శ్రీకాకుళం

ఘనంగా ముగిసిన ప్రమాద రహిత వారోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూలై 21 : ఎపిఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా జరుగుతున్న ప్రమాద రహిత వారోత్సవాల కార్యక్రమం గురువారం స్థానిక ఒంగోలు ఆర్టీసీ డిపో ఆవరణలో ఘనంగా ముగిశాయి. ఈ ముగింపు వారోత్సవాల కార్యక్రమంలో ఆర్టీసీ ప్రకాశం జిల్లా రీజియన్ ఆర్‌ఎం ఆదాం సాహెబ్ మాట్లాడుతూ ఆర్టీసీ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసే సమయంలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. వాహనం కండీషన్ సరిగా ఉందా లేదా అనే విషయాన్ని ముందుగా సరిచూసుకోవాలని ఆయన డ్రైవర్లకు సూచించారు. ఆర్టీసీ ప్రయాణం సురక్షితమనే నమ్మకాన్ని ప్రయాణికుల్లో కల్పించినప్పుడే ప్రజలు ఆర్టీసీకి చేరువ అవుతారని చెప్పారు. ఆర్టీసీ బస్సును డ్రైవర్ ఏకగ్రాతతో నడిపినప్పుడే ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు క్షేమంగా చేరుతారని ఆయన తెలిపారు. ఆర్టీసి కార్మికులకు, సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉంటే అవి వెంటనే తీర్చేందుకు చర్యలు తీసుకుంటానని ఆర్‌ఎం హామీ ఇచ్చారు. మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ గోపినాయక్ మాట్లాడుతూ ఆర్టీసీ రవాణా రంగంలోనే ఒక పెద్ద సంస్థ అని, కనుక కార్మికులు బాగా పనిచేసి ఆర్టీసీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎపిఎం శ్రీమన్నారాయణ, రెడ్‌క్రాస్ సంస్థ వైస్ చైర్మన్, ఒంగోలు చెందిన వైస్ చైర్మన్ గుండవరపు రాఘవ, కోశాధికారి పి హరిబాబు, పిటిసి చెందిన అధికారి రామప్రసాద్ తదితరులు పాల్గొని ఆర్టీసీలో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన నిబంధనల గురించి కార్మికులకు వివరించారు.