శ్రీకాకుళం

పదిరోజుల్లో సైఫన్ బేరల్ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరఘట్టం, ఆగస్టు 29: సైఫన్ బేరల్ పనులు పది రోజుల్లో పూర్తి చేసి సాగునీరు అందిస్తామని బొబ్బిలి జలవనరులశాఖ ఎస్‌ఇ ఎం.వి. ఎస్.మూర్తి తెలిపారు. సోమవారం సైఫన్ వద్ద తనను కలిసిన విలేఖర్లతో మాట్లాడారు. వాతావరణం అనుకూలంగా లేనందువల్ల పనులకు ఆటంకం ఏర్పడుతుందన్నారు. ప్రస్తుతం ఒట్టిగెడ్డ నీరు తగ్గడం వల్ల నీటికి అడ్డంగా బస్తాలు వేసి నీరు మళ్లించామన్నారు. బేరల్‌కు ఎడమ వైపు గోడను ఆనించి కాంక్రీట్ గోడల పనులు ప్రారంభించినట్టు తెలిపారు. కింది భాగం నుంచి ఐరెన్ రాడ్లు అమర్చి బేరల్ పై భాగం నుంచి కాంక్రీట్ శ్లాబు రెండువైపులా వేయనున్నట్టు తెలిపారు. ఇనుప చువ్వలు బెండ్ చేసి అనంతరం కాంక్రీట్ వేయనున్నట్టు తెలిపారు.
ఈ మేరకు మెటీరియల్‌ను కూడా గుత్తేదారు సిద్ధం చేసి ఉంచారు. వాతావరణం అనుకూలిస్తే యుద్ధప్రాతిపదికన పనులు చేసి పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. పంట పొలాలకు నీటి సరఫరా లేని చోట్ల వీలైనంతగా మోటార్లు ద్వారా నీరు సరఫరాకు ఆదేశించామన్నారు.
దిగువ ప్రాంత భూములకు నీరందించడమే లక్ష్యంగా అందరూ శ్రమిస్తున్నట్టు తెలిపారు. ఇక్కడ పరిస్థితిపై ఎప్పటికప్పుడు కలెక్టర్‌కు నివేదిస్తున్నట్టు తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బేరల్ ప్రాంతాన్ని పరిశీలించేందుకు జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్ తదితరులు రెండు మూడు రోజుల్లో రానున్నట్టు తెలిపారు.
శ్రీకాకుళం ఇఇ రవీంద్ర, పాలకొండ డిఇ గనిరాజు, ఎఇలు ఉదయ్‌భాస్కర్, దాలయ్య, రమణలతో పాటు పెద్దబుడ్డిడి ఎంపిటిసి చీమల బాబూ భువన మోహన్‌రావు, నీటి సంఘం అధ్యక్షులు రౌతు శశిభూషణరావు, గుత్తేదారు సిబ్బంది ఉన్నారు.

వెంకటేశ్వరుని రూపంలో గణేశుడు
జలుమూరు, ఆగస్టు 29: కుమ్మరకులంలో జన్మించి ఆ వృత్తికి దూరమైన ఎన్నో కుటుంబీకులకు నేడు ఆదర్శంగా నిలిచాడు నగిరికటకం గ్రామానికి చెందిన రవికుమార్. శతాబ్దాల కిందట ఎంతో పేరుప్రఖ్యాతలు కలిగిన ఈ గ్రామ కుమ్మర్లు మట్టి విగ్రహాల తయారీకి స్వస్తి చెప్పారు. ఎంతో ఘనకీర్తిని సంపాదించకపోయిన మట్టిబొమ్మలు తయారీచేసి పలువురిని ఆకట్టుకునే దృక్పథంతో ఐటిఐ చదువుకున్న రవికుమార్ వినూత్నరీతిలో వెంకటేశ్వరస్వామి రూపంలో వినాయకుని మట్టితో తయారు చేశారు. 12 రోజులుగా తయారు చేయగా ఈ ఆకారం వచ్చిందని తెలిపారు. అదే విధంగా మండలం సురవరం గ్రామంలో ఇంజినీరింగ్ చదువుకుంటున్న ఈ యువకుడు విగ్రహాలను కూడా తయారు చేస్తున్నాడు.
