శ్రీకాకుళం

అక్షరాస్యతపై అవగాహన తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గార, జూలై 19: మండలం బూరవెల్లి గ్రామంలో స్థానిక సర్పంచు మళ్ల ఆగ్నేయ ఆధ్యర్యంలో శ్రీకాకుళం రూరల్ మం డలం కరజాడలో గల ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు వారు అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా బ్యాంకు అధికారులు పద్మావతి, శ్రావన్ కుమార్, ప్రేమ్‌చంద్, న్యాయవాది మళ్ల అబ్బాయినాయుడు తదితరులు మాట్లాడుతూ మన ఊరు.. మన బ్యాంకు.. మన బ్యాంకు మిత్ర నినాదానికి సార్ధకత చేకూర్చే దిశగా ప్రతి ఒక్కరు బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సంపూర్ణ అక్షరాస్యత సాధించిన నాడు ఇటువంటి సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. ఖాతా దారులకు సంపూర్ణమైన సేవలు అందించే దిశగా గ్రామీణ వికాస్ బ్యాంకు కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా మహిళా సంఘ సభ్యులుతో పాటు స్థానికులకు మన ఊరు.. మన బ్యాంకు మిత్ర సేవలను వివరించారు. బ్యాంకు సిబ్బంది రమణ, నీలవేణి, సి.ఎస్.పి. మళ్ల నర్సింహమూర్తి, గ్రామ సంఘం అధ్యక్షురాలు ఎల్. సోమేశ్వరి, సి.ఎఫ్. కొండమ్మలతో పాటు మహిళలు ఉన్నారు.