శ్రీకాకుళం

సక్రమంగా పల్స్ సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలాకి, జూలై 19: జిల్లాలో ప్రతీ ఒక్క పంచాయతీ కార్యదర్శి స్థానికంగా ఉండి పల్స్ సర్వేను ప్రతీ రోజూ ఉదయం 6గంటలకు ప్రారంభించాలని డిపివో కోటేశ్వరరావు ఆదేశించారు. మంగళవారం ఎంపిడివో కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడారు. పంచాయతీ కార్యదర్శులకు ఇచ్చిన సమయంలో పల్స్ సర్వే నిర్వహించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో పల్స్ సర్వే దయనీయంగా ఉందన్నారు. పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ చూపి సకాలంలో పూర్తి చేయాలని కోరారు. జిల్లాలో 200 పంచాయతీ భవనాల నిర్మాణాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాధనలు పంపినట్టు తెలిపారు. అలాగే జిల్లాలో 14,346 మంచినీటి బోర్లు ఉన్నాయని వాటి కోసం రూ.1.43కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. సిపిడబ్ల్యూ స్కీమ్‌లో 220 బోర్లు కోసం రూ.1.92,66,000 లను ఖర్చు చేసినట్టు తెలిపారు. అదే విధంగా ఆమదాలవలస, నరసన్నపేట, ఎచ్చెర్ల, గార, ఎల్ ఎన్ పేట, లావేరు, పోలాకి, రణస్థలం, సరుబుజ్జిలి, పొందూరు, శ్రీకాకుళం, బూర్జ, కొత్తూరు, రేగిడి ఆమదాలవలస, హిరమండలం, పాలకొండ, సీతంపేట, సంతకవిటి, మెళియాపుట్టి, రాజాం, భామిని, టెక్కలి, సంతబొమ్మాళి, పలాస, కంచిలి, ఇచ్ఛాపురం, సోంపేట, కోటబొమ్మాళి, నందిగాం, జలుమూరు మండలాల వారు ప్రభుత్వానికి విద్యుత్ బిల్లులు చెల్లించవలసిందన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వానికి రూ.1,14,61,491 బోర్లు, సిపిడబ్ల్యూ స్కీమ్‌ల కోసం చెల్లించవలసిందన్నారు. జిల్లాలో 5078బోర్లు ఉన్నాయని సిపిడబ్ల్యూ స్కీమ్‌లు 74 ఉన్నాయని వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డిపివోతోపాటు ఇవోఆర్డి రవికుమార్, మండల పరిషత్ సూపరింటెండెంట్ వై.వి రమణలు ఉన్నారు.