శ్రీకాకుళం

విద్యార్థులకు ఉచిత నేత్ర శస్త్ర చికిత్సలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసన్నపేట, జూలై 19: మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా నేత్రశస్త్ర చికిత్సలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రముఖ సంధ్యాకంటి ఆసుపత్రి వైద్యుడు ఎం ఎస్ రాజు తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక బోర్డు ఉన్నత పాఠశాలలో 550మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువగా విద్యార్థుల్లో ‘ఎ’ విటమిన్ లోపం కనిపిస్తోందని వారికి ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని లేనిపక్షంలో కంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని స్పష్టంచేశారు. 40మంది విద్యార్థినీ విద్యార్థులకు దృష్టిలోపాలు ఉన్నట్టుగా గుర్తించామని వీరందరికీ ఉచితంగా కళ్లజోడులు పంపిణీచేస్తామని తెలిపారు. అయి దుగురికి శస్త్ర చికిత్సలు చేసేందుకు ఎంపిక చేశామని వారి తల్లిదండ్రుల అనుమతి మేరకు వారికి ఉచితంగానే వైద్య సహాయం అందిస్తామని స్పష్టంచేశారు. హెచ్‌ఎం శాంతారావు, ఆప్తాలమిస్ట్ శ్రీనివాసరావు, తాతారావు, రమణయ్యలు పాల్గొన్నారు.