శ్రీకాకుళం

ఆలయాలు కూలదోయడం హిందూ ధర్మమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), జూలై 4: రాష్ట్ర ప్రభుత్వ ధృతరాష్ట్ర పాలనను ప్రజలు ఎండగట్టేందుకు సిద్ధం కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రొక్కం సూర్యప్రకాషరావు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాజధాని పేరిట అమరావతి భూముల్ని, తెలుగు తమ్ముల్ల పేరిట సదావర్తి సత్రం ఇలా ఎన్నో అవినీతి అక్రమాల్లో కూరుకుపోయిన టిడిపి ప్రభుత్వం ఆఖరికి ఆలయాల విధ్వంసానికి నడుంబిగించిందని విమర్శించారు. తామంతా హిందువులమని చెప్పుకుంటూ, హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని ఉత్తుత్తి ప్రచారం చేసుకుంటున్న నేతలే నేడు దేవాలయాలను పడగొట్టడంతో వారి సంస్కృతి బయటపడుతోందన్నారు. సిఎం చంద్రబాబు నాయుడుకు దేవుడిమీద భక్తి, నమ్మకం లేదన్నందుకు ప్రతిష్ఠాత్మక ఆలయాల పట్ల, సనాతన ధర్మం పట్ల ఆయన వ్యవహరిస్తున్న తీరు నిదర్శనమని పేర్కొన్నారు. ఒకవేళ ఆలయాలను తొలగించి, వేరేచోట నిర్మించాలంటే ఆగమ ధర్మాన్ని పాటించి, క్రతువులు నిర్వహించి, తద్వారా మఠాధిపతులు, పీఠాధిపతులు సమక్షంలో కార్యక్రమాలు చేపట్టాలని, ఇలా రాష్ట్రానికి అరిష్టం వచ్చేలా ఇష్టానుసారం ఆలయాలను కూలదోయడం సరికాదని హెచ్చరించారు. సమావేశంలో వైకాపా నేతలు గుడ్ల మల్లేశ్వరరావు, మెరక సూర్యనారాయణ పాల్గొన్నారు.