శ్రీకాకుళం

డిగ్రీ రెండో సెమిస్టర్ ఫలితాలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, ఆగస్టు 4: జిల్లాలోని అంబేద్కర్ విశ్వవిద్యాలయం అనుబంద డిగ్రీ కళాశాలకు సంబంధించిన ప్రథమ సంవత్సరం రెండో సెమిస్టరీ ఫలితాలను వీసి ఛాంబర్‌లో గురువారం విడుదల చేశారు. 27.18 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు అధికారులు వెల్లడించారు. 12,456మంది హాజరు కాగా 3,386మంది పాసై 22.91శాతం ఫలితాలు సాధించగా వర్శిటీ అధికారులు 1.1శాతం గ్రాస్ మార్కులు కలపడంతో ప్రస్తుతం 27.18శాతానికి పెరిగిందన్నారు. రీ వాల్యూషన్‌కు ఒక సబ్జెక్ట్‌కు రూ.500 రుసుం చెల్లించాలని జవాబు పత్రాలు చూపించేందుకు ప్రతీ సబ్జెక్టుకు రూ.800 చెల్లించాల్సి ఉంటుందన్నారు. 15 రోజులలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ ఫలితాల సాధనలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాలకొండ 54.38, టెక్కలి 47.39, శ్రీకాకుళం మహిళా కళాశాల 38.01, పురుషుల డిగ్రీ కళాశాల 33.11 శాతం ఉత్తీర్ణత సాధించాయి. బిఏకు 1781మంది అభ్యర్థులు హాజరుకాగా343మంది ఉత్తీర్ణులయ్యారు. బిఎస్సీకు 7993మంది హాజరు కాగా 2443మంది పాస్ అవ్వగా, బికామ్ జనరల్‌కు 1490మంది హాజరు కాగా 312మంది ఉత్తీర్ణులయ్యారు. బికామ్ ఒకేషనల్‌కు 1075మందికి 220మంది, బిబిఎకు 117మందికి 68మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ వివరాలను ఇంచార్జ్ వీసి ఎం.చంద్రయ్య, రిజిస్ట్రార్ జి.తులసీరావు, ప్రిన్సిపల్ పి.చిరంజీవులు, డీన్ ఆఫ్ ఎగ్జామినేషన్ కామరాజు, ప్రొఫెసర్ అడ్డయ్య, పాలక మండలి సభ్యులు కెవిఎ నాయుడు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్స్ జ్యోతీ ఫెడరిక్, బి.పోలీస్, పులఖంఢం శ్రీనివాసరావులు ఉన్నారు.