శ్రీముఖలింగంలో ఘటాభిషేకం
రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ప్రముఖ పుణ్యక్షేత్రం మండలంశ్రీముఖలింగంలో మధుకేశ్వరస్వామికి సోమవారం ఘటాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు జరిగాయి. ముందుగా వినాయక పూజ, పుణ్యాహవచనంతో పూజలు ప్రారంభమయ్యాయి. మండపాలు, శతఅనువాహిక, వరుణ అనువాహిక యాగాలు జరిగాయి. పవిత్ర వంశధార నదిలో నీటిని తెచ్చి స్వామి ముఖ మండపంలో పూజలు చేసి ఘటాభిషేకం నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఈవో సూర్యనారాయణ, ట్రస్ట్‌బోర్డుచైర్మన్ బైరి బలరాం, సర్పంచ్ ప్రతినిధి తర్రబలరాం సిబ్బందిపాల్గొన్నారు.
ఎస్పీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన వినతులు
శ్రీకాకుళం(టౌన్), ఆగస్టు 29: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగానికి వినతులు వెల్లువెత్తాయి. మొత్తం 21 ఫిర్యాదులు రాగా ఆయా ఫిర్యాదులను సంబంధిత పోలీసు స్టేషన్‌లకు బదలాయిస్తూ దర్యాప్తు వివరాలను స్టేషన్ హౌస్ అధికారులకు ఎస్పీ సూచించారు. కాగా కుటుంబ కలహాలకు సంబంధించి రెండు, సివిల్ తగాదాలకు సంబంధించి ఆరు, పాత కేసుల పరిష్కారం కోరుతూ మూడు, ఇతర కారణాలతో పది ఫిర్యాదులు అందాయి. అలాగే అదే ఆవరణలో ఓయస్‌డి కె.తిరుమల రావు ఆధ్వర్యంలో నిర్వహించే కుటుంబ సలహా కేంద్రానికి పది కేసులు వచ్చాయి. ఆయా కేసులకు సంబంధించి ఇరు వర్గాలతో ఆయన మాట్లాడి నాలుగు కేసులను పరిష్కరించారు. కార్యక్రమంలో డిఎస్పీలు కె.్భర్గవరావు నాయుడు, వి.సుబ్రహ్మణ్యం, ఎస్బీ సిఐ వై.గోపీనాధ్, లీగల్ అడ్వైజర్ కె.ఆఫీసునాయుడు, డిఎస్.వి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఒప్పంద అధ్యాపకుల దీక్షలు
ఎచ్చెర్ల, ఆగస్టు 29: రాష్ట్ర ప్రభుత్వం యూజిసి నిబంధనలను, వర్శిటీ చట్టాలను ఉల్లంఘించి స్క్రీనింగ్ టెస్ట్‌నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవడాన్ని ఒప్పంద అధ్యాపకులు నిరసిస్తూ దీక్షలకు దిగారు. కొన్ని రోజులుగా ఆందోళన కార్యక్రమాలు జెఏసి పిలుపుమేరకు చేపట్టిన వీరంతా సోమవారం అంబేద్కర్ వర్శిటీ ప్రధానగేటు వద్ద శిబిరాన్ని ఏర్పాటు చేసి నిరసన దీక్షలు కొనసాగిస్తున్నారు. ఒప్పంద అధ్యాపకులను రెగ్యూలర్ చేయాలని స్క్రీనింగ్ టెస్ట్ ఉపసంహరించుకోవాలని నినాదాలు చేస్తున్నారు. అర్హులైనవారందరినీ క్రమబద్ధీకరించాలని అందరికీ న్యాయం చేయాలని మంత్రి అచ్చెన్నాయుడుకు వినతిపత్రం అందించినట్టు ఒప్పంద అద్యాపకులు పేర్కొన్నారు. దీక్షల్లో పాల్గొన్న వారు సుబ్రహ్మణ్యం, రమణమూర్తి, కరుణానిధి, గోవిందరాజులు, కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు.

