శ్రీకాకుళం

2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకొండ(టౌన్), జూన్ 17: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని 2019 ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో సుమారు 500 మంది కార్యకర్తలు ఆ పార్టీలో చేరారు. మండలంలోని పొట్లి, ఆర్‌కే ఆర్‌పేట, అవలంగి, వెంకటాపురం, దుగ్గి తదితర గ్రామాల నుంచి భారీ సంఖ్యన కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కళా మాట్లాడుతూ వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డికి రాజకీయాలపై అవగాహన లేదన్నారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించడం చంద్రబాబునాయుడుకే సాధ్యమని తెలిపారు. ప్రతిపక్ష నేతకు కుర్చీ మీద ధ్యాస తప్ప ప్రజల మీద ఎటువంటి మమకారం లేదని విమర్శించారు. జిల్లా టిడిపి అధ్యక్షురాలు గౌతు శిరీష మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలకు ప్రతి ఒక్కరు ఆకర్షితులవుతున్నారన్నారు.
అన్ని ప్రాంతాల్లో పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను ఆకర్షితులై భారీ సంఖ్యలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపే లక్ష్యంగా అందరం పనిచేద్దామని వెల్లడించారు. అనంతరం పార్టీలో చేరిన వారిలో భాసూరు గ్రామానికి చెందిన ముంజేటి త్రినాథరావు, అవలంగి గ్రామ సర్పంచ్ కోట భవానీ, కోట సంగంనాయుడు, సర్పంచ్ పొటూరు లక్ష్మీ, పొట్నూరు సూరపునాయుడు, పొట్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బెజ్జిపురం లక్షుంనాయుడు తదితరులు ఉన్నారు. వీరికి పార్టీ కండువాలు కప్పి కిమిడి కళా వెంకటరావు పార్టీలోకి ఆహ్వానించారు. భాసూరుకు చెందిన సర్పంచ్ ప్రతినిధి లెంక అప్పలనాయుడు ప్రత్యర్థులను పార్టీలో చేర్పించుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీనిపై కళా స్పందిస్తూ పార్టీలోకి వచ్చే ప్రతి ఒక్కరిని చేర్చుకోవడం రాష్ట్ర పాలసీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ, ఎఎంసి చైర్మన్ చింత సంగంనాయుడు, జిల్లా యువజన పార్టీ కార్యదర్శి వారాడ సుమంత్‌నాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు వంజరాపు ఈశ్వరరావు, మండల ప్రత్యేకాహ్వానితులు కర్నేన అప్పలనాయుడు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రతినిధి ఖండాపు వెంకటరమణ పాల్గొన్నారు.