శ్రీకాకుళం

‘కార్మికులకు కనీస వేతనం చెల్లించాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్చూరు, జూలై 21 : నానాటికీ పెరిగిపోతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు కనీస వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలని పర్చూరు డివిజన్ సిఐటియు ప్రధాన కార్యదర్శి జి ప్రతాప్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో గురువారం కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోటళ్లలో, రెస్టారెంట్లలో, ఆటోమొబైల్ కార్మికులు, ప్రైవేటు సెక్యూరిటీ గార్డులకు, స్పిన్నింగ్ మిల్లులో పనిచేసే కార్మికులకు, పౌల్ట్రీలలో పని చేసే కార్మికులకు, ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు కార్మికులకు కనీస వేతనాలు 18 వేల రూపాయలు ఇవ్వాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని, వీటిని వ్యతిరేకిస్తూ ఆగస్టు 4వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ధర్నాలో అన్ని రంగాల్లో పనిచేసే కార్మికులు పాల్గొని తమ డిమాండ్లను సాధించుకోవాలన్నారు. అలాగే ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు జరిగే గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సమ్మెను సిఐటియు శాఖ పూర్తిగా మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు ప్రభుదాసు, పోతురాజు, డేవిడ్, పి యేసు, బి కోటయ్య, ఎస్‌కె మస్తాన్, పి పేతురు తదితరులు పాల్గొన్నారు.