శ్రీకాకుళం

రైతన్నకు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), జూలై 4: నానాటికి వ్యవసాయ రంగం సంక్షోభంలోకి కూరుకుపోతుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని నమ్ముకున్న కుటుంబాలను ఆదుకునేలా వివిధ కార్యక్రమాలను రూపొందిస్తూ ముందుకు సాగుతున్నాయి. అన్నదాతకు అండగా రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ, వడ్డీలేని పంట రుణాలు వంటి పథకాలు అమలుచేయగా మోదీ సర్కార్ ప్రధానమంత్రి సడక్‌యోజన ఫసలీ బీమా పథకాన్ని రూపొందించడమే కాకుండా ఖరీఫ్‌లో వరి సాగు చేసే రైతులకు ఊరటనిచ్చేలా ఎరువుల ధరలను తగ్గించిన నిర్ణయం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నిర్ణయం వలన జిల్లా రైతాంగానికి సుమారు పదికోట్ల రూపాయలు మిగులనుంది. వ్యవసాయ మదుపులు పెరుగుతున్న దృష్ట్యా ఎరువుల దరలు దిగిరావడం అన్నదాత కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి సగటున యూరియా 45 వేల మెట్రిక్ టన్నులు, డిఎపి 12వేల మెట్రిక్ టన్నులు, ఎంవోపి పదివేల మెట్రిక్ టన్నులు, కాంప్లెక్సు ఎరువులు సుమారు 12వేల మెట్రిక్ టన్నుల వరకు వినియోగం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు టన్ను డిఎపి ఎరువుపై 2500 రూపాయలు, కాంప్లెక్సు ఎరువులపై టన్నుకు వెయ్యి రూపాయలు, ఎంవోపి ఎరువుపై టన్నుకు ఐదు వేల రూపాయలు రాయితీ ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రీయ ఎరువుల వాడకాన్ని పెంచాలని కూడా ప్రచారం చేస్తుంది. ఇందుకు కొన్ని గ్రామాలను ఎంపిక చేసి, అక్కడ సేంద్రీయ ఎరువులతోనే వ్యవసాయం సాగించాలని చెప్పి, అక్కడి వారికి అవగాహన సదస్సులు వంటివి నిర్వహించి ప్రోత్సాన్ని అందించేందుకు కృషిచేస్తోంది. ఖరీఫ్ సీజన్‌లో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల కొంతమేర సంతోషదాయకమైనా, తక్షణమే ఈ తగ్గింపు దరలు అమలులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.