‘కరవు ప్రాంతాలు గుర్తించండి
కోటబొమ్మాళి, ఆగస్టు 29: తీవ్ర వర్షాభావ పరిస్థితులు వల్ల జిల్లాలో ఈ ఖరీఫ్ కాలంలో పలు ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నట్టు రైతులు ఆందోళనకు గురవుతున్నారని, ఆయా ప్రాంతాలను గుర్తించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కార్మిక, ఉపాధిశాఖామంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయం నిమ్మాడలో సోమవారం వ్యవసాయశాఖ జెడిఎలు జి.రామారావు, అప్పలస్వామిలతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో సాగునీరు అందడం లేదని, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు. దీనిపై ఆ శాఖాధికారులు సమాధానం ఇస్తూ జిల్లాలో 12 వేల హెక్టార్లలో పంటలు ఎండినట్టు గుర్తించినప్పటికీ ఇటీవల కురిసిన వర్షాలు వలన పాలకొండ, హిరమండలం, సీతంపేట మండలాల్లో పంటలు తేరుకున్నాయన్నారు. ఈ ఏడాది 125 మంది రైతులకు ఆయిల్ ఇంజన్లు పంపిణీ చేశామని, కొత్తగా 30 రెయిన్ గన్‌లు రైతులకు పంపిణీ చేసినట్టు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలు వల్ల 9 వేల హెక్టార్లుకు సాగునీటి సమస్య తీరిందని అధికారులు తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా సాధ్యమైన సహకారం అందించాలని మంత్రి సూచించారు.

క్షమించేది లేదు..
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, ఆగస్టు 29: సుపారీ తీసుకుంటూ భూదందాలతో ప్రజలను భయబ్రాంతులు చేస్తున్న రౌడీలు ప్రవర్తనలో మార్పురాకపోతే క్షమించేది లేదంటూ జిల్లా ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి హెచ్చరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కృష్ణాపుష్కరాలకు విధులకై జిల్లా పోలీసు యంత్రాంగంలో చాలామంది విజయవాడ వెళ్లే సమయంలో రౌడీషీటర్లుగా గతంలో ఉన్న వారితోపాటు, కొత్తవాళ్ళు కూడా పెచ్చుమీరి దందాలు చేసినట్టు ఎస్పీ గుర్తించారు. నడిరోడ్డులపై ప్రాణాలకు తెగించి కత్తులతో కోట్లాటలకు దిగే ఫ్యాక్సనిస్టు జిల్లాలుగా మార్చేస్తున్న వీరిపై ఉపేక్షించకూడదంటూ నడుంబిగించారు. తలచినదే తడవుగా ఆదివారం రాత్రి ఎస్పీ ఆదేశాల మేరకు రౌడీషీటర్లును క్యాంపు కార్యాలయంలో పోలీసులు క్లాసులు తీసుకున్నారు. ఇప్పటివరకూ జరిగిన భూ దందాలు, పంచాయితీలు, ఇళ్లు ఖాళీ చేయించి సుపారీలు తీసుకోవడం వంటి వ్యవహారాలను వెంటనే ఆపకుంటే క్షమించేది లేదంటూ ఎస్పీ హెచ్చరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇటీవల నగరంలో రౌడీషీటర్ల మధ్య జరిగిన కోట్లాటతో అటువంటివారిని ఉపేక్షించరాదంటూ ఎస్పీ తీసుకున్న నిర్ణయంతో ఆదివారం రాత్రికిరాత్రి రౌడీషీటర్లుగా ముద్రపడిన ఇద్దరిని, సరికొత్తగా దందాలు నిర్వహిస్తున్నట్టు పోలీసు నిఘాలో చేరిన మరికొంతమంది కుర్రోళ్ళను ఎస్పీ క్యాంపుకార్యాలయంలో రాత్రిఅంతా నీతులు బోధించారు. వీరికి ముందుగా ఎస్పీ బ్రహ్మారెడ్డి క్లాసు తీసుకోగా, అనంతరం డిఎస్పీలు భార్గవరావునాయుడు, టేకి మోహనరావు, వివేకవర్ధన్‌లతోపాటు, టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది ఎవరికినచ్చిన విధంగా వారు రౌడీయిజం అంటూ ఎక్కడ దందాలు చేసినా, కోట్లాటలకు దిగినా ఉపేక్షించమంటూ వారివారి స్టైల్‌లో బుద్ధిచెప్పినట్టు సమాచారం.
