శ్రీకాకుళం

బిసిల అభ్యున్నతికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, జూలై 19: జిల్లాలో అధిక శాతం బిసిలు ఉన్నారని వీరి అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని సెర్ఫ్ సిఇవో కృష్ణమోహన్ స్పష్టంచేశారు. సంక్షేమ కార్యక్రమాలు అర్హులకు అందించడంలో వెలుగు, డిఆర్‌డిఎ సిబ్బంది ప్రధాన భూమిక పోషించాలని, బ్యాంకు లింకేజి, శ్రీనిధి రుణాతలు శతశాతం లక్ష్యాలు అధిగమించాలని కోరారు. అలాగే రికవరీలో కూడా ముందు వరుసలో నిలవాలని ఆదేశించారు. ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్ అమలులో కూడా మహిళా సంఘాలు కీలకంగా వ్యవహరించాలన్నారు. బిసిలకు స్వయం ఉపాధి రుణాలు 50శాతం మహిళా సంఘాల పర్యవేక్షణలో లబ్ధిదారుల ఎంపిక జరగాలన్నారు. డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ రుణాలు లక్ష్యాలను అధిగమించేలా సిబ్బంది ప్రణాళికా బద్ధంగా విధులు నిర్వహించాలని కృష్ణమోహన్ ఆదేశించారు. స్థానిక టిటిడిసిలోని కాన్ఫరెన్స్ హాల్‌లో వెలుగు, డిఆర్‌డిఎ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. లింకేజి రుణాలు అర్హులైన సంఘాలకు అందించి తద్వారా ఆర్థిక స్వావలంబన సాధించేలా కృషి చేయాలన్నారు. వర్మికంపోస్టు కిట్లుపై అవగాహన కల్పించి సేంద్రియ వ్యవసాయ విధానంలో వివిధ పంటల సాగుపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వెలుగు పథకంలో అందిస్తున్న అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు డ్వాక్రా సంఘాల్లో భాగస్వామ్యులైన కుటుంబాలకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. వెలుగు, డిఆర్‌డిఏ రెండు శాఖలు కాదని ఇక్కడ ఉద్యోగులంతా సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ లక్ష్యాన్ని అధిగమించాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్‌డిఏ పిడి ఎస్.తనూజారాణి, ఏపిడి వైవి రమణారావు సిబ్బంది పాల్గొన్నారు.
సెర్ఫ్ సిఇవోను కలిసిన కలెక్టర్: జిల్లాకు విచ్చేసిన సెర్ఫ్ సి ఇవో కృష్ణమోహన్‌ను మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం కలిసి వివిధ శాఖల పనితీరుపై చర్చించారు. జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక కార్యక్రమాలు తీరుతెన్నులను సెర్ఫ్ సిఇవో అడిగి తెలుసుకున్నారు.