శ్రీకాకుళం

డౌన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూలై 19: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన పల్స్ సర్వేకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రజాసాధికార సర్వే ప్రారంభమై పది రోజులు కావస్తున్నా నత్తనడకన సాగడంతో అధికారులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. క్షేత్రస్థాయిలో సాంకేతిక పరమైన ఇబ్బందులు ఎన్యుమరేటర్లకు మరింత తలనొప్పిగా తయారయ్యాయి. సర్వే నాలుగు అడుగులు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా గ్రామాల్లో సాగడంతో అటు అధికారులు, ఇటు ఎన్యుమరేటర్లు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలోని 27లక్షల జనాభా ఉండగా పది రోజుల్లో కేవలం 8,573 కుటుంబాలకు సంబంధించిన వివరాలు సేకరించినట్టు గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. ఇదిలా ఉండగా రోజుకో వెర్సన్ పేరిట ఎనిమిది సార్లు సాఫ్ట్‌వేర్‌ను మార్చడంతో ఎన్యుమరేటర్లు అంతా అయోమయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎక్కడ చూసినా సిగ్నల్ కొరత వెంటాడటంతో నమోదు సమయంలో పూర్తి డేటా అప్‌లోడ్ చేయలేని పరిస్థితి ఎదురవుతుందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1482మంది ఎన్యుమరేటర్లు విధులు నిర్వహించాల్సి ఉండగా ఇప్పటివరకు 700మంది మాత్రమే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నట్టు తెలిసింది. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజాసాధికార సర్వే పూర్తయ్యే పరిస్థితి కనిపించడంలేదు. జిల్లాలోని ఆరు మండలాలలో పదుల సంఖ్యలోనే సర్వే సాగుతుందని అధికారులే అంగీకరిస్తున్నారు. ఎల్‌ఎన్ పేట, జలుమూరు, వంగర, రణస్థలం, వీరఘట్టం, సరుబుజ్జిలి మండలాలలో ఈ సర్వేకు ప్రతికూల పరిస్థితులు వెంటాడుతున్నాయి. ఇదిలా ఉండగా జలుమూరులో 10మంది ఎన్యుమరేటర్లు 19 కుటుంబాలనే సర్వేచేయగా, ఎల్‌ఎన్ పేట మండలంలో 4 మంది 31 కుటుంబాలను, రణస్థలంలో 9మంది 25 కుటుంబాల సమగ్రసమాచారాన్ని సేకరించినట్టు విశ్వశనీయంగా తెలిసింది. ఇటువంటి పరిస్థితులు చక్కదిద్దేందుకు జిల్లా ఉన్నతాధికారులు వారివారి కీలక విధులు పక్కన పెట్టి చక్కెర్లు కొడుతున్నా సాంకేతికపరమైన కారణాలకు వేలిముద్రకు సంబంధించిన మిషన్లు కొరత వెంటాడటం వలన పల్స్ ముచ్చెమటలు పట్టిస్తోంది. 80 అంశాలు పొందుపరచాలని ట్యాబ్ నిర్వహణపై అవగాహన కల్పించినప్పటికీ కనీసం 50 అంశాలు నమోదు చేసేందుకు ఎన్యుమరేటర్లు నానా అవస్థలు పడుతున్నారు. రోజుకు 14 కుటుంబాల డేటాను అప్‌లోడ్ చేయాలని శిక్షణలో బోధంచినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉండటంతో ఎన్యుమరేటర్లకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు.
