శ్రీకాకుళం

మంత్రి ఆఫీసు ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), ఆగస్టు 4: జిల్లాలో కార్మిక హక్కులను కాలరాస్తూ పరిశ్రమ యాజమాన్యాలు తమ ఇష్టాను సారం వ్యవహరిస్తున్నాయని, అయినప్పటికీ కార్మిక శాఖ మంత్రి పట్టించుకోపోవడం అన్యాయమంటూ సిఐటియు నేతృత్వంలో కార్మికులు గురువారం కదం తొక్కారు. ఉదయం వందలాది మంది కార్మికులు సిటు ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద సమావేశమై అక్కడ నుండి ర్యాలీగా బయలుదేరి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించే యత్నం చేసారు. ఓ పక్క వర్షం పడుతున్నా లెక్కచేయని కార్మికులు తమ హక్కులను కాపాడాలంటూ నినాదాలు చేస్తూ చేపట్టిన మంత్రి ఇంటిముట్టడి యత్నాన్ని భారీగా మోహరించిన టూటౌన్ పోలీసులు భగ్నం చేశారు. ఈ నేపథ్యంలో కార్మికులకు, పోలీసులకు మద్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అనంతరం 83 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేసి టూటౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం స్టేషన్ వద్ద సిటు నేత డి.గోవిందరావు విలేఖర్లతో మాట్లాడుతూ కార్మిక వేతన సవరణ చేసి ఐదేళ్లు గడిచినా పట్టించుకున్న నాధుడులేడని అన్నారు. కార్మికుల శ్రమదోపిడీ నిరాటంకంగా కార్మికశాఖ మంత్రి ఇలాకాలోనే సాగుతున్నా మంత్రి చోద్యం చూస్తున్నారని విమర్శించారు. కార్మికుల సంక్షేమం కోసం పాటుపడుతున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఎక్కడ పడితే అక్కడ హక్కులపై ప్రశ్నిస్తున్న కార్మికులను అణచివేస్తుందని మండిపడ్డారు. కార్యక్రమంలో సిటు నేతలు కె.శ్రీనివాస్, ఎం.తిరుపతిరావు, ఎం.ఆదినారాయణ, ఎన్.హిహప్రభ, డి.గణేష్, వై.చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.