శ్రీకాకుళం

మైనస్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: 150 ఏళ్ళ చరిత్ర కలిగిన శ్రీకాకుళం మున్సిపాలిటీ రాష్ట్ర విభజన అనంతరం కార్పొరేషన్‌గా మారింది. పన్నుల భారాలు తప్ప పేదోళ్ళకు కావల్సిన వౌలిక సదుపాయాల కల్పనలో రెండేళ్ళ టిడిపి పాలనపై నగరవాసులు అసంతృప్తిగానే ఉన్నారు. నగర పాలక సంస్థకు డిసెంబరులోగా ఎన్నికలు నిర్వహిస్తే ప్రతికూల ఫలితాలు వెలువడతాయన్న సర్వే ఫలితాలతో టిడిపికి మైనస్ మార్కులే వచ్చినట్టు తెలుస్తోంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు చెప్పుకోతగ్గ కార్యక్రమాలు నగరంలో చేపట్టలేకపోయారన్న అసంతృప్తిని టిడిపి అధిష్ఠానానికి సిక్కోల్ మిగిల్చినట్టు సర్వే సుస్పష్టం చేసినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి విశ్వసనీయ సమాచారం.
ప్రజలను ప్రభావితం చేసే ప్రధాన సమస్యలను రాబోయే రెండుమూడు నెలల్లో పరిష్కరించేందుకు ప్రయత్నించినా ఈ సారి కార్పొరేషన్ ఎన్నికలను విజయంవైపు అడుగులు వేయించలేవన్న సర్వేలు ముఖ్యమంత్రి వద్దకు చేరినట్టు సమాచారం. 2010, సెప్టెంబరు 31తో అప్పటి మున్సిపాలిటీ పాలకవర్గ పదవీకాలం ముగిసింది. దాదాపు ఆరేళ్ళుపాటు పాలవర్గమే లేని పరిస్థితి. రెండేళ్ళ కిందట జరిగిన సార్వత్రిక ఎన్నికల అనంతరం మున్సి‘పోల్స్’పై టిడిపి సర్కార్ ఇతర ప్రాధాన్య కార్యక్రమాల దృష్యా అడుగులు వేయలేకపోయింది. ప్రకృతి కరాళానృత్యం, విభజన సంకట పరిస్థితులు, సరికొత్త రాజధాని నిర్మాణంలో నిమగ్నం కావడం, హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలివచ్చి అలసటగా పరుగులు తీస్తున్న ముఖ్యమంత్రి, ఆయన క్యాబినేట్ ఇప్పుడిప్పుడే డిసెంబరులో మున్సి‘పోల్స్’పై దృష్టిసారించారు. ఇప్పటివరకూ సి.ఎం. రహస్యంగా రెండుసార్లు సర్వే నిర్వహించగా, తాజా మూడోసారి శ్రీకాకుళం కార్పొరేషన్‌లో ఎన్నికల నాడీ గమనించేందుకు సర్వే ముగిసింది. సిక్కోల్ కార్పొరేషన్ ఎన్నికలకు వద్దంటూ సుస్పష్టం చేయడంతో మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర పార్టీ పెద్దలతో ఎన్నికలకు నో అంటూ - సర్వే చెప్పిందన్న మాట ముఖ్యమంత్రి నోట రావడంతో జిల్లా పార్టీ నాయకులు తర్జనభర్జనలో పడినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. చాలాసార్లు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావించినా వివిధ కారణాలతో సాధ్యం కాలేదు. గత రెండు నెలలుగా ప్రైవేటు సంస్థతో టిడిపి అధినాయకత్వం సర్వే చేయించింది. ఇందులో ఫలితం ప్రభుత్వం పనితీరు అనుకూలంగా లేదంటూ వచ్చింది.