పల్స్ సర్వేవల్ల పంట రుణాలు జాప్యం:
తహశీల్దార్ కార్యాలయాలు పర్యవేక్షణలో ఈ సర్వే కొనసాగడం వల్ల రోజువారీ విధులకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఓ వైపు ఖరీఫ్ సీజన్ కావడం వలన రైతులు వ్యవసాయ మదుపుల నిమిత్తం పంట రుణాలు పొందేందుకు మ్యుటీషన్ కోసం గ్రామరెవెన్యూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వీరంతా గ్రామాల్లో సర్వే విధులు నిర్వహించడం వలన కార్యాలయాల్లో మ్యుటీషన్ ప్రక్రియ వేగవంతం కాకపోవడంతో బ్యాంకు అధికారులు వన్ బి అధారంగా చెల్లిస్తున్న పంట రుణాలు అందకుండా పోతున్నాయి. ఈ ప్రక్రియలో జాప్యం జరగడం వలన కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రధానమంత్రి ఫసలీ పంటల బీమా ప్రయోజనం దక్కకుండా పోతుందన్న భయం అన్నదాతలను వెంటాడుతుంది. ఇప్పటివరకు బ్యాంకులనుండి రుణం పొందిన రైతులకు కూడా మ్యుటీషన్ అవసరం తప్పనిసరి అవడం పల్స్ సర్వేకారణంగా తిప్పలుతప్పడం లేదు. కౌలు రైతుల పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. భూమి హక్కులు ఉన్న రైతులు వి ఆర్ వో ద్వారా డిక్లరేషన్ పొందిన కౌలు రైతుకు పంట రుణం అందించాలని బ్యాంకు అధికారులకు ఆదేశాలు ఉన్నాయి. అయితే పల్స్ సర్వే కారణంగా వి ఆర్ వోలు కౌలు రైతులకు తగిన రీతిలో సేవలందడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటువంటి అత్యవసర సేవలకు సంబంధించి జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుంటే ఖరీఫ్‌లో వరితోపాటు వివిధపంటలు సాగుచేసే రైతులు పంట రుణం, భీమా వంటి సౌకర్యాలు పొందటం గగనంగా మారుతుందని పలువురు అవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా పల్స్ సర్వేలో విధులు నిర్వహిస్తున్న ఎన్యుమరేటర్లు కష్టాలు పక్కన పెట్టి అన్నదాతలకు పంట రుణంఅందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారంతా కోరుతున్నారు.
సారవకోటలో...
సారవకోట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాకరంగా చేపట్టిన సాధికారిక పల్స్ సర్వే తిరోగమన దిశలో పరుగెడుతుంది. మండల కేంద్రంలో ఈ సర్వే కోసం ఇద్దరి ఎన్యుమరేటర్లను నియమించారు. వీరు ఈనెల 8నుండి సర్వే కార్యక్రమాన్ని చేస్తున్నప్పటికీ లక్ష్యాలలో మంగళవారం నాటికి కనీసం ఒక్క ఇంటిని కూడా సర్వే చేయలేకపోవడం శోచనీయం. సర్వేకు నియమింపబడిన వెలుగు సి ఎఫ్ సుశీల ఒక్క గృహానికి కూడా సర్వే పూర్తిచేయలేకపోయారు. ఈమెకు 420 గృహాలలో సర్వే చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా నెట్ సౌకర్యం లేనందున ట్యాబ్‌లు పనిచేయకపోవడంతో ఒక్క ఇంటిలో కూడా సర్వే పూర్తిచేయలేకపోయారు. మంగళవారం నాటికి సర్వే వివరాలను స్థానిక తహశీల్దార్ జామి ఈశ్వరమ్మ అందజేసిన అంకెలు ఈ విధంగా ఉన్నాయి. మండలంలో 13,425 గృహాలను సర్వ చేయవలసి ఉండగా ఇప్పటివరకు కేవలం 73 గృహాలలోమాత్రమే సర్వే పూర్తయిందని తెలిపారు. 52వేల జనాభాకు సంబంధించిన వివరాలు ట్యాబ్‌లలో పొందుపరచవలసి ఉండగా 619మంది సభ్యులకు సంబంధించిన వివరాలు మాత్రమే నమోదయ్యాయి. దీనిని బట్టి ఈ సర్వే ఎప్పటికి పూర్తవుతుందో తెలయని పరిస్థితి నెలకొంది. ఎన్యుమరేటర్లగా నియమించిబడిన వి ఆర్ వోలు, కార్యదర్శులు వెలుగు సిబ్బంది ప్రతిదినం ఆయాగ్రామాలలో ఉదయం నుండి సాయంత్రం వరకు మకాం పెట్టి ఉన్నప్పటికీ ఆశించిన లక్ష్యాలను అధిగమించలేకపోతున్నారు. ఇప్పటికైనా సాఫ్ట్‌వేర్‌ను సరిచేసి సర్వే సకాలంలో పూర్తిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సాంకేతికపరమైన చర్యలు చేపట్టవలసి ఉంది.