281 మందిపై రౌడీషీటర్లు
జిల్లాలో 281 మందిపై ఎస్పీ రౌడీషీట్లు నమోదు చేశారు. నేరాలు, ఘోరాలకు కేరాఫ్ అడ్రస్సుగా జిల్లాలో ఎప్పుడూ ఉండే పలాస-కాశీబుగ్గ సబ్ డివిజనల్ పోలీసు పరిధి నుంచే 120 మంది వరకూ రౌడీషీటర్లుగా నమోదు అయ్యారు. శ్రీకాకుళంలో 119 మంది రౌడీషీటర్లు నమోదుకాగా, ఇటీవల జిటి రోడ్డులో రౌడీమూకల మధ్య జరిగిన ఘర్షణ వల్ల ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. రౌడీల వల్ల సామాన్యప్రజలకు ఎటువంటి నష్టం జరగదన్న సంకేతాన్ని ఇచ్చేలా మరో ముగ్గురుపై రౌడీషీట్లు నమోదు చేయాలంటూ ఎస్పీ ఇచ్చిన ఆదేశాల మేరకు వారు పేరు నమోదు చేశారు. ఇలా జిల్లా అంతటా రౌడీయిజంపై ఎస్పీ ఉక్కుపాదం మోపడం, ఆదివారం సాయంత్రం పెద్దపాడు గ్రామంలో నాకాబందీ నిర్వహించి ప్రతీ ఇంటిముందుకు పోలీసు అధికారి వెళ్ళి ఇంట్లో రౌడీలను తయారు చేసే వాతావరణం కన్పిస్తే ఉపేక్షించమంటూ హెచ్చరికలు జారీ చేయడంతోపాటు, పోలీసు కవాతు నిర్వహించారు. అనంతరం జిల్లా కేంద్రంలో గల రౌడీషీటర్లను రాత్రికిరాత్రి ఎస్పీ క్యాంపుకార్యాలయానికి తీసుకువెళ్ళారు. రౌడీషీటును ఎత్తివేసిన ఓ వ్యక్తిపై నిఘా వర్గాలు ఎక్కువగా దృష్టిసారించి సుపారీ తీసుకుంటూ దందాలు చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఆయన ప్రవర్తనలో మార్పురాకుంటే చర్య తప్పదని హెచ్చరించారు. ఇందుకు ఒక సంఘటను కూడా అక్కడ ఆ వ్యక్తికి పోలీసులు వినిపించినట్టు తెలిసింది. నీలమ్మగుడి వద్ద 12 సెంట్లు భూతగాదకు సుపారీ తీసుకుని మండలవీధికి చెందిన కొంతమంది కుర్రోళ్ళకు పంపడం, హక్కుదారులైన ఆ భూమి యజమానులను భయపెట్టి వారిని అక్కడ నుంచి ఖాళీ చేయమంటూ హెచ్చరించడం వంటి సంఘటనలు పూర్తిగా విడమరిచి, సాక్ష్యాధారాలతో సహా షీటుఎత్తేసిన రౌడీకి వివరించినట్టు తెలిసింది. అలాగే, కొన్ని సంఘటనలు, దందాల్లో ఇంకా పాతవాసనలు ఉన్నాయంటూ మరో వ్యక్తిని కూడా పోలీసులు హెచ్చరించినట్టు సమాచారం.
ఇంతలో మాజీ మున్సిపల్ చైర్మన్ సోదరుడు అంధవరపు గోవిందరావుతోపాటు బొడ్డేపల్లి రాజును తీసుకురావడంతో పోలీసులు, రాజుల మధ్య కొద్దిసేపు జరిగిన వివాదంతో గోవిందరావుచే తన స్థలవివాదంపై ఫిర్యాదు తీసుకుని రాజుపై కేసు నమోదు చేసినట్టు తెలిసింది. అలాగే, రెడ్డిగారి ఇల్లు అంటూ నగరంలో హోటల్‌వ్యాపారం చేస్తున్న ఓ వ్యక్తిపై కూడా పోలీసులు నిఘా పెట్టారు. ఇలా.. రౌడీమూకలపై ఎస్పీ ఎపిసోడ్-1 ఆదివారం రాత్రి ఆరంభించి వారికి క్లాసులు తీసుకుని ప్రరివర్తన చెంది, ప్రవర్తనలో మార్పులు చేసుకుంటే క్షమిస్తామంటూ పోలీసులు మాటగా చెప్పి పంపేశారు.

