శ్రీకాకుళం

రాష్ట్భ్రావృద్ధిలో ఉద్యోగులు భాగస్వాములు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొదిలి, జూలై 21 : రాష్ట్భ్రావృద్ధిలో ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వాములు కావాలని ఎపిఎన్‌జివో అసోసియేషన్ అధ్యక్షుడు పి అశోక్‌బాబు కోరారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన గురువారం పొదిలికి విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్‌జివో హోంలో ఎర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఉద్యోగులకు 43 శాతం పిఆర్‌సి ఇవ్వడం హర్షణీయమన్నారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ విధానాలు బానిసత్వాలకు ప్రతిరూపాలని, అటువంటి విధానాల ప్రభుత్వ పాలనలో ఉండకూడదనేదే తమప్రధాన డిమాండ్‌గా ఆయన తెలిపారు. దశలవారీగా ప్రస్తుతం ఉన్న ఆయా ఉద్యోగుల్ని క్రమబద్ధీకరణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొన్ని ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. అయితే మన రాష్ట్రంలోని ఉద్యోగులకు అలాంటి ప్రధాన సమస్య లేకపోవడం సంతోషదాయకమన్నారు. అందువల్లనే రాష్ట్భ్రావృద్ధికి ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలని, అంతేకాకుండా అవినీతి రహితంగా విధులు నిర్వహిస్తూ ప్రభుత్వానికి మంచిపేరు తేవాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులమని గర్వంగా భావించే విధంగా ఉద్యోగులు సేవలు అందించాలన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉద్యోగులు కీలకపాత్ర వహించడం సామాజిక బాధ్యతగా అశోక్‌బాబు అభివర్ణించారు. అటువంటి ఉద్యమాల వల్ల ఉద్యోగుల పట్ల ప్రజల్లో మరింత గౌరవమర్యాదలు పెరిగాయన్నారు. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వ ఉద్యోగులు తమ ప్రయోజనాలను కూడా లెక్కచేయకపోవడం అభినందనీయమన్నారు. అశోక్‌బాబును ఆర్టీసీ యూనియన్లతోపాటు వివిధ సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు ఎన్ చంద్రశేఖర్‌రెడ్డి, జగదీష్, శివకుమార్, మదన్, శరత్‌కుమార్, నాగేశ్వరరావు, స్వాములు, కృష్ణారెడ్డి, ఎన్ శ్రీనివాసరెడ్డి, మహమ్మద్ రఫీ పాల్గొన్నారు.