శ్రీకాకుళం

కాశీబుగ్గ హాస్టళ్ళలో ఎసిబి తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, ఆగస్టు 4: కాశీబుగ్గలోని పోస్టుమెట్రిక్ హాస్టల్, బాలల వసతి సంక్షేమ గృహంలో గురువారం ఎసిబి అధికారులు తనిఖీలు నిర్వహించారు. అందిన ఫిర్యాదు మేరకు ఎసిబి అధికారులు కాశీబుగ్గలోని హాస్టల్‌కు సంబంధించి వార్డెన్ గురువులు ఇంటి వద్దకు వేకువజామున అయిదు గంటలకు చేరుకొని ఆయనతో హాస్టల్ వద్దకు చేరుకొని తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో హాస్టల్‌లో నివసిస్తున్న విద్యార్థుల సంఖ్యతోపాటు బియ్యం, ఇతర సామగ్రిని పరిశీలించారు. అనంతరం విద్యార్థులు నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఎసిబి డిఎస్పీ కె.రంగరాజు తెలిపిన వివరాలు మేరకు పోస్టుమెట్రిక్ హాస్టల్‌తోపాటు బాలల వసతి సంక్షేమ గృహంతోపాటు ఎర్రముక్కాం హాస్టల్‌ను గురువులు వార్డెన్‌గా వ్యవహరిస్తున్నారు. మూడు హాస్టల్స్‌కు సంబంధించి రికార్డులను, ఇతర విషయాలను తనిఖీలు చేయగా, పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయన్నారు. ప్రధానంగా రికార్డుల్లో పొందుపరిచిన విద్యార్థుల సంఖ్య, హాస్టల్‌లో వున్న విద్యార్థుల సంఖ్యకు వ్యత్యాసం ఉందని, హాస్టల్‌లో వౌలిక వసతులు లేకపోవడం, మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆహారపదార్థాలు సైతం నాసిరకంగా ఉన్నాయని విద్యార్థులు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. హాస్టల్‌కు సంబంధించి అన్ని రికార్డులు తనిఖీలు జరిపి పూర్తి సమాచారాన్ని సంబంధిత అధికారులకు పంపిన తర్వాత చర్యలు ఉంటాయన్నారు. ఈ దాడుల్లో ఎసిబి సిఐ శ్రీనివాసరావుతోపాటు రామారావు, ఆనందరావు, విశ్వనాథం, చిన్నంనాయుడు తదితరులున్నారు.