మాత్రలు సిద్ధం

శ్రీకాకుళం(టౌన్), ఆగస్టు 29: జిల్లాలో ఈనెల 30వ తేదీన డి వార్మింగ్ డేను పాటించనున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సనపల తిరుపతిరావు తెలిపారు. సోమవారం ఈ మేరకు స్థానిక డిఎంహెచ్‌వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాల ఆరోగ్య పథకంలో భాగంగా ప్రతి ఏడాది ఆగస్టు 30వ తేదీన డి వార్మింగ్ డేగా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు, జూనియర్ కాలేజీలతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు అల్బెండజోల్-400 గ్రాముల మాత్ర నమిలి వేయించాలని సూచించారు. ఒకటి నుంచి రెండేళ్ళ పిల్లలను అంగన్వాడీ కేంద్రాల ద్వారా గుర్తించి సగం మాత్ర వేయించేలా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. అలాగే రెండేళ్ల నుండి ఐదేళ్ల వరకు ఒక మాత్ర, ఆరు నుంచి 18 ఏళ్ల వరకు విద్యార్థులకు రెండు మాత్రలు వేయించాలని అన్నారు. ప్రతి పాఠశాలలో ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం అయిదు గంటల వరకు నిర్ధేశించిన ప్రణాళిక పద్ధతిలో కార్యక్రమం ఉంటుందన్నారు. మధ్యాహ్నం భోజనం తరువాత చేతులు పరిశుభ్రంగా కడిగి మాత్రలు వేయించాలని ఆయా అధికారులకు సూచించారు. అలాగే ప్రతి ఒక్క విద్యార్థి మాత్ర వేసుకునే విధంగా పర్యవేక్షించడానికి మండల స్థాయిలో పిహెచ్‌సి వైద్యాధికారి, ఎంపిడివో, ఎంఈవో, సిడిపివో, సిఆర్‌పిలను నియమించినట్టు తెలిపారు. జిల్లాస్థాయిలో డిఎంహెచ్‌వో, డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్, రాష్ట్రీయ బాల స్వాస్త్య కారక్రమం, ప్రోగ్రాం అధికారి, జిల్లా విద్యాశాఖాధికారి, ఆర్‌విఎం పివో, ఐసిడిఎస్ పివో తదితరులను వినియోగించనున్నట్టు పేర్కొన్నారు. సమావేశంలో ఆయనతో పాటు ఆర్‌బిఎస్‌కె డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ డాక్టర్ మెండ ప్రవీణ్, డిప్యూటీ డిఎంహెచ్‌వో డాక్టర్ దవళ భాస్కరరావు, డిఐవో డాక్టర్ హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఆగని దందా
ఆమదాలవలస, ఆగస్టు 29: చెట్టుపేరు చెప్పుకొని కాయలు అమ్మడం అనే పెద్దల సామెతలా కొందరు టిడిపి చోటానాయకులు స్థానిక ఎమ్మెల్యే పేరు చెప్పి మండలంలోగల వంశధార, నాగావళి నధుల్లో ఇసుక తవ్వకాలు జోరుగా సాగిస్తున్నారు. సోమవారం అక్రమంగా తరలిస్తున్న ఐదు ఇసుక లారీలను స్థానిక పోలీసులు పట్టుకొని సీజ్ చేశారు. ఈ ప్రాంతంలో చెవ్వాకులపేట, పురుషోత్తపురం, దూసి, ముద్దాడపేట, తొర్లాడ, ఇసుకలపేట వంటి ఇసుక ర్యాంపుల వద్ద కొందరు దేశంనాయకులు ఉచిత ఇసుక ముగిసినప్పటికీ రాత్రింబవళ్లు తేడా లేకుండా యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు సాగిస్తూ విశాఖపట్నం లారీలతో తరలిస్తున్నారు. రోజుకు లక్షల రూపాయల విలువ గల ఇసుక అక్రమంగా తరలిపోతోంది. ప్రజా ఆస్తిపట్టపగలే చోటానాయకులు ఇసుక దోపిడీ చేస్తుండటంతో వీరి తీరుపై పలువురు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వీరిపై అధికారులకు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ పట్టించుకోకపోవడంతో పలువురు మీడియా ప్రతినిధులను ఆశ్రయిస్తున్నారు. ప్రతీ రోజూ సుమారు 150నుండి 200 ట్రాక్టర్ల వరకు ఇసుక లోడ్ డంపింగ్‌చేసి లారీలకు లోడింగ్ చేస్తున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలపై ఎవరైనా ప్రశ్నిస్తే ఎమ్మెల్యే మనుషులమని చెప్పి అన్న అండదండలతోనే ఇసుక దర్జాగా తీసుకెళ్తున్నామని వీరు బహిరంగంగా చెబుతున్నారు. వంశధారలో నీరు ప్రవహిస్తున్నప్పటికీ ప్రమాదం అని తెలిసి కూడా ట్రాక్టర్లు నదిలో దించి అక్రమంగా రవాణా సాగిస్తున్నారు.
