శ్రీకాకుళం

నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కాకుండా...వంశధార పనులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), జూలై 19: జిల్లాలోని వంశధార నిర్వాసితుల పునరావాసం వంటి అనేక సమస్యలు పెండింగ్‌లో ఉండగా పనులు ప్రారంభించాలంటూ ఇంజనీరింగ్ అధికారులను రాష్ట్ర మంత్రి ఆదేశించడంలో అర్థం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.కృష్ణమూర్తి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక సిటు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్వాసితులతో సమావేశం ఏర్పాటు చేసి వారిని భయబ్రాంతులను గురిచేసే విధంగా ప్రశ్నించిన వారికి ప్రభుత్వ సత్తా చూపిస్తామని అనడం మంత్రి నిరంకుశ వైఖరికి నిదర్శనమన్నారు. రెండో దశ పనులు పూర్తికి సుమారు వెయ్యి నుంచి 1200 కోట్ల రూ.లు అవసరం కాగా కేవలం 427 కోట్ల రూ.లు నిధులు వెచ్చించి, తాము ఏదో సాధించామనుకోవడం తగదని ఎద్దేవా చేశారు. నిర్వాసితుల సమస్యలను పూర్తిగా పరిష్కరించకుండా పనులు ప్రారంభిస్తే ప్రజా వ్యతిరేకత చవిచూడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ముందుగా నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేసిన తరువాతనే పనులు ప్రారంభించాలని ఆయన సూచించారు. సమావేశంలో ఆయనతో పాటు సపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చౌదరి తేజేశ్వరరావు, జిల్లా కార్యదర్శి భవిరి కృష్ణమూర్తి పాల్గొన్నారు.