శ్రీకాకుళం

వ్యాసుడి రచనల్లో విలువలు పుష్కలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(కల్చరల్), జూలై 19: వేద సారాన్ని అందించిన వేద వ్యాసుడు శిష్యులకు నైతిక విలువలు బోధించి మంచి మార్గాన్ని నడిపించారని ఉపన్యాస కర్త పైడి హరనథ్‌రావు అన్నారు. ఆయన రచనల్లో విలువలు పుష్కలంగా ఉన్నాయని అన్నారు. శ్రీమన్నారాయణుడే లోకానికి వేద సారాన్ని అందించి వ్యాసునిగా ద్వాపరయుగంలో సత్యవతి గర్భాన పరశురామునీంద్రునికి సద్యోగర్భాన జన్మించెనన్నారు. బ్రహ్మదేవుడు చెప్పిన విధంగా వేదాలను విభజించి అష్టదశా పురణాలను, ఉపనిషత్తులను, మహాభారతాన్ని, స్మృతులను వ్యాసుడే రచించాడని, వ్యాసుడు త్రికాలవేది, త్రికాలద్రష్ఠ, స్వేచ్ఛా గమనం కాలవాడని అన్నారు. గురుపౌర్ణమి, వేదవ్యాస జయంతి సందర్భంగా మంగళవారం స్థానిక ఉపనిషన్మందిరంలో వేద వ్యాసుని చిత్రపటాన్ని పూర్ణకలశలు, గోమాత ముత్తయిదువులతో గురుస్తోత్రం పారాయణం చేస్తూ శ్రీకోదండరామాలయం నుండి ఏడు రోడ్ల జంక్షన్ వరకు పల్లకిలో మోస్తూ తిరువీధి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గుమ్మా నగేష్, పతంజలి శాస్ర్తి, సంగమేశ్వరరావు, చలపతి, భాస్కరభట్ల శ్రీరామమూర్తి, జగదాంబ, భారతీ, ఉమారాణి, వి.కామేశ్వరరావు తదితరులు ఉన్నారు.ఈ సందర్భంగా వక్త హరనాథ్‌ను సన్మానించారు.