సాగుదారులకు పొంచి ఉన్న ముప్పు
వంశధార, నాగావళి నదుల్లో ఇసుక తవ్వకం వలన నీటిమట్టం తగ్గే ప్రమాదం ఉందని దీని వలన కాలువలకు సరిగ్గా నీరు అందే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నదుల్లో ఇసుక తవ్వకాలు వలన నదీపరివాహక ప్రాంతాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు. తొగరాం ఇసుక రీచ్ నుంచి అక్కడ వైసిపి నేతలు నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు సాగించి కాసులు కూడేసుకుంటూ అధికారులకు మాత్రం విప్ పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడటం కొసమెరుపు.
* నాకు సంబంధం లేదు: విప్ రవికుమార్
ఇసుక అక్రమతవ్వకాలు, లారీ లోడింగ్‌లపై నాకు ఎటువంటి సంబంధంలేదని ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కూన రవికుమార్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఇసుక అక్రమతవ్వకాలకు చేసినా.. లారీలకు లోడింగ్ చేసినా... ఎంతటివ్యక్తులనైనా క్షమించేది లేదని రవికుమార్ హెచ్చరించారు. తనకు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే ఏ పార్టీ వ్యక్తులైనా, అభిమానులైనా, స్నేహితులైనా ఎవరినీ ఉపేక్షించేది లేదని విప్ హెచ్చరించారు. ఈ మేరకు వీరిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు ఆయన తెలిపారు.

వ్యక్తి దారుణ హత్య!
శ్రీకాకుళం, ఆగస్టు 29: నగరంలో పొట్టి శ్రీరాములు కూడలిలోగల భాగ్యలక్ష్మి నూతన్ స్వీట్ షాపులో ఉన్న గుడ్ల వెంకటరమణను కత్తితో గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. సుమారు 8.45 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి షాపులో చొరబడి వెంకటరమణపై ఒకే ఉదుటన కత్త్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయాలపాలైన వెంకటరమణ రక్షించండి.. రక్షించండంటూ పరుగు తీసే క్రమంలో ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి కుప్పకూలిపోయాడు. సంఘటనను తెలుసుకున్న బంధువులు ఆసుపత్రికి తరలిస్తుండగా వెంకటరమణ మృతిచెందాడు. దాడికి పాల్పడ్డ గుర్తుతెలియని వ్యక్తి పరారయ్యాడు. ఓ వైపు ఒన్‌టౌన్ పోలీసు స్టేషన్, మరోవైపు డిఎస్పీ కార్యాలయాలకు మధ్య ఉన్న పొట్టి శ్రీరాములు కూడలిలో ఇటువంటి దారుణం చోటుచేసుకోవడం ఇదే మొదటిసారి. నిత్యం జనం రద్దీ మధ్య కిక్కిరిసిన ఈ కూడలిలో ఇటువంటి హత్య జరగడంతో నగరవాసులు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. శ్రీకాకుళం డిఎస్పీ భార్గవరావునాయుడు ఘటనాస్థలానికి చేరుకుని సిబ్బందిని అప్రమత్తం చేశారు. డాగ్స్ స్కాడ్ క్లూస్‌టీమ్‌ను రంగంలోకి దింపి హత్యకు పాల్పడ్డ వ్యక్తి కదలిలపై మరింత నిఘా పెట్టి గాలింపు ముమ్మరం చేశారు.

