శ్రీకాకుళం

క్షేత్రస్థాయిలో పర్యటించి ఉద్యోగుల సమస్యలు తెలుసుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గిద్దలూరు, జూలై 21: రాష్ట్రంలో 13 జిల్లాల్లో 202 తాలూకా యూనిట్లు ఉన్నాయని, క్షేత్రస్థాయిలో ఉద్యోగుల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు పర్యటనలు సాగిస్తున్నామని, ఇప్పటివరకు 70 తాలూకా పర్యటనలు చేసినట్లు రాష్ట్ర ఎన్‌జిఓ సంఘం అధ్యక్షులు అశోక్‌బాబు తెలిపారు. గురువారం స్థానిక రెవెన్యూ కార్యాలయం ఆవరణలో జరిగిన ఎన్‌జిఓ ఉద్యోగుల తాలూకా యూనిట్ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎపి రాష్ట్ర విభజన తరువాత ఉద్యోగులపై సామాజిక బాధ్యత పెరిగిందని, రాష్ట్రంలో శాశ్వత, సిపిఎస్, ఒప్పంద, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులుగా నాలుగు విభాగాలుగా ఉన్నారని, కిందిస్థాయి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎగువన ఉన్నవారుచొరవ చూపి అధిక సంఖ్యలో ఉద్యోగులను సంఘంలో చేర్పిస్తే సంఘాలు బలోపేతం అవుతాయన్నారు. ప్రభుత్వం డిఎ ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు. రిటైర్డు ఉద్యోగుల బెనిఫిట్స్ కాపాడేందుకు ఎన్‌జిఓ సంఘం కృషి చేస్తుందన్నారు. తక్కువ జీతంతో ఉన్నవారి సమస్యల పరిష్కారానికి ఉద్యోగులు కొంతమేర త్యాగాలు చేయాలని, ఉద్యోగులకు హెల్త్‌కార్డులు ఇప్పించే బాధ్యత సంఘం స్వీకరిస్తుందని తెలిపారు. అశోక్‌బాబును స్థానిక ఎన్‌జిఓ సంఘం కార్యాలయం నుంచి ఊరేగింపుగా సభా ప్రాంగణానికి తీసుకువచ్చారు. అపూర్వమైన స్వాగతం లభించినందుకు అశోక్‌బాబు తాలూకా యూనిట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈసమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు బి శ్రీనివాసరావు, కార్యదర్శి శరత్‌బాబు, గిద్దలూరు అధ్యక్ష, కార్యదర్శులు నరేష్, ఖుద్దూస్, విఆర్‌ఓల సంఘం జిల్లాఅధ్యక్షులు వైపి రంగయ్య, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కేశవరావు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేశ్వరరెడ్డి, జిల్లాకార్యదర్శి శివకుమార్, ఒంగోలు అధ్యక్ష, కార్యదర్శులు నాసర్, మస్తాన్, మంజు పాల్గొన్నారు.