శ్రీకాకుళం

పారిశ్రామికాభివృద్ధికి సాంకేతిక శిక్షణ దోహదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, ఆగస్టు 4: పారిశ్రామికాభివృద్ధికి సాంకేతిక శిక్షణ మరింత దోహదపడుతుందని కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం స్పష్టంచేశారు. ఏఏ వలస పరిధిలో ఉన్న నాగార్జున ఆగ్రికమ్ పరిశ్రమ ఆవరణలో జ్ఞాన వికాస భవన్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ వికాస్ భవన్ కేంద్రంగా స్థానికంగా పనిచేస్తున్న సిబ్బందితోపాటు పరిసర గ్రామాలకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులకు కూడా సాంకేతిక శిక్షణను అందిపుచ్చుకోవచ్చునన్నారు. ఇక్కడ సిబ్బంది విధులు సక్రమంగా నిర్వర్తిస్తే పరిశ్రమ అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. నాగార్జున గ్రూఫ్ ఆఫ్ కంపెనీ వ్యవస్థాపకుడు దివంగత కెవికె రాజు ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. నైపుణ్యాభివృద్ధి పెంపొందించుకోవాలన్నారు. వాహన కాలుష్యం, ప్లాస్టిక్ వినియోగం ఓ సమస్యగా మారిందని దీనిని నివారించేందుకు ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. జిల్లాలో కోటి మొక్కలు నాటడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఇందుకు సహకరించాలన్నారు. వైస్ ప్రెసిడెంట్ సివి రాజులు, డిజిఎంలు కోటేశ్వరరావు, రామ్‌గోపాల్, ఏజిఎంలు వర్మ, మురళీకృష్ణ ఉన్నారు.