అనుమతి ఉన్నచోటే ఇసుక తవ్వకాలు సాగించాలి
గార, ఆగస్టు 29: ప్రభుత్వం అనుమతి ఉన్నచోటే ఇసుక తవ్వకాలు సాగించాలని లేకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని తహశీల్దారు ఎ.సింహాచలం హెచ్చరించారు. మండలంలో వివిధ ప్రాంతాల్లోని ఇసుక రేవుల్లో గడచిన కొంత కాలంగా జరుగుతున్న అక్రమ తవ్వకాలపై ట్రాక్టర్లు యజమానులు, జె.సి.బి. యజమానులతో తహశీల్దారు సింహాచలం సోమవారం తన కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం మండల కేంద్రంలో ఇసుక తవ్వకాలుకు అనుమతి ఇచ్చిందని, అనుమతి ఉన్న చోటే తవ్వకాలు సాగించాలన్నారు. అనుమతి లేనిచోట తవ్వకాలు సాగించినట్లైతే అక్రమతవ్వకాలుగా భావించి శాఖాపరమైన చర్యలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో ట్రాక్టర్లు యజమానులతో పాటు ఎస్సై సత్యన్నారాయణ, ఎం.పి.డి.ఓ. ఆర్.స్వరూపరాణి, ఆర్.ఐ. డబ్బీరు రామక్రిష్ణ, రెవెన్యూ కార్యదర్శులు ఉన్నారు.

క్రీడాహబ్‌గా రాష్ట్రం
శ్రీకాకుళం, ఆగస్టు 29: రాష్ట్రాన్ని క్రీడాహబ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు రాష్ట్ర కార్మిక శాఖామంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా సోమవారం ఉదయం స్థానిక కోడిరామ్మూర్తి స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవ కార్యక్రమాన్ని జిల్లా క్రీడాపాధికార సంస్థ నిర్వహించింది. మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని, మాట్లాడారు. అతిపెద్ద దేశమైన భారత్ క్రీడల్లో వెనుకబడివుందని, అందుకే క్రీడలను ప్రోత్సహించి రాష్ట్రాన్ని క్రీడాహబ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట ముఖ్యమంత్రి తీవ్ర కృషి చేస్తున్నట్టు తెలిపారు. అందులో భాగంగా అమరావతిలో స్పోర్ట్స్ విలేజ్‌ను ఏర్పాటుచేయనున్నట్టు చెప్పారు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ సౌజన్యంతో 200 ఎకరాలలో విశాఖలో స్టేడియంను నిర్మించనున్నట్టుతెలిపారు. 2018లో నిర్వహించే జాతీయ క్రీడల్లో రెండుమూడు క్రీడలు ఈ స్టేడియంలో నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. అంతేగాక ప్రతీ మండల పరిధిలో మినీ స్టేడియం నిర్మాణాలకు స్థలాలను పరిశీలిస్తున్నామని, 30 మండలాల్లో స్థల సేకరణ పూర్తయ్యిందని, మిగిలిన మండలాల్లో కూడా స్థల సేకరణ పూర్తయిన తరువాత మండల స్థాయి స్టేడియంల నిర్మాణాలు చేపట్టనున్నట్టుచెప్పారు. పాఠశాలల్లో సరైన క్రీడామైదానాలు లేవని, తగిన స్థలాలను సేకరించి క్రీడలను ప్రోత్సహించనున్నట్టుచెప్పారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ చౌదరి ధనలక్ష్మీ మాట్లాడుతూ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి చేరుకోవాలని, అందుకు ఇప్పటినుండే తగిన శిక్షణను పొందాలన్నారు.
ఎమ్మెల్యే లక్ష్మీదేవి మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించే ఉద్దేశంతో వివిధ క్రీడల్లో గెలుపొందిన విజేతలకు సత్కరిస్తున్నట్టుచెప్పారు. కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం మాట్లాడుతూ ప్రముఖ హాకీప్లేయర్ ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకొంటున్నట్టుచెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ బ్రహ్మారెడ్డి, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్‌కుమార్, చౌదరి సత్యన్నారాయణ, వివిధ విభాగాల అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, పిఇటిలు, క్రీడాకారులు పాల్గొన్నారు.

