శ్రీకాకుళం

ప్రజాసాధికార సర్వేను వేగంగా పూర్తిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూలై 21 : రాష్ట్రంలో ప్రజాసాధికార సర్వేను వేగవంతంగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం విజయవాడ నుంచి ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లతో ప్రజాసాధికార సర్వేపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ప్రజాసాధికార సర్వే చేయడం వల్ల ప్రజలకు పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు అమలు చేయవచ్చని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నాలుగు లక్షల కుటుంబాలను విచారించి 10.50 లక్షల మంది సమాచారం సేకరించి నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజాసాధికార సర్వే పట్ల అధికారులు పూర్తిస్థాయిలో తెలుసుకోవాలన్నారు. ప్రజాసాధికార సర్వే సాఫ్ట్‌వేర్ సమస్యలను పరిష్కరించేందుకు అన్నిరకాల చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సర్వే అమలుపై పూర్తి బాధ్యతలు కలెక్టర్లు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో జరిగే ప్రజాసాధికార కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పూర్తిస్థాయిలో పాల్గొనాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు ఒంగోలు నుంచి రాష్ట్ర రవాణాశాఖమంత్రి శిద్దా రాఘవరావు, జిల్లా కలెక్టర్ సుజాతశర్మ, జిల్లా జాయింట్‌కలెక్టర్ ఎం హరిజవహర్‌లాల్, జిల్లా రెవెన్యూ అధికారి నూర్‌బాషాఖాసీం, జిల్లాపరిషత్ సిఇఓ బాపిరెడ్డి, డిఆర్‌డిఎ పిడి ఎంఎస్ మురళీ, డ్వామా పిడి పోలప్ప, స్టెప్ సిఇఓ బి రవి తదితరులు పాల్గొన్నారు.