శ్రీకాకుళం

షట్టర్ల వినియోగానికి అనుమతి ఇవ్వండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూలై 4: ఏభై కోట్ల రూపాయల వంశధార షట్టర్ల కుంభకోణాన్ని సి.ఐ.డి. అధికారులు విచారణలు చేసీచేసి... చివరికి ఐదు కోట్లు విలువచేసే షట్టర్లు తుప్పుపట్టిపోతున్నాయంటూ నివేదికలు ప్రభుత్వానికి ఇచ్చారు. దీంతో కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం ఇటీవల ముఖ్యమంత్రితో జరిగిన వీడియోకాన్ఫరెన్స్‌లో మిగిలిన ఆ మాత్రం షట్టర్లు అయినా అనుమతిస్తే వంశధార కుడి, ఎడమ కాల్వల కింద గల కాలిబాట బ్రిడ్జిలకు వినియోగిస్తామంటూ కోరిన విషయం తెలిసిందే. ఆ మేరకు ప్రభుత్వం అవినీతి షట్టర్లలో మిగిలిన వాటిని వినియోగించుకోవడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. నందిగాం, పలాస, టెక్కలి, వజ్రపుకొత్తూరు, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, సారవకోట, జలుమూరు మండలాల్లో గల వంశధార నడకదారి బ్రిడ్జిలకు ఈ షట్టర్లు వినియోగించుకునేందుకు ఇంజనీర్లు ఇండెంట్ పెట్టాలంటూ ఆ శాఖ ఉన్నతాధికారులు కోరారు. 2008లో 60 కోట్ల రూపాయలతో వంశధార నదిపై నడకబాట బ్రిడ్జిలకు షటర్లు వేస్తే అన్నదాతలు గడ్డిమాపులతో నీటిని నిల్వలు చేసుకునే అవస్థల నుంచి బయటపడతారన్న భావనతో అప్పటి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇందులో 20 కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్టు విజిలెన్స్ అధికారులు ధ్రువీకరించి కేసులు నమోదు చేసి ఇందుకు సంబంధించిన 33 మంది ఇంజనీర్ల నుంచి 19 కోట్ల రూపాయలు రికవరీ చేయాలంటూ ప్రభుత్వానికి నివేదించిన విషయం తెలిసిందే! ఎనిమిది ఏళ్ళు తర్వాత ఆ అవినీతి కుంభకోణం సి.ఐ.డి. అధికారుల చేతికి చేరింది. కానీ, ఇప్పటికీ ఇంకా ఛార్జీషీటు దాఖలు చేయలేదు. అవినీతికి పాల్పడినట్టు విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదికల మేరకు 19 కోట్ల రూపాయల్లో చిల్లిగవ్వ కూడా ఇప్పటికీ రికవరీ చేయలేదు. కేవలం ఐదు, ఆరు కోట్లు రూపాయల విలువచేసే షటర్లు మాత్రం ప్రస్తుతానికి సి.ఐ.డి. అధికారుల ఆధీనంలో ఉన్నాయి. వాటిని వీలైనంత త్వరగా వంశధార ఇంజనీర్లకు అప్పగించాలంటూ మధ్యంత ఉత్తర్వులు ప్రభుత్వం ఇచ్చినట్టు తెలుస్తోంది. అదే జరిగితే, ఎగువ ప్రాంతంలో చివరి ఎకరావరకూ సాగునీరు అందించేందుకు ఈ తుప్పుపట్టిన షటర్లు వినియోగించుకునే అవకాశం ఉందంటూ ఇంజనీర్లు భావిస్తున్నారు.
ఎనిదేళ్ళుగా కోట్లాది రూపాయల షటర్లు నిరుపయోగంగా పడివున్నాయని, కలెక్టర్ చొరవతో అన్నదాతకు సాగునీరు నిల్వ చేసుకునేలా ఉపయోగపడతాయంటూ ఇంజనీర్లు పేర్కొంటున్నారు.