శ్రీకాకుళం

అధిక దిగుబడులు సాధించాలి: కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతపట్నం, జూలై 19: వ్యవసాయరంగంలో అధికదిగుబడులు సాధించే దిశగా రైతులు ముందుకు సాగాలని కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం ఆదేశించారు. పాతపట్నం నియోజకవర్గస్థాయి అభివృద్ధి సమీక్షా సమావేశం స్థానిక వ్యవసాయ మార్కెట్ అవరణలో జరిగింది. ఈ సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి పరంగా నియెజకవర్గం వెనుకబడి ఉందన్నారు. సారవంతమైన భూములు ఉన్నప్పటికీ పరిశ్రమలు, పట్టణీకరణ తక్కువగా ఉండడం వలన తలసరి ఆదాయం తక్కువగా ఉందన్నారు. తలసరి ఆదాయంలో జిల్లాలో ఎచ్చెర్ల మొదటిస్థానంలో నిలవగా, టెక్కలి రెండోస్థానంలో ఉందన్నారు. వ్యవసాయంలో రెండు,మూడు పంటలు వేసుకునే విధంగా రైతులను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. వరితోపాటు చేపల పెంపకంపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి కుటుంబానికి నెలకు పది వేల రూపాయల ఆదాయం ఉండాలన్నదే ముఖ్యమంత్రి సంకల్పమన్నారు. వ్యవసాయశాఖ అధికారులు మంచి కార్యచరణ రూపొందించాలని సూచించారు. ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రధాన సమస్యల పరిష్కారం కోసం అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. డిప్యూటేషన్లు రద్దు చేయాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నీటి సరఫరా విభాగంలో సిబ్బంది కొరత ఉందని స్పష్టం చేశారు. ఇదిలావుండగా హిరమండలం పశువైద్యాధికారి విధులకు సక్రమంగా హాజరు కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే నియోజకవర్గంలో అన్ని చెరువుల్లో చేపల పెంచడానికి సమావేశం తీర్మానించింది. తొలుత కాగువాడ ఎర్రచెట్టు గట్టుమీద మొక్కలు నాటే కార్యక్రమంలో కలెక్టర్, ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సమీక్షలో వ్యవసాయశాఖ జెడి జి.రామారావు, వెటర్నరీ జెడి మెట్ట వెంకటేశ్వర్లు, ఐటిడి ఎ పివో జె.వెంకట్రావు, పాలకొండ ఆర్డీవో ఆర్.గున్నయ్య, డుమా పిడి ఆర్.కూర్మనాథ్, జడ్.పి సి ఇవో బి.నగేష్, ప్రణాళిక అధికారి శివరామ్ నాయకర్, ఎస్‌సిలు ఇ.రామచంద్ర, ఎ.మోహన్ మురళీ, పౌర సరఫరాల అధికారి సుబ్రమణ్యం, పారసరఫరాల జిల్లా మేనేజర్ జె.వి.జయరాం, బి.రవీంద్ర, ఎస్.శ్రీనివాస్ పాల్గొన్నారు.