శ్రీకాకుళం

పుష్కరాల ఏర్పాట్లు పరిశీలించిన కర్నూలుజిల్లా కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దదోర్నాల, జూలై 21: వచ్చేనెల 12వ తేదీ నుంచి జరిగే కృష్ణా పుష్కరాలను పురష్కరించుకొని కర్నూలు జిల్లా కలెక్టర్ చల్లా విజయమోహన్ గురువారం పెద్దదోర్నాలలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ శ్రీశైలం వెళ్ళే భక్తులకు పెద్దదోర్నాలలో ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మల, మూత్రశాలల సౌకర్యం, తాగునీటి వసతి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ స్థలాన్ని పరిశీలించామని తెలిపారు. శ్రీశైలంలో స్నానాలుచేసి మల్లికార్జునస్వామిని దర్శించుకొని తిరిగి వెళ్ళిపోయేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, దేవాలయానికి 5 కిలోమీటర్ల దూరంలో వసతులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మార్కాపురం ఆర్డీఓ చంద్రశేఖరరావుకు సహాయంగా ఒక తహశీల్దార్‌ను నియమిస్తున్నామని తెలిపారు. వీరి వెంట శ్రీశైలం దేవస్థానం జెఇఓ త్రినాథ్‌రెడ్డి, పెద్దదోర్నాల తహశీల్దార్ ప్రసాదరావు, ఆర్‌ఐ ప్రసాద్, విఆర్‌ఓలు నాగేశ్వరరావు, దానియేల్ తదితరులు ఉన్నారు.