డయల్ యువర్ కలెక్టర్‌కు 15 వినతులు
శ్రీకాకుళం(టౌన్), ఆగస్టు 29: జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి 15 వినతులు అందాయి. వినతులను ఫోన్‌లో జెడ్పీ సీఈవో బి.నగేష్, డిఆర్‌డిఎ పిడి జి.సి.కిషోర్‌కుమార్‌లు వినతులు స్వీకరించారు. వజ్రపుకొత్తూరు మండలం ఉద్దానం ప్రాంతం గోపినాథపురం గ్రామం నుండి కె.మోహనరావు ఫోన్‌లో మాట్లాడుతూ గ్రామంలో వీధిలైట్లు, మురికి నీరు పోవడానికి కాలువలు వేయాలని కోరారు. మందస మండలం హరిపురం గ్రామం నుండి ఇ.వెంకటరావు ఫోన్‌చేస్తూ శ్రీకూర్మం దేవస్థానం పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎచ్చెర్ల మండలం అల్లినగరం గ్రామం నుండి ఎం.రామలక్ష్మి మాట్లాడుతూ అల్లినగరం జెడ్పీ హైస్కూల్‌లో వర్కు ఇన్‌స్పెక్టర్ పోస్టు నియమించాలని కోరారు
అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదగాలి
బలగ, ఆగస్టు 29: జిల్లాలోని క్రీడాకారులు అంతర్జాతీయస్థాయికి ఎదిగి రానున్న ఒలింపిక్స్‌లో రాష్ట్రాన్ని మొదటిస్థానం నిలపాలని క్రీడాకారులను కోరారు. ఇప్పటికే కరణం మల్లేశ్వరి వంటి క్రీడాకారులు అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చారని, అటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని క్రీడాకారులకు పిలుపునిచ్చారు. మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి పురస్కరించుకుని సోమవారం ఉదయం స్థానిక పొట్టి శ్రీరాములు కూడలి వద్ద జాతీయ క్రీడా దినోత్సవ ర్యాలీని జిల్లా క్రీడాప్రాదికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించింది. శాసనసభ్యులు గుండ లక్ష్మీదేవి, కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం పాల్గొని ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంతర్జాతీయ క్రీడాకారుల స్పూర్తితో ప్రతి ఒక్క క్రీడాకారుడు అంతర్జాతీయస్థాయికి ఎదిగి రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలీని అకాక్షించారు. క్రీడల పట్ల అవగాహన పెంపొందించుకుని క్రీడలపై ఆసక్తి
ఉపాధి కూలీ చెల్లించండి
శ్రీకాకుళం(టౌన్), ఆగస్టు 29: జిల్లాలోని సారవకోట మండలం నౌతల గ్రామం నుండి డోల రోహిణి తాను ఏప్రిల్ నెలలో స్వచ్ఛ్భారత్ కార్యక్రమంలో బాగంగా ఉపాధి పనులు చేసానని, అయితే ఇంతవరకు కూలీ చెల్లించలేదని ఫిర్యాదు చేసారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన కలెక్టర్ ప్రజా ఫిర్యాదుల విభాగంలో కలెక్టర్ పి.లక్ష్మీనృసింహంతో పాటు జాయింట్ కలెక్టర్-2 పి.రజనీకాంతారావు వినతులు స్వీకరించారు. గార మండలం శ్రీకూర్మాం గ్రామం నుండి పట్నాల చిన్నోడు, పట్నాల అప్పన్నమ్మలు ప్రభుత్వం ప్రకటించిన పంట రుణమాఫీ వర్తింపు చేయలేదని, పరిశీలించి రుణమాఫీ చేయాలని కోరారు. నరసన్నపేట మండలం నడగాం గ్రామం నుండి దుంపాక అప్పలనాయుడు మొదటి విడత, రెండవ విడత పంట రుణమాఫీలో తన పేరువున్నా నరసన్నపేట కో ఆపరేటివ్ బ్యాంకు వారు రెండవ విడత డబ్బులు చెల్లించి మొదటి విడత రుణమాఫీ రాలేదంటున్నారని తెలిపారు. నగరంనుండి ఎం.దమయంతి, ఇప్పిలి రమణమ్మలు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు అందజేసారు. సోంపేట నుండి తెల్లి కుమారి తనకు వితంతు పింఛను మంజూరు చేయాలని వినతిపత్రం అందజేసారు. కార్యక్రమంలో జెడ్పీ సిఈవో బి.నగేష్, డిఆర్‌డిఎ పిడి జి.సి.కిషోర్ కుమార్, డిపివో మోహనరావు, ఐసిడియస్ పిడి లీలావతి పాల్గొన్నారు. పెంచుకోవాలన్నారు.