శ్రీకాకుళం

శ్రావణ మాస పూజలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(కల్చరల్), ఆగస్టు 4: ఇస్తినమ్మ వాయినం... పుచ్చుకుంటినమ్మ వాయినాం శ్రావణ మాసంలో ఈ మాటలు ప్రతీ ఇంటా మహిళల నోట వింటుంటాం. ఇది మహిళల మాసం.. పూజలు, వాయినాలతో ప్రతీ ఇళ్లు ఈ నెలంతా ఆధ్యాత్మిక శోభలో కళకళలాడుతుంటుంది. శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతాల నిర్వహణకు మహిళలు ఇచ్చే ప్రాధాన్యం మాటల్లో చెప్పలేనిది. ఎంతో నిష్ట నియమాలతో ఈ పూజలు మహిళలకు పండగ వాతావరణమే. అతివలు తమ కుటుంబాలు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ శ్రావణ మాస వ్రతాలు ఆచరిస్తారు. జిల్లాలో ప్రముఖ ఆలయాల సైతం శ్రావణ మాస శోభ సంతరించుకుంది. సిరి సంపదలకు, సౌభాగ్యాలకు, సుఖసంతోషాలకు ఆదిదేవత లక్ష్మీదేవి అష్టలక్ష్మీ రూపంలో కొలువుతీరిన లక్ష్మీదేవిని పూజించడం ద్వారా సకల శుభాలను సొంతం చేసుకోవచ్చునని భక్తులవిశ్వాసం. అయితే, లక్ష్మీపూజలో వరలక్ష్మీవ్రతం ఎంతో విశిష్టమైనది. నిత్యం సుమంగళిగా ఉండాలనే ఆశతో మహిళలు ఎక్కువగా ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతానికి అనుకూలమైన మాసం శ్రావణ మాసం. చంద్రమాన ప్రకారం తెలుగు సంవత్సరాదిలో ఐదో మాసం శ్రావణమాసం. విష్ణుమూర్తి జన్మనక్షత్రమైన శ్రావణం పేరిట ఏర్పడిన మాసమే శ్రావణమాసం. ఈనెల వచ్చే రెండవ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తారు.
కొనుగోళ్ళ సందడి
శ్రావణ మాసంలో దుస్తులు, బంగారం మహిళలు కొనుగోలు చేస్తారు. ఇదే సమయంలో ఆడవారికి ఇష్టమైన పువ్వులు, గాజులు ఎరువు వస్త్రాలతో అమ్మవార్లకు పూజలు చేస్తుంటారు. అయితే, ఈ పువ్వులు, అరటిపండ్లు, కొబ్బరికాయల ధరలు ఆకాశాన్ని అంటాయని చెప్పొచ్చు. అరిటిపండ్లు డజన్ రూ.60నుండి రూ.70వరకు పలుకుతుండగా, కొబ్బరి కాయ రూ.30నుండి రూ.40వరకు పలుకుతోంది. అదే విధంగా బంతిపూలు, చామంతి పూలు ధరలు కూడా విపరీతంగా పెరిగి సామాన్యులు కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అయినప్పటికీ మహిళలు వాటిని కొనుగోలు చేసి వారికి తోచినంతవరకు పూజలు నిర్వహించడానికి సన్నద్ధమయ్యారు. ఇదిలా ఉండగా పాత శ్రీకాకుళం వద్ద సంతోషిమాత ఆలయం, విజయదుర్గగణపతి ఆలయం తదితర ఆలయాల్లో బుధవారం నుండే శ్రావణ మాస పూజలు ఘనంగా నిర్వహించారు.