 మంది ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకొన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై రాష్ట్రప్రభుత్వం పునఃపరిశీలించి నిన్నటి వరకూ గెస్ట్ టీచర్లగా సేవలందించిన వారిలో అర్హత ఉన్నవారిని కొనసాగించేందుకు వీలుగా వెయిటేజ్ మార్కులు ఇవ్వాలని వారంతా కోరుతున్నారు. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు ఈ సమస్యను విద్యాశాఖామంత్రి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళినట్టు తెలిసింది. వేటుకు గురయిన గెస్ట్ టీచర్లంతా రాజమండ్రి వేదికగా శుక్రవారం సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అలాగే ఎపి గురుకుల ఉపాధ్యాయుల సంఘం కూడా వీరి ఆందోళన కార్యక్రమాలకు సంఘీభావం తెలియచేయాలని నిర్ణయం తీసుకొంది.