శ్రీకాకుళం

గుర్తింపు లేకుంటే తాళం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), జూన్ 17: జిల్లాలో ఇప్పటివరకు గుర్తించిన 103 గుర్తింపులేని పాఠశాలల నుంచి రానున్న విద్యాసంవత్సర కాలంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవడంలో భాగంగా శుక్రవారం జిల్లా విద్యాశాఖాధికారి, ఉప విద్యాశాఖాధికారి ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. 14 బృందాలుగా ఏర్పడి పట్టణంలోని 28 పాఠశాలలు, శ్రీకాకుళం రూరల్‌లో మూడు మొత్తం 31 పాఠశాలలను తనిఖీ చేసి వాటిని మూసివేసినట్టు విద్యాశాఖాధికారులు తెలిపారు. పట్టణ పరిధిలో ఒకేసారి దాడులు చేసేందుకు వీలుగా ఎంఇవో కృష్ణారావు ఆధ్వర్యంలో 14 బృందాలు అనుమతులు లేని పాఠశాల వద్దకు చేరుకొని ఆయా హాజరు పట్టికలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తిగా గుర్తింపులేని రెన్యూవల్ చేయించుకోని పాఠశాలలను అప్పటివరకు ఉన్న విద్యార్థులను బయటకు పంపించి పాఠశాలలకు తాళాలు వేయించారు. అదే విధంగా 1నుంచి 7వ తరగతి వరకు గుర్తింపు ఉండి 8,9,10వ తరగతులకు గుర్తింపులేని పాఠశాలల్లో ఆయా తరగతులకు చెందిన విద్యార్థులను బయటకు పంపించి తరగతి గదులకు తాళాలు వేశారు. ఈ సందర్భంగా డిఇవో మాట్లాడుతూ ఇటీవల ప్రవేశపెట్టిన నిరంతర సమగ్ర మూల్యాంకన విధానాన్ని అనుసరించి పదో తరగతి మార్కుల్లో ఇకపై 20శాతం 8, 9వ తరగతుల నుంచి విద్యార్థి ప్రతిభ ఆధారంగా సేకరిస్తారని, ఇందులో భాగంగా 8కి 5శాతం, 9కి 5శాతం, 10కి 10శాతం మార్కులు ఉంటాయన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ గుర్తింపు పొందని పాఠశాలలలో చదివించిన పక్షంలో ఈ విధానాన్ని అనుసరించి విద్యార్థి నష్టపోతారని సూచించారు. అదే విధంగా నిన్నటివరకు జిల్లా వ్యాప్తంగా 46 అనుమతి లేని పాఠశాలలను ఆయా మండలాల పరిధిలో మూయించినట్టు స్పష్టంచేశారు. డిప్యూటీ డిఇవో సుబ్బారావు కూడా ఆకస్మిక తనిఖీల్లో పాల్గొని అనుమతిలేని పాఠశాలలు మూయిస్తూ అందులో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు వీటిలో చేర్పించడం ద్వారా వచ్చే నష్టాలపై అవగాహన కల్పించారు. అదే విధంగా ఒకేసారి అధికారులతో మూయించబడిన పాఠశాలలను తిరిగి ఏ విద్యాసంస్థ అయినా తెరచి తరగతులు నిర్వహిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.