గత రెండేళ్ళ కాలంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేకించి పేద, మధ్య తరగతి కుటుంబాలు సంతృప్తితో ఉన్నాయని ఆ సర్వే వెల్లడించినప్పటికీ, నగర ఓటర్లలో అధికశాతం మంచినీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ కాంతులు సక్రమంగా పనిచేయలేదంటూ ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టనట్టు వ్యవహారించే నెగిటివ్ వార్డు ప్రజల్లో పూర్తిగా నాటుకుపోయింది. కౌన్సిలర్‌కు అడిగినట్టు కలెక్టర్‌ను వీధి సమస్యలు వెళ్ళి చెప్పే అవకాశం లేదని, అధికార పార్టీ సభ్యులు వార్డుల్లో బాధ్యతగా ప్రజాసమస్యలపై స్పందించడం లేదంటూ నగర ఓటర్లు సర్వేలో సుస్పష్టం చేసినట్టు ఉంది. గత సార్వత్రిక ఎన్నికలలో కొన్ని దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం టిడిపి నేతలు స్పష్టమైన హామీలిచ్చారు. అధికారంలోకి రాగానే వాటిని పరిష్కరిస్తామని అన్నారు. ఎక్కువ హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోవకపోవడంతో కొన్ని వార్డుల్లో ప్రజలు అసంతృప్తితో ఉన్నట్టు సర్వేలో గుర్తించారు. ఈ నేపథ్యంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రింగ్‌రోడ్డు కథలు కాలంతోపాటు నడుస్తున్నాయని, ముఖ్యంగా ఇండోర్ సబ్‌స్టేషన్, సాంకేతికపరమైన కారణాలతో న్యాయస్థానంలోనే టిడిపి సవాల్ నిలిచిపోయినా ఎసి ఆడిటోరియం నిర్మాణానికి నడుం బిగించని నేతలు, అరసవల్లి దేవస్థానం రోడ్డు విస్తరణ, అభివృద్ధితోపాటు, జి.టి.రోడ్డు, చిన్నబజారు రోడ్డుల విస్తరణ, అభివృద్ధి వంటివి మూడు నెలల్లో అమలు చేయగలిగితే మున్సి‘పోల్స్’కు నగరంలో ప్రజలు అనుకూలంగా మారే పరిస్థితులు ఉంటాయంటూ సర్వే చెప్పింది.
నగరపాలక సంస్థ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలోనూ టిడిపి అధిష్ఠానం సర్వేలను ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది. వార్డుల వారీగా ఆశావాహుల జాబితాలను సేకరించి ఇప్పటికే ఒక విడత సర్వేను పూర్తి చేశారు. పార్టీ తరుఫున ఎవర్ని బరిలో దింపితే విజయం చేకూరుతోందన్న ప్రాధాన్యతా క్రమంలో సర్వే బృందాలు జాబితాలు తయారు చేసి అధిష్ఠానానికి అందచేసిన విషయం తెలిసిందే. అప్పట్లో నగరంలో గల 36 వార్డుల్లో రెండు, మూడు వార్డులు తప్ప మిగిలిన వార్డులన్నింటీలో అభ్యర్థులు వెనుకంజలో ఉన్నవారేనన్న సర్వేలు సి.ఎం. దృష్టికి తీసుకువెళ్ళడంతో, మరో సర్వే నిర్వహించారు. తుది సర్వేగా ఇప్పుడు నిర్వహించిన అభ్యర్ధుల జాబితా సర్వేలో కూడా స్థానిక ఎమ్మెల్యే సిఫార్సులకు ప్రాధాన్యమిస్తునే సర్వే నివేదికలను కూడా ప్రామాణికంగా పరిగణించే అవకాశం ఉంది. మేయర్, కార్పొరేటర్ అభ్యర్థులకు వేర్వేరుగా ఈ సర్వే నిర్వహించారు. నగరంలో ఎన్నికల వేడి మొదలైన కారణంగా మరోసారి సర్వే చేయించాలని అధినాయకత్వం భావిస్తోంది. ఆగస్టులోనే ఇది ప్రారంభించి ముగిస్తారని సి.ఎం.క్యాంపు కార్యాలయంలో ఒక అధికారి తెలిపారు. వార్డుల్లో కార్పొరేట్ అభ్యర్థులుగా ఎవరైతే బాగుంటుంది, మేయర్ అభ్యర్థిగా ఎవర్ని సమర్థిస్తారంటూ... ఇప్పటికే సిద్ధం చేసుకున్న ఆశావాహుల జాబితాల ఆధారంగా ప్రజల అభిప్రాయం తెలుసుకోనున్నారు. ఈ నెలాఖరులోగా సర్వే జాబితాలు ప్రభుత్వ పెద్దలకు చేరనున్నాయి.