శ్రీకాకుళం

యువత చైతన్యవంతులు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూలై 4: స్వామి వివేకానంద, అల్లూరి సీతారామరాజుల స్ఫూర్తితో యువత చైతన్యవంతులు కావాలని, దేశానికి దశదిశ నిర్థేశించేది యువత మాత్రమేనని పార్లమెంట్ సభ్యుడు రామ్మోహన్‌నాయుడు అన్నారు. స్థానిక బాపూజీ కళామందిర్‌లో సోమవారం స్వామివివేకానంద అమృతోత్సవాలు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జన్మదినోత్సవం, సిక్కోలు యువశక్తి ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచానికి భారతదేశ ఔన్నత్యాన్ని, ఉనికిని చాటిచెప్పిన మహనీయుడు స్వామివివేకానంద అని అన్నారు. సమాజానికి హితం చేయడమే మోక్షమార్గమని చాటిచెప్పిన వివేకానందుని స్ఫూర్తితో యువత మంచివ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలని తెల్లదొరలకు ఎదురొడ్డి భారత స్వాతంత్య్ర సముపార్జనకు తన ప్రాణాలను అర్పించిన మన్యం దొర అల్లూరి ధైర్య సాహసాలు, సమాజం కోసం పోరాడే తత్వాలను అలవర్చుకోవాలని సూచించారు. నేడు యావత్ ప్రపంచం భారత్‌వైపే చూస్తోందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ యువతపై ఎన్ని ఆశలు పెట్టుకున్నారని, సమస్యలపరిష్కారంలో కలిసికట్టుగా పనిచేసి భవితకు దారి చూపాలన్నారు. ఉన్నత విద్యను ఆర్జించి జిల్లా అభివృద్ధికి కృషి చేసి, రక్తదానం చేయడం, గ్రామపారిశుద్ధ్యాన్ని నిర్వహించడం, స్వచ్ఛ్భారత్‌కు నాంది పలకాలన్నారు. అంతర్గత శక్తులను మేల్కొపుకొని ఓటమి నుండి విజయంవైపు పయణించాలన్నారు. ముందుగా స్వామి వివేకానంద విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాపూజీ కళామందిర్ వరకు ర్యాలీని నిర్వహించారు. వివేకానంద జీవిత విశేషాల పుస్తకాన్ని, సిక్కోలు యువశక్తి బేనర్‌ను ఆవిష్కరించారు. వివిధ కళాశాలల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమోంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్భయ ఫౌండేషన్, గీతా ఫౌండేషన్ అధ్యక్షురాలు గీతా శ్రీకాంత్, చైతన్య విద్యా సంస్థల అధినేత జామి భీమశంకరరావు, వివేకానంద సేవా సమితి సభ్యులు కెయుఎన్ మూర్తి, బరాటం లక్ష్మణరావు, డాక్టర్ దానేటి శ్రీ్ధర్, కౌశిక్, వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్, అంబేద్కర్ విశ్వవిద్యాలయం, సన్‌డిగ్రీ కళాశాల విద్యార్థులు భవిత స్వచ్ఛంద సంస్థ, ఆదర్శ యువజన సంఘ ప్రతినిధులు, యోగా గురు రామారావు, వెంకటరావు పాల్గొన్నారు.