శ్రీకాకుళం

ప్రజా ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), జూలై 4: జిల్లా ప్రజా ఫిర్యాదుల విభాగానికి వచ్చే సమస్యల పట్ల సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్ ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించే డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో ఫోన్‌ద్వారా ఆయన వినతులు స్వీకరించారు. కల్లెపల్లి గ్రామం నుండి నక్క చిన్నవాడు తాను నృత్య కళాశాలలో ఆరునెలలుగా వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నానని, తనకు నేటి వరకు జీతభత్యాలు పైసా చెల్లించలేదని ఫిర్యాదు చేశారు. గార మండలం శ్రీకూర్మం గ్రామ పంచాయతీ కోలపేట నుండి ఎం.చిన్నమ్మడు తన భర్త అప్పలరాముడు రిమ్స్ ఆసుపత్రిలో మరమ్మతు పనులు చేస్తుండగా, గోడకూలి మృతిచెందాడని, తన కుమారునికి ఉపాధి అవకాశం కల్పించాలని ఫోన్‌లో కోరారు. పొగిరి గ్రామం నుండి ఉదరవెల్లి అక్షయ తనను వంగర రెసిడెన్సియల్ పాఠశాల నుండి ఎచ్చెర్ల గురుకుల పాఠశాలకు మార్చాలని కోరారు. ఎచ్చెర్ల మండలం పూడివలస నుండి కె.తౌడు తనకు వికలాంగ ఫించను మంజూరు చేయాలని విన్నవించారు. పొందూరు మండలం కింతలి గ్రామం నుండి ఎ.గోపాలరావు, ఆర్.రాజయ్య తదితరులు గత 30 ఏళ్లుగా ఎస్సీ కాలనీ వాడుక నీరు బయటకు పోవడానికి మార్గం లేక తమ ఇంటి చుట్టుపక్కల చేరి దుర్వాసనతో పాటు రోగాలు వస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో జెసి-2 పి.రజనీకాంతారావు, గృహనిర్మాణ సంస్థ మేనేజరు నరసింగరావు, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు రామారావు పాల్గొన్నారు.