శ్రీకాకుళం

ఎస్పీ ‘గ్రీవెన్స్’కు వెల్లువెత్తిన ఫిర్యాదులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), జూలై 4: జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో సోమవారం నిర్వహించే ఎస్పీ గ్రీవెన్స్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మొత్తం 25 అర్జీలు రాగా వాటిని పరిశీలించిన జిల్లా ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి సంబంధిత పోలీసు స్టేషన్ హౌస్ అధికారులతో మాట్లాడుతూ వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం ఎస్పీ కార్యాలయానికి వచ్చే అర్జీలను త్వరితగతిన పరిష్కరించి ఫిర్యాదు దారులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. సోమవారం అందిన 25 ఫిర్యాదుల్లో కుటుంబ తగాదాలకు సంబంధించి రెండు కేసులు, సివిల్ తగాదాలకు సంబంధించి ఏడు, పాత కేసుల పరిష్కారం కోరుతూ ఆరు, ఇతర తగదాల పరిష్కారానికి సంబంధించి పది అర్జీలు అందాయి. అలాగే అదే ఆవరణలో ఓయస్‌డి కె.తిరుమలరావు ఆధ్వర్యంలో నిర్వహించే కుటుంబ సలహా కేంద్రానికి 22 ఫిర్యాదులు రాగా అందులో కౌన్సిలింగ్ అనంతరం ఆరు ఫిర్యాదులను రాజీమార్గంలో పరిష్కరించారు. మిగిలిన 16 కేసులను వాయిదా వేసారు. కార్యక్రమంలో లీగల్ అడ్వయజర్ కె.ఆపీసునాయుడు, డిఎస్పీ కె.్భర్గవరావు నాయుడు, ఇతర ప్రతినిధులు పి.రాజేశ్వరరావు, టి.వరప్రసాదు, బరాటం కామేశ్వరరావు, డిఆర్‌డిఎ, ఐసిడిఎ ప్రతినిధులు పాల్గొన్నారు.