శ్రీకాకుళం

అజ్ఞానాన్ని తొలగించేవాడే గురువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.సిగడాం, జూలై 19: భగవంతుడు ప్రసాదించిన మానవ జన్మ ఉత్కృష్టమైనదని అటువంటి మానవ జన్మలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించేవాడే గురువని మండలం ఎందువ గ్రామానికి చెందిన గురుదేవులు విశ్వనాథ చైతన్య మహరాజ్ అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక షిర్డీసాయి మందిరంలో గురుపౌర్ణమి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బాబావారి చిత్రపటాన్ని పల్లకిలో నగర సంకీర్తన నిర్వహించారు. గురుపౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేసిన సత్సంగం కార్యక్రమాల్లో మహరాజ్ పాల్గొని గురుపౌర్ణమి విశిష్టతను విపులంగా వివరించారు. గురుతత్వాన్ని గూర్చి బాబాల వారే ముందుగా తెలియజేసినట్టు ఆయన తెలిపారు. పరిపూర్ణమైన భక్తి కలిగిన వ్యక్తి ఒక అడుగు ముందుకు వేస్తే నేను వెనుకనుండి పది అడుగులు వేస్తూ అతని వెన్నంటే ఉంటానని సాయితత్వం అన్నారు. ఆలయ కన్వీనర్ డిఎం రామం మాట్లాడుతూ ప్రతీ వారికి ముందుగా తల్లిదండ్రులు, గురువు దైవం అన్నారు. దీపం అంటే జ్ఞానమని అలాంటి జ్ఞానజ్యోతిని ప్రసాదించేవాడే గురువు అన్నారు. అనంతరం సాయి ప్రసాదంగా ఆలయ ప్రాంగణంలో సుమారు 300మందికి అన్నసమారాధన నిర్వహించారు. గురుపౌర్ణమి సందర్భంగా మండల పరిధిలో ఎందువ, గెడ్డకంచరాం, చంద్రయ్యపేట, ఆనందపురం, ముసిమివలస తదితర గ్రామాల్లో వెలసియున్న షిర్డీసాయి మందిరాల్లో గురుపౌర్ణమి వేడుకలు నిర్వహించారు. కనకమహాలక్ష్మీ, సరోజిని, భారతి, దేవిశెట్టి ప్రసాదరావు దంపతులతోపాటు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.